జ‌గ‌న్‌పై న‌మ్మ‌కం అంటే ఇదే…!

November 21, 2018 at 11:46 am

రాజ‌కీయాల్లో ఉండ‌డ‌మే కాదు.. పార్టీకి విధేయ‌త‌గా… అంత‌కు మించి పార్టీ అధినేత‌కు న‌మ్మిన బంట్లుగా ఉండ‌డం అంత ఈజీకాదు. న‌మ్మి టికెట్ ఇచ్చి.. శ్ర‌మ‌ప‌డి గెలిపించిన అనేక మంది నాయ‌కులు సొంత పార్టీల‌కు వెన్నుపోటు పొడిచి.. జంప్ జిలానీలుగా మారిపోయిన ప‌రిస్థితి తెలిసిందే. నిజానికి ఏపీలో అటు ఉమ్మ‌డి ఏపీ కానీ, ఇప్పుడు కానీ, ఇలాంటి జంప్ జిలానీల‌తో ఇబ్బంది ప‌డిన పార్టీ ఏదైనా ఉంది అంటే.. అది వైసీపీనే!! న‌మ్మిన నాయకుడిని న‌ట్టేట ముంచి ప‌ద‌వుల ఆశ‌ల‌తో ప‌క్క‌పార్టీల్లోకి జంప్ చేసిన ఎమ్మెల్యేలు న్న ఈ పార్టీలో… జ‌గ‌న్‌ను దేవుడిగా.. త‌మ మి త్రుడుగా.. అంత‌కు మించి ఆప్యాయ‌త కురిపించే సొంత మ‌నిషిగా చూసుకునే నాయ‌కులు కూడా ఉన్నారంటే.. ఒకింత ఆశ్చ‌ర్యం వేయ‌కమానదు.gouru-charitha-reddy

నిజానికి ఇలాంటి నాయ‌కులు కూడా ఇప్పటి రాజ‌కీయాల్లో ఉన్నారా? అని అనిపిస్తుంది. మ‌రి ఇలాంటి నాయ‌కులు ఉన్నార‌ని నిరూపిస్తు న్నారు వైసీపీకి చెందిన ఎమ్మెల్యే దంప‌తులు! 2014 ఎన్నిక‌ల త‌ర్వాత‌.. క‌ర్నూలు జిల్లా వైసీపీకి కంచుకోట‌గా మారింది. రెండు ఎంపీ స్థానాలూ వైసీపీ ఖాతాలోకే ప‌డ్డాయి. ఎమ్మెల్యేలు కూడా ఎక్కువ‌మంది గెలుపొందారు. అయితే, త‌ర్వాత కాలంలో నాయ‌కులు వారి వారి స్వార్థ ప్ర‌యోజ‌నాల కోసం.. టీడీపీ లోకి జంప్ చేశారు. అయితే, క‌ర్నూలు జిల్లా పాణ్యం నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం సాధించిన గౌరు చ‌రితా రెడ్డి ఆమె భ‌ర్త‌ వెంక‌ట‌రెడ్డి పార్టీలోనే ఉండిపోయారు. అనేక ప్ర‌లోభాలు ఎదురైనా.. ప‌ద‌వుల ఆశ చూపించినా కూడా చ‌రిత ఒక్క అడుగుకూడా పార్టీ ల‌క్ష్మ‌ణ రేఖ‌ను దాట‌లేదు.46458570_2048834978470292_2138857176121212928_n

నిజానికి 2016-17 మ‌ధ్య కాలంలో చ‌రిత పార్టీ మారిపోతుంద‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగింది. వాస్త‌వానికి ఈ ప్ర‌చారాన్ని తెర‌మీదికి తెచ్చింది కూడా వైసీపీ నాయ‌కులే. అయితే, చ‌రిత మాత్రం పార్టీలోనే ఉండి యాక్టివ్ రోల్ పోషిస్తూ.. జ‌గ‌న్ సూచ‌న‌లు, స‌ల‌హాల‌కు అనుగుణంగా ప్ర‌జ‌ల్లో తిరుగుతుంటే.. చ‌రిత పార్టీ మారిపోతుంద‌ని ప్ర‌చారం చేసిన వారు మాత్రం పార్టీ మారిపోవ‌డం చిత్ర విచిత్రం!! క‌ట్ చేస్తే.. మ‌రో నాలుగు మాసాల్లోనే ఏపీలో ఎన్నిక‌లు ఉన్నాయి. దీంతో అన్ని పార్టీల మాదిరిగానే వైసీపీలోనూ టికెట్ల హ‌డావుడి ప్రారంభ‌మైం ది. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో చ‌రిత‌కు టికెట్ ఇవ్వ‌ర‌ని, జ‌గ‌న్ వేరేవారికి మాటిచ్చార‌ని.. కొన్నాళ్లుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. దీంతో చ‌రిత అనుచ‌రులు కూడా డోలాయ‌మానంలో ప‌డ్డారు. ఇప్ప‌టికే ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో జ‌గ‌న్‌.. ఇంచార్జుల‌ను మార్చేయ‌డంతో.. పాణ్యంపై జ‌రుగుతున్న ప్ర‌చారం కూడా నిజ‌మేన‌ని అనుకుంటున్నారు.15203388_878127548990997_7918096801300383068_n

అయితే, ఈ ప్ర‌చారానికి చ‌రిత త‌న‌దైన శైలిలో చెక్ పెట్టారు. గౌరు పార్టీ మారుతున్నట్లు ప్రచారం చేసే వాళ్లే ఇతర పార్టీల్లోకి వెళ్లిపోయారని, తాము మాత్రం వైసీపీలో వైఎస్‌ జగన్‌కు అండగా ఉంటామని చ‌రిత వెల్ల‌డించారు. అంతేకాదు, జ‌గ‌న్‌పై త‌మ ప‌ట్ల జ‌రుగుతున్న ప్ర‌చారాన్ని ఆమె ఖండించారు. పాణ్యం ఎమ్మెల్యే టికెట్‌ గౌరు చరితకే వస్తుందని, జగన్‌తో కొట్లాడి టికెట్‌ తెచ్చుకునే చనువు తమకు ఉందని ఎమ్మెల్యే భ‌ర్త‌ గౌరు వెంకటరెడ్డి స్పష్టం చేయ‌డంలో వీరికి జ‌గ‌న్‌పై ఉన్న న‌మ్మ‌కం ఏమిటో అంద‌రికీ అర్ధ‌మైంది. అంతేకాదు.. పార్టీలో ఉన్న ప‌ట్టు, నిబద్ధ‌త‌ల‌పైనా చ‌ర్చ‌సాగుతుండ‌డం విశేషం. ఈ నేప‌థ్యంలోనే శ‌భాష్ చ‌రిత‌! జ‌గ‌న్‌కు స‌రైన సైన్యం!!- అనే నినాదం పాణ్యంలో మార్మోగుతోంది.

జ‌గ‌న్‌పై న‌మ్మ‌కం అంటే ఇదే…!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share