కేసీఆర్ బాట‌లోనే జ‌గ‌న్‌..సోషల్ ట్రెండ్ !

January 11, 2019 at 1:27 pm

వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. కేసీఆర్ బాట‌లోనే న‌డుస్తారా? ఆయ‌న అనుస‌రించిన వ్యూహాన్నే జ‌గ‌న్‌కూడా అనుస‌రిస్తారా? ఇప్పుడు సోష‌ల్ మీడియాలో ఈ ప్ర‌శ్న‌లు జోరుగా ట్రెండ్ అవుతున్నారు. ఇలా ఈ ప్ర‌శ్న‌లు తెర‌మీదికి రావ‌డానికి కూడా చాలా కార‌ణాలే క‌నిపిస్తున్నాయి. ఆది నుంచి కూడా కేసీఆర్‌-జ‌గ‌న్ ల మ‌ధ్య సుహృద్భావ వాతావ‌ర‌ణ‌మే నెల‌కొంది. ఈ క్ర‌మంలోనే పార్టీ నుంచి ఎంపీ స‌హా ప‌లువురు ఎమ్మెల్యేలు కేసీఆర్ గూటికి చేరిపోయినా జ‌గ‌న్ స్పందించ‌లేదు. ఇక‌, ఇటీవ‌ల జ‌రిగిన తెలంగాణా ఎన్నిక‌ల్లోనూ పోటీకి దూరంగా ఉన్నారు.ఈ క్ర‌మంలో త‌న కు పోటీ రాకుండా ఏపీలో అధికారం కోసం పోరాడుతున్న జ‌గ‌న్ ప‌ట్ల కేసీఆర్‌కు సాధార‌ణంగానే స్నేహ భావం ఉండి ఉంటుంది.

మ‌రోప‌క్క‌, ఏపీలో అధికారంలో ఉండి కూడా తెలంగాణాలో కేసీఆర్ ను శాసించాల‌ని చూసిన చంద్ర‌బాబుపై ప‌గ తీర్చుకో వాల‌నే ఆలోచ‌న కూడా కేసీఆర్‌కు ఉంది. ఈ నేప‌థ్యంలోనే జ‌గ‌న్‌కు ఆయ‌న అన్ని విధాలా సాయం చేసేందుకు రెడీ అవుతున్నారు. తాజాగా జ‌రిగిన ప‌రిణామం బ‌లాన్ని చేకూరుస్తోంది. సుదీర్ఘ పాద‌యాత్ర‌ను ముగించిన జ‌గ‌న్‌..తిరుప‌తికి వెళ్లి ..శ్రీవారిని ద‌ర్శించుకున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న శార‌దాపీఠంలోని స్వ‌రూపానందేంద్ర‌ను క‌లుసుకున్నారు. దాదాపు ఇద్ద‌రు కూడా 40 నిమిషాల సేపు చ‌ర్చించుకున్నార‌ని స‌మాచారం. ఈ నేప‌థ్యంలోనే అనేక వ్యాఖ్య‌లు వెలుగు చూస్తున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం కోసం చూస్తున్న జ‌గ‌న్‌తో స్వ‌రూపానందేంద్ర స్వామి కూడా పూజ‌లు, యాగాలు చేయిస్తారా? అని!

తెలంగాణా ఎన్నిక‌ల‌కు 20 రోజుల ముందు కేసీఆర్‌తో రాజ‌శ్యామ‌ల యాగం చేయించారు స్వ‌రూపానంద‌. ఇప్పుడు ఏపీలో నూ జ‌గ‌న్‌తో ఇదే త‌ర‌హా యాగం చేయిస్తారా అనే చ‌ర్చ సాగుతోంది. నిజానికి ఇలా చేయిస్తే.. మ‌రోప‌క్క‌, రాజ‌కీయంగా ఏమైనా ఇబ్బందులు వ‌స్తాయా? అనే ప్ర‌శ్న‌కూడా త‌లెత్తుతోంది. ప్ర‌తి విష‌యాన్ని త‌న‌కు అనుకూలంగా మ‌లుచుకుం టున్న సీఎం చంద్ర‌బాబు.. ఇప్పుడు జ‌గ‌న్ క‌నుక స్వ‌రూపానంద డైరెక్ష‌న్‌లో యాగానికి క‌నుక సిద్ధ‌మైతే.. దీనిని కూడా త‌న‌కు అనుకూలంగా మార్చుకునేందుకు ప్ర‌య‌త్నిస్తార‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. అలాగ‌ని యాగాల‌ను కూడా కాద‌న‌లేని ప‌రిస్థితి. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో చూడాలి.

కేసీఆర్ బాట‌లోనే జ‌గ‌న్‌..సోషల్ ట్రెండ్ !
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share