ప‌వ‌న్ పాద‌యాత్ర‌.. జ‌గ‌న్‌కు ప్ల‌స్సా…. మైన‌స్సా..!

November 22, 2017 at 12:19 pm
5SE4YROj

రాష్ట్రంలో 2019 ఎన్నిక‌ల వేడి బాగానే క‌నిపిస్తోంది. అధికార పక్షంలోను, విప‌క్షంలోనూ వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి స్ప‌ష్ట‌మైన వ్యూహ ప్ర‌తివ్యూహాలు క‌నిపిస్తున్నాయి. 2019లో అధికారంలోకి వ‌చ్చేందుకు వైసీపీ అధినేత జ‌గ‌న్ ఇప్ప‌టికే అనేక ర‌కాల హామీలు ఇచ్చారు. ప్ర‌జ‌ల్లో నిత్యం త‌న పేరు మార్మోగేలా ఉంటుంద‌ని భావించి ప్ర‌జాసంక‌ల్ప యాత్ర పేరుతో పాద‌యాత్ర‌కు కూడా సిద్ధ‌మ‌య్యారు. ఇక‌, అధికార ప‌క్షం అభివృద్ధి నినాదంతో ముందుకు వెళ్తోంది. అదేస‌మ‌యంలో ఆక‌ర్ష్ మంత్రం జ‌పిస్తూ.. వైసీపీ నేత‌ల‌ను త‌మ పార్టీలోకి చేర్చుకునేందుకు ఇప్ప‌టికీ పావులు క‌దుపుతూనే ఉంది. ఇలా అధికార, విప‌క్షాలు 2019 ఎన్నిక‌ల‌ను దృష్టి పెట్టుకుని భారీ ఎత్తున రాజ‌కీయాలు చేస్తున్నాయి. 

ఇక‌, ఇప్పుడు మూడో ప‌క్షంగా రాజ‌కీయాల‌ను శాసించాల‌ని భావిస్తున్న ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా రంగంలోకి దిగుతున్నారు. ఈయ‌న‌కు కూడా 2019 ఎన్నిక‌లే టార్గెట్‌గా క‌నిపిస్తున్నాయి. వాస్త‌వానికి 2014లో పార్టీ పెట్టినా..అ ప్ప‌ట్లో కేవ‌లం చంద్ర‌బాబు, బీజేపీల‌కు మ‌ద్ద‌తివ్వ‌డంతోనే స‌రిపెట్టారు. అయితే, 2019 ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో ఆయ‌న కూడా పార్టీ కార్య‌క్ర‌మాల‌కు, ప్ర‌జ‌ల‌ను త‌న‌వైపు తిప్పుకునేందుకు ప్రాధాన్యం ఇచ్చే కార్య‌క్ర‌మాల‌కు శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా ఆయ‌న పాద‌యాత్ర‌, లేదా బ‌స్సు యాత్ర‌ల‌కు సిద్ధం అవుతున్న‌ట్టు కొన్నాళ్ల కింద‌టే స‌మాచారం బ‌య‌ట‌కు వ‌చింది. తాజాగా ఆయ‌న లండ‌న్ నుంచి తిరిగి వ‌చ్చారు. ఇక‌, పార్టీని బ‌లోపేతం చేయ‌డంపైనే దృష్టి పెట్ట‌నున్నార‌నే కామెంట్లు వినిపిస్తున్నాయి. 

ముఖ్యంగా ప‌వ‌న్ పాద‌యాత్ర లేదా బ‌స్సు యాత్ర చేప‌ట్ట‌డం ద్వారా, తాను, త‌న పార్టీ రెండూ కూడా ప్ర‌జ‌ల్లో విస్తృతంగా ప్ర‌చారంలోకి వ‌చ్చే అవ‌కాశం ఉంటుంద‌ని ఆయ‌న భావిస్తున్నారు. ఇదే జ‌రిగితే.. రాబోయే రోజుల్లో త‌న‌కు తిరుగు కూడా ఉండ‌ద‌ని ఆయ‌న భావిస్తున్నారు. అయితే, ఇప్ప‌టికే పాద‌యాత్ర చేస్తున్న జ‌గ‌న్‌తో పోల్చుకుంటే ప‌వ‌న్ పాద‌యాత్ర ఏ రేంజ్‌లో ఉంటుంది?  దాని ప్ర‌భావం ఎంత‌?  ప్ర‌జ‌ల‌ను ప‌వ‌న్ త‌న‌వైపు తిప్పుకోగ‌ల‌డా ?   పాద‌యాత్ర లేదా బ‌స్సు యాత్ర విజ‌య‌వంతం అవుతాయా ? అనే సందేహాలు అనేకం ఇప్పుడు రాజ‌కీయ నేత‌ల్లో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. 

వీటిని ప‌రిశీలించిన‌ప్పుడు ప్ర‌స్తుతం జ‌గ‌న్‌కు ఉన్న ఆద‌ర‌ణ ఒకింత ప‌ల‌చ‌బ‌డింద‌నే చెప్పాలి. మొద‌టి నాలుగు రోజులు వ‌చ్చిన జ‌నాలు ఇప్పుడు జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు పెద్ద‌గా స్పందించ‌డం లేదు. మీడియా ప్ర‌చారం లేక‌పోవ‌డంతో ఆయ‌న పాద‌యాత్ర ఇప్పుడు ఎక్క‌డా చ‌ర్చ‌లో లేకుండా పోయింది. ఇక‌, ప‌వ‌న్ పాద‌యాత్ర‌/బ‌స్సు యాత్ర చేప‌డితే స‌హ‌జంగానే ఆయ‌న న‌టుడు, యూత్ ఫాలోయింగ్ ఉన్న‌వాడు కావ‌డం వ‌ల్ల విప‌రీత‌మైన ప్ర‌జాద‌ర‌ణ ఉంటుంద‌నడంలో ఎలాంటి సందేహం లేదు. జ‌నాలు కుప్ప‌లు తెప్ప‌లుగా వ‌స్తార‌ని చెప్ప‌డంలోనూ ఎలాంటి సందేహం లేదు. అయితే, ఇలా వ‌చ్చిన‌వారంతా ఓటు బ్యాంకుగా మార‌తారా?  ప‌వ‌న్‌కే ఓటేస్తారా? అన్న‌దే ఇప్పుడు ప్ర‌ధాన చ‌ర్చ‌నీయాంశం.  నంద్యాల ఉప ఎన్నిక స‌హా 2014 ఎన్నిక‌ల్లోనూ జ‌గ‌న్ స‌భ‌ల‌కు జ‌నాలు ఇస‌కేస్తే రాల‌నంత‌గా వ‌చ్చారు. కానీ ప్ర‌యోజ‌నం ఏంటి?  కాబ‌ట్టి ప‌వ‌న్ ప్ర‌భావం జ‌గ‌న్‌పై ప‌డుతుంది అన‌డంలో సందేహం లేదు. 

ప‌వ‌న్ పాద‌యాత్ర‌.. జ‌గ‌న్‌కు ప్ల‌స్సా…. మైన‌స్సా..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share