జ‌గ‌న్.. పోరుబాట ఖాయం.. ముహూర్త‌మే త‌రువాయి!

June 9, 2018 at 2:25 pm
ysjagan-mps

కేంద్రంపై వైసీపీ అధినేత జ‌గ‌న్ ఒక్క‌మాట కూడా అన‌డం లేదు! ఆయ‌న కేంద్రంతో చెలిమి చేస్తున్నారు! అందుకే రాష్ట్రానికి ఇంత అన్యాయం చేస్తున్న కేంద్రాన్ని ఒక్క‌మాటా ఆయ‌న విమ‌ర్శించ‌డం లేదు! ఇదీ.. గ‌త కొన్నాళ్లుగా టీడీపీ అధినేత చంద్ర‌బాబు, ఆయ‌న ప‌రివారం చేస్తున్న విమ‌ర్శ‌లు. అయితే, ఇప్ప‌టి వ‌ర‌కు ఈ విమ‌ర్శ‌ల‌పై స్పందించ‌ని జ‌గ‌న్‌.. బాబు అండ్‌కోకు త‌గిన విధంగా స‌మాధానం చెప్పేందుకు రెడీఅయ్యార‌ని తాజా వైసీపీ ప‌రిణామాల‌ను బ‌ట్టి స్ప‌ష్ట‌మ‌వుతోంది. 

 

నిజానికి చంద్ర‌బాబు విమ‌ర్శించిన‌ట్టు.. వైసీపీ ఎంపీలు త‌మ రాజీనామాల‌ను ఎందుకు ఆమోదించుకో లేదు.. అనే అంశం.. ఫార్టీ ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీకి తెలియందికాదు. రాజీనామాలు చేయ‌డం వ‌ర‌కే స‌భ్యుల ప‌ని. వాటిని ఆమోదించ‌డం అనేది పూర్తిగా స్పీక‌ర్ విచ‌ణాధికారం కింద‌కే వ‌స్తుంది. మ‌రి ఆ అధికారాల్లోకి కూడా వైసీపీ ఎంపీలు చొర‌బ‌డి పోవాలా?! ఈ విష‌యం తొలిసారి ఎంపీలుగా ఎన్నికైన వారు సైతం చెప్పేస్తారు. 

 

ఇక‌, ఇప్ప‌టి వ‌ర‌కు కేంద్రంపై ఒక్క మాట కూడా అన‌ని జ‌గ‌న్‌.. ఇక నుంచి చంద్ర‌బాబుకు దిమ్మ‌తిరిగిపోయేలా కేంద్రాన్ని టార్గెట్ చేస్తార‌ని తెలుస్తోంది. వైసీపీ కీల‌క నాయ‌కులు నిన్నటికి నిన్న జ‌గ‌న్ ఆదేశాల‌కు అనుగుణంగా హైద‌రాబాద్‌లోని లోట‌స్ పాండ్‌లో స‌మావేశ మ‌య్యారు. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు ముందుగానే ఐదు ఎంపీ స్థానాల‌కూ ఉప ఎన్నిక‌లు వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్ట‌యితే.. తాము ఎందుకు రాజీనామాలు చేయాల్సి వ‌చ్చిందో ప్ర‌జ‌లకు చెప్పాల‌ని స‌వివ‌రంగా వివ‌రించాల‌ని కూడా నిర్ణ‌యించుకున్నారు. 

 

ఈ క్ర‌మంలోనే కేంద్రం ఏపీకి ఎలాంటి హామీలు ఇచ్చింది. ఎలా తుంగ‌లో తొక్కింది కూడా చెప్పాల‌ని అనుకుంటున్నారు. ఇక‌, అదే స‌మ‌యంలో.. జ‌గ‌న్ ఏపీలో అదికార టీడీపీ కేంద్రంతో ఎలా లాలూచీ ప‌డిందో కూడా చెప్పాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు స‌మాచారం. మ‌రో ప‌ది ప‌దిహేను రోజుల్లో.. ఎంపీల రాజీనామాలు ఆమోదం పొందే అవ‌కాశం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. దీంతో ఉప ఎన్ని క‌లు వ‌చ్చే ఛాన్స్ ఉంద‌ని తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో ఎంపీలు ఐదుగురు త‌మ త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో పెద్ద ఎత్తున ప్ర‌చా రానికి సిద్ధ‌మ‌వుతున్నారు. 

 

ఈ సంద‌ర్భంగా నాటి మ‌న్మోహ‌న్ హామీ, అదేస‌మ‌యంలో ప్ర‌స్తుత ఉప రాష్ట్ర‌ప‌తి వెంక య్య అప్ప ట్లో కోరిన హామీలు ఇలా అన్నింటినీ ప్ర‌జ‌ల్లోకి తీసుకు వెళ్లాల‌ని నిర్ణ‌యించారు. ఇక‌, 2014 ఎన్నిక‌ల త‌ర్వా త కేంద్రం నుంచి ఎన్ని నిధులు వ‌చ్చాయి. చంద్ర‌బాబు ఏం చేశారు? వ‌ంటి విష‌యాల‌ను కూడా ఏక‌రువు పెట్ట‌ను న్నారు. ఈ క్ర‌మంలోనే కేంద్రంపై విమ‌ర్శ‌లు సంధించేందుకు ప‌క్కా ప్ర‌ణాళిక‌ను కూడా సిద్ధం చేయాల‌ని తాజా స‌మావేశంలో వైసీపీ నిర్ణ‌యించిన‌ట్టు తెలుస్తోంది. అయితే, వైసీపీ ఎంపీలు నోరువిప్పితే.. బాబుగారి బాగోతం కూడా బ‌య‌ట‌ప‌డుతుంద‌ని అంటున్నారు. మ‌రి దీనికి కూడా బాబు సిద్ధం కావాల్సి ఉంటుందని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూద్దాం. 

జ‌గ‌న్.. పోరుబాట ఖాయం.. ముహూర్త‌మే త‌రువాయి!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share