జ‌గ‌న్ ముందు ప‌వ‌న్ బ‌లాదూర్‌.. రీజ‌న్ ఇదే…!

November 20, 2018 at 12:04 pm

రాజ‌కీయాల్లో నేత‌ల విశ్వ‌స‌నీయ‌త‌కు ప్ర‌జ‌లు పెద్ద‌పీట వేస్తున్నారు. నేత‌లు ఎన్నిమాట‌లు చెప్పార‌నే విష‌యాన్ని వారు ప‌ట్టించుకునే ప‌రిస్థితి ఇప్పుడు లేదు. అయితే, ఎంత నిజాయితీతో చెబుతున్నారు. ఎంత నిబ‌ద్ధ‌త‌తో చెబుతున్నారు. అనే విష‌యాల‌ను మాత్రం ప్ర‌జ‌లు ఎప్ప‌టిక‌ప్పుడు గ‌మనిస్తున్నారు. రాష్ట్రంలో రాజ‌కీయాలు కీల‌క ద‌శ‌కు చేరుకున్నాయి. మ‌రో నాలుగు నెలల్లోనే ఎన్నిక‌లు ఉన్నాయి. ఈ క్ర‌మంలో పార్టీల అధినేత ప‌నితీరు, వారి వ్య‌వ‌హార శైలి.. వంటి కీల‌క అంశాల‌పై ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ సాగుతోంది. ముఖ్యంగా మేదావులు, పారిశ్రామిక వ‌ర్గాలు, వృత్తినిపుణులు, ఉద్య‌మ‌కారులు కూడా రాష్ట్రంలో రాజ‌కీయ నేత‌ల వ్య‌వ‌హారాన్ని గ‌ట్టిగా ప‌రిశీలిస్తున్నారు.09-VJ-PAWANwe

మాట‌కు క‌ట్టుబ‌డేనాయ‌కుడు లేని ఈ రోజుల్లో ఒక్క జ‌గ‌న్ మాత్ర‌మే మాట‌కు క‌ట్టుబ‌డిన నాయ‌కుడిగా.. మ‌డ‌మ తిప్ప‌ని నాయ‌కుడిగా ప్ర‌జ‌ల‌కు క‌నిపిస్తున్నార‌ని అంటున్నారు విశ్లేష‌కులు. రాష్ట్రంలో అధికార పార్టీ టీడీపీని ప‌క్క‌న పెడితే.. పోటీ కి వ‌స్తున్న మ‌రో కీల‌క పార్టీ జ‌న‌సేన‌. అయితే, వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎవ‌రి ప్ర‌భావం ఎక్కువ‌. ఎవ‌రు ప్ర‌జ‌ల‌పై ఎక్కవ ప్ర‌భావం చూపించ‌గ‌లుగుతారు? అనే అంశాల‌ను ప‌రిశీలించిన‌ప్పుడు .. చాలా ఆస‌క్తిక‌ర అంశాలు వెలుగులోకి వ‌స్తు న్నాయి. ప‌వ‌న్ కు త‌న మాట‌ల‌పై త‌న‌కే న‌మ్మ‌కం లేదు.. అనే విష‌యం స్ప‌ష్ట‌మైంది. ఇక‌, రాజ‌కీయాల్లో ఆయ‌న వేసిన అంచ‌నాలు అన్నీ కూడా త‌ల్ల‌కిందులు అయ్యాయి. ప్ర‌తి అడుగులోనూ ఆయ‌న నిబ‌ద్ధ‌త ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. 46503169_2047562401930883_7939312188424978432_n

2014లో అనుభ‌వ‌జ్ఞుడు, సీనియ‌ర్ అయిన చంద్ర‌బాబుకు మ‌ద్ద‌తిచ్చాన‌ని చెప్పిన ప‌వ‌న్‌.. ఇప్పుడు త‌న నిర్ణ‌యం త‌ప్ప ని. ఓ అవినీతి ప‌రుడికి అండ‌గా నిలిచాన‌ని చెప్పుకొచ్చారు. ఇక‌, శ్రీకాకుళం బాధితుల‌కు అండ‌గా ఉంటాన‌ని చెప్పినా.. అది నోటి మాట‌కే మిగిలిపోయింది. రాజ‌ధాని రైతుల ప‌రిస్థితి, ఆక్వా క‌ర్మాగారం విష‌యం.. ఇలా ప్ర‌తి విష‌యంలోనూ ప‌వ‌న్ త‌ను ఇచ్చిన మాట‌ను త‌ప్పుతూనే ఉన్నారు. ఇక‌, ప్ర‌త్యేక హోదా విష‌యంలో నిల‌దీస్తాన‌ని చెప్పి.. నేటికీ చేసింది ఏమీలేదు. క‌ట్ చేస్తే.. జ‌గ‌న్ విష‌యాన్ని తీసుకుంటే.. ఆయ‌న ఇచ్చిన మాట‌ల‌ను ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్ని ఇబ్బం దులు వ‌చ్చినా.. వెనక్కి తీసుకున్న‌ది లేదు. త‌న పార్టీ ఎమ్మెల్యేల‌ను ఫిరాయించేలా చేసిన చంద్ర‌బాబు దిగి వ‌చ్చేవ ర‌కు అసెంబ్లీలో కాలు పెట్టేది లేద‌ని చెప్పిన జ‌గ‌న్‌.. ఇప్ప‌ట వ‌ర‌కుఅసెంబ్లీ గుమ్మం తొక్క‌లేదు.

అదేస‌మ‌యంలో ప్ర‌త్యేక హోదా కోసం ఆయ‌న రోడ్డెక్కారు. దీనిని స‌జీవంగా ఉంచారు. విశాఖ విమానాశ్ర‌యంలో అడ్డు కున్నా కూడా..జ‌గ‌న్ వెనుదిర‌గ‌లేదు. ప్ర‌జాసంక‌ల్ప యాత్ర‌కు అడుగ‌డుగునా దుష్ట శ‌క్తులు అడ్డుప‌డ్డా కూడా జ‌గ‌న్ వెనక్కి త‌గ్గ‌లేదు. ఇక‌, విశాఖ విమానాశ్రయంలో జ‌గ‌న్‌పై కోడి క‌త్తితో హ‌త్యాయ‌త్నం జ‌రిగినా వెనుదిరిగి చూసుకోకుండా నిత్యం ప్ర‌జ‌ల్లోనే ఉంటున్నారు. ఈ నేప‌థ్యంలో మాట త‌ప్ప‌ని, మ‌డ‌మ తిప్ప‌ని జ‌గ‌న్ ముందు .. ప‌వ‌న్ బ‌లాదూర్ అంటున్నారు. ఇక్క‌డే కొస‌మెరుపు ఏంటంటే.. నిత్యం జ‌గ‌న్‌ను తిట్టిపోసే.. అన‌కాప‌ల్లి మాజీ ఎంపీ స‌బ్బం హ‌రి కూడా ఇటీవ‌ల .. జ‌గ‌న్‌కు ప్ర‌త్యామ్నాయం లేదు. టీడీపీకి వైసీపీల మ‌ధ్యే వ‌చ్చే ఎన్నికల్లో పోరు! అని తేల్చి చెప్ప‌డం గ‌మ‌నార్హం.

జ‌గ‌న్ ముందు ప‌వ‌న్ బ‌లాదూర్‌.. రీజ‌న్ ఇదే…!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share