ఆత్మల చుట్టూ పవన్,జగన్..?

November 5, 2018 at 4:10 pm

త్వరలో తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్న విషయం తెలిసిందే. కాకపోతే తెలంగాణలో వచ్చే నెల లోనే ఎన్నికలు జరుగబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఇక్కడి అధికార పార్టీ టీఆర్ఎస్, ప్రతిపక్ష పార్టీ టీ కాంగ్రెస్ ఎన్నికల హడావుడిలో మునిగిపోయారు. అయితే అధికార పార్టీ టీఆర్ఎస్ ని ఎలాగైనా ఓడించాలని టి కాంగ్రెస్, టిటీడిపి, తెలంగాణ జనసమితి, సిపిఐ లు పొత్తు పెట్టుకొని మహాకూటమిగా మారబోతున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు మొన్నటి వరకు తెలంగాణలో పోటీ చేసి ఇక్కడ కూడా జెండా ఎగుర వేస్తాం అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాన్.45398118_709898596076085_4193934199020847104_n

గతంలో తెలంగాణలో వైసీపీకి కొంత బలం ఉందని..వైసీపీ అన్నా దివంగత నేత రాజశేఖర్ రెడ్డి అన్నా ఇక్కడ అభిమానం ఉంది..ఇక్కడ కూడా ఎన్నికల బరిలో దిగుతామని చెప్పారు వైసీపీ నేత వైఎస్ జగన్. వీరిద్దరూ..ఆ మ‌ధ్య మీడియా స‌మావేశంలో కూడా రెండు మూడు రోజుల్లో ఓ క్లారిటీ ఇస్తాన‌ని చెప్పారు. నాలుగు రోజుల్లో నోటిఫికేష‌న్ రాబోతున్నా ఇంత‌వ‌ర‌కూ ఆ క్లారిటీ ఏంటో తేల‌లేదు. అయితే తెలంగాణలో గ‌త ఎన్నిక‌ల్లో ఆ పార్టీ త‌రపున‌ ముగ్గురు ఎమ్మెల్యేలు గెలిచినా త‌ర్వాత వారంతా టీఆరెస్ లో చేరిపోయారు. చివ‌రికి వైసీపీ తెలంగాణా అధ్య‌క్షుడుగా ఉన్న ఎంపీ పొంగులేటి కూడా టి.ఆర్.ఎస్‌. తీర్ధం పుచ్చుకున్నారు.IN28YSJAGAN

దాంతో తెలంగాణలో వైసీపీ పూర్తిగా నిష్క్రమించిందని అంటున్నారు పలువురు నాయకులు. మరోవైపు ఏపీలో మరో నాలుగు నెలల్లో ఎన్నికలు జరిగే నేపథ్యంలో టీడీపీ, వైసీసీ, జనసేన నాయకులు హోరా హోరీగా ప్రచారాలు మొదలు పెట్టారు. కాకపోతే తెలంగాణ విషయంలో మాత్రం ఇరు నేతలు ‘మీ ఆత్మ‌ప్ర‌బోధానుసారం ఓటు వేయండి’ అని ఈ ఇరువురు నాయ‌కులు ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంద‌ట‌.

ఆత్మల చుట్టూ పవన్,జగన్..?
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share