పవన్ చేస్తే సంసారం..! జగన్ చేస్తే వ్యభిసారమా ..!

June 11, 2018 at 1:47 pm
jagan-pawan

ఎదుటి వారిని వేలెత్తి చూపితే మూడు వేళ్లు మ‌న‌ల్ని చూపుతాయ‌న్న విష‌యాన్ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌రిచిపోయిన‌ట్లున్నార‌నే విమ‌ర్శ‌లు ఇటీవ‌ల వెల్లువెత్తుతున్నాయి. ప్ర‌జా పోరాట యాత్ర పేరుతో రాష్ట్ర‌మంత‌టా ప‌ర్య‌ట‌న‌లు చేస్తూ.. పార్టీని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. 2014 ఎన్నిక‌ల్లో పోటీచేయ‌క‌పోవ‌డం చారిత్ర‌క త‌ప్పిద‌మంటూ ఇప్పుడు బాధ‌ప‌డుతున్నాడు. మొన్న‌టివ‌ర‌కూ పార్టీ గురించి, ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేయ‌డానికే ప‌రిమిత‌మైన ప‌వ‌న్‌.. అధికారం గురించి, సీఎం ప‌ద‌వి గురించి ప్ర‌సంగాలు ఇస్తున్నాడు. గ‌తంలో వైఎస్సార్ సీపీ అధినేత జ‌గ‌న్‌.. ముఖ్య‌మంత్రి అవ‌డం గురించి ఎక్క‌డైనా మాట్లాడితే అనుభ‌వం లేద‌ని, అర్హ‌త లేదంటూ విమ‌ర్శించిన ప‌వ‌న్‌.. ఇప్పుడ అదే మాట‌లు మాట్లాట‌డంపై రాజ‌కీయ విమ‌ర్శ‌కులు ఘాటైన విమ‌ర్శ‌లే చేస్తున్నారు. ఇత‌రులు చేస్తే త‌ప్పు.. తాను చేస్తే క‌రెక్ట్ అన్న చందంగా వ్య‌వ‌హ‌రిస్తున్నాడ‌ని విశ్లేషిస్తున్నారు. 

 

2019లో జ‌న‌సేన త‌ప్ప‌కుండా అధికారంలోకి వ‌స్తుంద‌ని న‌మ్మ‌కంతో ఉన్నాడు ప‌వ‌న్ క‌ల్యాణ్‌. వచ్చే ఎన్నిక‌ల్లో కీల‌కంగా మారుతుంద‌నే ఆత్మ‌విశ్వాసంతో ఉన్నాడు. ఇది అతి విశ్వాసంగా మారుతోంద‌ని, గాలిలో మేడ‌లు క‌డుతున్నాడ‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తూనే ఉన్నాయి. అధికారంలోకి రావ‌డం అంత సులువు కాద‌నే విష‌యం అన్న చిరంజీవిని చూసైనా తెలుసుకోవాల‌ని చుర‌క‌లు కూడా అంటిస్తున్నారు విశ్లేష‌కులు.  ప్ర‌స్తుతం ప‌వ‌న్ ప్ర‌సంగాల్లో ప‌రిప‌క్వ‌త లోపించిందని గుర్తుచేస్తున్నారు. 2014 ఎన్నిక‌ల్లో తాను చంద్ర‌బాబు నాయుడికి ఎందుకు మ‌ద్ద‌తు ఇవ్వాల్సి వ‌చ్చిందో.. ఎందుకు విడిపోవాల్సి వ‌చ్చిందో పవ‌న్ ప‌దేప‌దే చెబుతున్నాడు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయ‌డానికి పాల‌నానుభ‌వం ఉన్న నేత అవ‌స‌ర‌మ‌ని భావించి ఆయ‌న‌కు స‌పోర్ట్ చేశానని వివ‌రిస్తున్నాడు. 

 

అదే స‌మ‌యంలో వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు అనుభ‌వం లేదంటూ ప్ర‌సంగాల్లో విరుచుకుప‌డ్డాడు. ఇప్పుడు అదే ప‌వ‌న్‌.. త‌నకు అధికారం క‌ట్టబెట్టాలని ప్ర‌జ‌ల‌ను కోరుతుండ‌టంపై అంతా ఆశ్చర్యం వ్య‌క్తంచేస్తున్నారు. త‌న‌కు ఏ ప‌రిపాల‌న అనుభ‌వం ఉందని ఇలా అడుగుతున్నాడు అనే సందేహాలు అంద‌రిలోనూ వ్య‌క్త‌మ‌వుతున్నాయి. దేశంలో ప్రజలు చాలా మంది కొత్త వాళ్లను, ఏ మాత్రం పాలన అనుభవం లేని వాళ్లను సీఎంగా చేసుకున్నారు. సినీ నటుడిగా తప్ప ఎన్టీఆర్ కు ఉన్న అనుభవం ఏమిటి? ఆయ‌న త‌ర్వాత ముఖ్యమంత్రి అయిన చంద్రబాబుకు అంతకు ముందున్న‌ అనుభవమేమిటి? 2008 లో పార్టీ పెట్టి సీఎం కావాలని వచ్చిన చిరంజీవికి ఉన్న‌ పూర్వానుభవం ఏమిటి? ఇలా ఎవరికీ అక్కర్లేద‌ని చెప్పి తనను తాను సమర్థించుకుంటున్నాడు పవన్ కల్యాణ్.

 

వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని అంటున్నాడు జనసేన అధినేత. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని అంటే.. ముఖ్యమంత్రి అవుతాననే కదా? లేక పవన్ కల్యాణ్ మాటలకు వేరే భాష్యం ఏదైనా ఉందనుకోవాలా? అది ఆయనకే తెలియాలి. మరి పవన్ కల్యాణ్ కు ఉన్న అనుభవం ఏమిటో కూడా ఆయనకే తెలియాలి. జగన్ ముఖ్యమంత్రిని అవుతా అనకూడదు, తమ ప్రభుత్వం వస్తుందని జగన్ అనకూడదు.. అలా అంటే ఆయనకు అధికారం మీద ఆశ అని విమర్శించాడు పీకే. ఇప్పుడు తాను ప్రభుత్వం ఏర్పాటు చేస్తానని అంటాడు, అధికారం సాధించి సమస్యలను పరిష్కారిస్తానని అంటాడు. మ‌రి దీనిని ఏమ‌నుకోవాలి?  తాను చేస్తే శృంగారం, వేరే వాళ్లు చేస్తే వ్యభిచారమ‌నేగా ప‌వ‌న్ చెప్పేది!!

పవన్ చేస్తే సంసారం..! జగన్ చేస్తే వ్యభిసారమా ..!
0 votes, 0.00 avg. rating (0% score)

comments



Related Posts


Share
Share