౩౦౦౦ కిలోమీటర్ల జగన్ పాదయాత్ర …వైసీపీ కి కలికితురాయి

September 25, 2018 at 5:50 pm

జ‌నం వెంట జ‌గ‌న్‌.. జ‌గ‌న్ వెంట జ‌నం! ఇదీ విప‌క్ష నేత వైసీపీ అధినేత జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జాసంకల్ప పాద‌యాత్ర‌కు ల‌భించిన, ల‌భిస్తున్న అపూర్వ ఆద‌ర‌ణ‌. ప్ర‌జావ్య‌తిరేక పాల‌న‌పై, ప్ర‌జ‌ల క‌ష్టాలు, క‌న్నీళ్ల‌పై జ‌గ‌న్ సంధించిన ప్ర‌జా సంక‌ల్ప పాద‌యాత్ర బాణం.. ల‌క్ష్యం చేరువ‌లోకి శ‌ర‌వేగంగా దూసుకుపోతోంది. సుదీర్ఘ ల‌క్ష్యాన్ని నిర్ణ‌యించుకోవ‌డ‌మే కాదు.. అనేక ఇబ్బందులు వ‌చ్చినా.. అధికార పార్టీ నేత‌లు ఇష్టానుసారంగా మాట్లాడినా కూడా జ‌గ‌న్ త‌న ల‌క్ష్య సాధ‌న‌లో మ‌డ‌మ‌తిప్ప‌లేదు! ఎన్ని ర‌కాలుగా స‌మ‌స్య‌లు వ‌చ్చినా ఆయ‌న వెన్ను చూప‌లేదు. ఈ క్ర‌మంలోనే గ‌త ఏడాది న‌వంబ‌రు 6న ప్రారంభ‌మైన ప్ర‌జాసంక‌ల్ప పాద‌యాత్ర అప్ర‌తిహ‌తంగా ఇప్ప‌టికీ ముందుకు సాగుతోంది.42388227_1972226532797804_6053425231668707328_n

తాజాగా ల‌క్షిత దూరంలో 3000 కిలోమీట‌ర్లు పూర్తి చేసుకుని అశేష జ‌న విశ్వాసం స‌హా ఆద‌ర‌ణ చూర‌గొంది. నిజానికి జ‌గ‌న్ పాద‌యాత్ర ప్రారంభించే స‌మ‌యానికి ఇంత ఆద‌ర‌ణ‌ను ఆయ‌న ఊహించుకోలేదు. ఎక్కడ ఇడుపులపాయ? ఎక్కడ విజయనగరం జిల్లాలోని కొత్త వలస..? అని విశ్లేష‌కులు సైతం ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. నిజంగా మూడు వేల కిలోమీటర్లు నడవగలుగుతామా? అని యాత్ర ప్రారంభంలో వైసీపీ నాయ‌కులు త‌మ అంత‌రంగిక సంభాష‌ణ‌ల్లో వ్య‌క్తం చేసిన అనుమానం. అంతేకాదు, అధికార టీడీపీ నేత‌లు బ‌హిరంగంగానే ఎద్దేవా చేశారు.

ల‌క్ష్యం పెట్టుకోవ‌డం కాదు.. దానిని పూర్తి చేసిన‌ప్పుడు చూద్దాంలే! అని వ్యాఖ్యానించారు. అయితే, పైన దేవుడున్నాడు.. కింద ప్రజలున్నారు.. వాళ్లే నడిపిస్తారనే భావంతో జ‌గ‌న్ వేసిన ప్ర‌తి అడుగు విజ‌యానికి చేరువ చేసింది. స‌రిగ్గా 3,000 కిలోమీటర్లు నడిచిన తర్వాత జ‌గ‌న్‌లో పొడ చూపిన ఆ ఆనంద‌మే వేరు. పైన దేవుడున్నాడు. కింద అభిమానించే ప్రజలున్నారని ఆయ‌న అమిత‌మైన ఆనందంతో వ్య‌క్తీక‌రించారు. నడిచేది తానైనా.. నడిపించింది మాత్రం ప్ర‌జా అభిమానమే’ అని ప్రతిపక్ష నేత అన‌డం ఆయ‌నలోని ప్ర‌జా సంక‌ల్పాన్ని వెల్ల‌డిస్తోంది. మొత్తంగా 269 రోజులుగా సాగుతున్న ప్ర‌జాసంక‌ల్ప యాత్ర విశాఖపట్టణం జిల్లా నుంచి విజయనగరం జిల్లాలోకి ప్రవేశించింది. 200000

ఈ నేపథ్యంలో 3,000 కిలోమీటర్ల మైలు రాయిని కూడా అధిగమించారు. ఈ సందర్భంగా ఎస్‌.కోట శాసనసభా నియోజకవర్గంలోని కొత్తవలస రైల్వే జంక్షన్‌ సమీపంలో జరిగిన భారీ బహిరంగ సభలో జగన్‌ ప్రసంగించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు దమ్ము, ధైర్యం ఉంటే రాష్ట్రంలో నాలుగున్నరేళ్లుగా రైతులు పడుతున్న కష్టాల గురించి అమెరికాలో చెప్పగలరా? అని నిలదీశారు. ప్ర‌స్తుతం అమెరికాలో ఉన్న చంద్ర‌బాబు ప్ర‌కృతి వ్య‌వ‌సాయంపై ప్ర‌పంచానికి పాఠాలు నేర్పుతున్నారు. ఇక‌, జ‌గ‌న్ పాద‌యాత్ర తుది అంకానికి చేరుకుంది. మ‌రో జిల్లాశ్రీకాకుళంతో ఆయ‌న పాద‌యాత్ర ప‌రిస‌మాప్త మ‌వుతుంది.

౩౦౦౦ కిలోమీటర్ల జగన్ పాదయాత్ర …వైసీపీ కి కలికితురాయి
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share