జగన్ జైత్రయాత్ర ..!

January 9, 2019 at 10:55 am

పీడిత ప్రజల గుండెల్లో ధైర్యం నింపి వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని, భరోసా కల్పించే లక్ష్యంతో వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్ర జైత్రయాత్రలా మారింది. చరిత్రలో నిచిపోయేలా ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ఏడాది నవంబర్ 6 వ తేదీన కడప జిల్లాలోని ఇడుపులపాయలో చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నేటితో ముగియనుంది.49435999_2119811818039274_4342369321037594624_n 

వజ్ర సంకల్పంతో దాదాపు పద్నాలుగు నెలల పాటు పదమూడు జిల్లాలగుండా 3648 కి.మీ సాగించిన పాదయాత్ర దేశ రాజకీయాల్లో నూతన అధ్యాయానికి నాంది పలికింది. నిప్పులు చెరిగే ఎండనూ,  కుండపోత వానను, వణికించే చలిని సైతం లెక్కచేయకుండా, నగరాలు, పట్టణాలు, పల్లెలు తేడా లేకుండా సాగిన పాదయాత్రకు అడుగడుగునా ప్రజలు బ్రహ్మ రథం పట్టారు.

ఇడుపులపాయలో వేసిన తొలి అడుగు..కోట్లాది హృదయాలను గెలుచుకుంటూ ఇఛ్చాపురంలో ఆఖరి ఘట్టాన్ని ఆవిష్కరించేందుకు సిద్దమైంది. రాష్ట్రంలోని పదమూడు జిల్లాల గుండా అలుపెరుగని పాదయాత్ర సాగిస్తున్న జగన్ వెంట కోట్లాది అడుగులు కదిలాయి. ఆయన నడిచిన ప్రతి దారిలో జనం ప్రభంజనమై సాగింది. ప్రతి బహిరంగ సభకు ఇసుక వేస్తే రాలనంత జనం పోటెత్తింది. ప్రభంజనంలా సాగిన పాదయాత్రకు ఊరురా జనం ఘన స్వాగతం పలికారు. తమ సమస్యలు వినే నాయకుడు వచ్చాడంటూ బాధితులు తరలి వచ్చారు. సమస్యలతో సతమతమవుతున్న వారంతా ఆయనను బాధలు చెప్పుకొని ఉపశమనం పొందారు. అధికార పార్టీ దుర్మార్గాలను అవినీతిని నిర్లక్ష్యపాలనను జగన్ నిగ్గదీసినప్పుడు జనం ఆయనకు మద్దతు పలికారు. అక్రమార్కుల పాలనకు చరమగీతం పాడుతామంటూ ప్రతిన భూనారు.49713994_2118377284849394_4788504272905961472_n 

 చరిత్ర సృష్టించిన పాదయాత్రతో జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించిన వైఎస్ జగన్ ఇచ్ఛాపురం వేదికగా 2019 సమర శంఖాన్ని పూరించనున్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే చేపట్టబోయే అభివృద్ధిని వివరిస్తూ ఇచ్ఛాపురం వేధికగా ఒక సందేశాన్ని రాష్ట్ర ప్రజలకు ఇవ్వనున్నారు. కాగా జగన్ కు సంఘీభావం పలికేందుకు ఇప్పటికే తండోపతండాలుగా వైసీపీ శ్రేణులు, ప్రజలు ఇచ్ఛాపురం చేరుకున్నారు. 

జగన్ జైత్రయాత్ర ..!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share