ఈ చరిత్రకు ముగింపు లేదు ..మరో చరిత్రకు నాంది : జగన్

January 9, 2019 at 6:54 pm

చ‌రిత్ర‌ను సృష్టించ‌డం, ఆ చ‌రిత్ర‌ను తిర‌గ‌రాయ‌డం అంటే మామూలు విష‌యం కాదు. ఇప్పుడు ఇలాంటి ప‌రిణామ‌మే ఏపీలో చోటు చేసుకుంది. ఒక‌రు కాదు ఇద్ద‌రు కాదు.. ఏకంగా ఒకే కుటుంబం నుంచి ముగ్గురు కీల‌క నాయ‌కులు ప్ర‌జ‌ల కోసం ప్ర‌జ‌ల చేత, ప్ర‌జ‌ల కొర‌కు నిర్వ‌చించ‌బ‌డిన ప్ర‌జాస్వామ్యంలో ఆసేతు హిమాచ‌లం గ‌ర్వించేలా ప్ర‌జ‌ల కోసం మేమున్నామంటూ న‌డుంబిగించిన చ‌రిత్ర న‌భూతో.. ఇక‌, ఇప్పుడు న‌భవిష్య‌తి అని అన‌కుండా ఉండ‌లేం. ప్ర‌జ‌లే ప్ర‌భువులైన ప్ర‌జాస్వామ్యంలో వారి క‌ష్టాలు, క‌న్నీళ్లు తెలుసుకునేందుకు రాజ‌కీయ‌నేత‌లు త‌మ త‌మ పంథాల్లో అనేక మార్గాలు ఎంచుకుంటారు. అయితే, పాద‌యాత్ర ద్వారా ప్ర‌తి గుమ్మాన్నీ ప‌ల‌క‌రించ‌డం, సుదీర్ఘ ల‌క్ష్యాల‌ను పెట్టుకుని ముందుకు సాగ‌డం అనేవి చారిత్ర‌క ఘ‌ట్టాలుగానే నిలిచిపోతాయి.49949174_2133180726721212_1131121758145871872_n

ఈ సాహ‌సం చేయ‌డంలో ఏ మాత్రం వెనుక‌డుగు వేయ‌ని చ‌రిత్ర‌ను సొంతం చేసుకుంది వైఎస్ కుటుంబం. ఆయ‌న బిడ్డ‌లు ఇద్ద‌రూ కూడా ఆయ‌న బాట‌లోనే ముందుకు సాగారు. ఏపీ రాజ‌కీయాల్లో ఇలా పాద‌యాత్ర ద్వారా ప్ర‌జ‌ల‌కు చేరువైన కుటుంబం ఏదైనా ఉంటే అది ఒక్క వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి కుటుంబ‌మ‌నే చెప్పాలి. ప్ర‌జల క‌ష్టాలు తెలుసుకొ నేందుకు వారికి చేరువ కావ‌డం మిన‌హా మ‌రో మార్గం లేద‌ని గుర్తించిన వైఎస్ ప్రారంభించిన పాద‌యాత్ర రాష్ట్రంలో కాంగ్రెస్‌కు మేలు మలుపు. సుప్త చేత‌నావ‌స్థ‌లో ఉన్న పార్టీని అధికారంలోకి తీసుకువ‌చ్చిన ఘ‌న‌త వైఎస్‌కే ద‌క్కుతుంది. అయితే, ఆ త‌ర్వాత కూడా ఈ కుటుంబం ప్ర‌జ‌లకు అత్యంత చేరువే అయింది.49633284_2120051148015341_8394387247863955456_n

తండ్రి వార‌స‌త్వాన్ని పుణికి పుచ్చుకున్న ఆయ‌న కుమార్తె ష‌ర్మిల కూడా త‌న అన్న జ‌గ‌న్ కోసం ఉమ్మ‌డి రాష్ట్రంలో పాద‌యాత్ర చేసిన ఘ‌ట‌న అంద‌రికీ గుర్తింది. ఇక‌, ఇప్పుడు జ‌గ‌న్ చేసిన పాద‌యాత్ర మ‌రిన్ని రికార్డులు కైవ‌సం చేసుకుంది. వైఎస్‌ రాజశేఖరరెడ్డి తనయుడిగా జగన్‌కు ఉన్న పేరు ప్రతిష్టలు వేరు.. ప్రజాసంకల్ప యాత్ర ద్వారా జగన్‌ ఎదిగిన తీరు వేరు. ప్రజలలో విశ్వాసాన్ని ప్రోదిచేసిన ఆయన ప్రతిభ అనన్యం. గతానికి భిన్నంగా ఆయన పొందిన గుర్తింపు అద్భుతం. ఎదురులేని నేతగా జనం మదిలో నిలిచిపోయారు. తండ్రిని మించిన తనయుడయ్యారు. ప్రజలు ఆయన్ను ప్రేమించి అక్కున చేర్చుకున్నారు. ప్రేమాభిమానాలు చూపారు. అనురాగ ఆత్మీయతలను పంచారు. తాను ప్రసంగించిన సభల్లో చెప్పిన అంశాలు ప్రత్యేకించి నవరత్నాలు ప్రజల్ని ఆలోచింపజేశాయి.49562459_2133180293387922_8529626160173154304_n

ఆ ఒక్క‌టే కాకుండా స‌మాజంలోని అందిరికీ అన్నీ అనే త‌ర‌హాలో.. వ్యవసాయ సంక్షోభం, రైతుల ఆత్మహత్యలు, అవ్వాతాతల పింఛన్లు, వైఎస్సార్‌ చేయూత వంటి అంశాలను ఆయన జనంలోకి చొచ్చుకుపోయేలా చేయగలిగారు. జనం కోసం జనం మధ్య జనంతోనే అనే వాటికి సాక్షర రూపంగా నిలవగలిగారు. ఫలితంగా మహానేత వైఎస్సార్‌ను చూసిన కళ్లు జగన్‌ను చూడడం అలవర్చుకున్నాయి. సుదీర్ఘ యాత్రతో ఆయన అందరి వాడయ్యారు. దాదాపు 3650 కిలో మీట‌ర్ల దూరాన్ని 14 నెల‌ల‌కు పైగా రోజులపాటు శ్ర‌మించి, ఇష్టంగా ప్ర‌జ‌ల మ‌ధ్య ఉంటూ.. పాద‌యాత్ర ద్వారా వారి క‌ష్టాలు తెలుసుకుంటూ ముందుకు సాగిన తీరు న‌భూతో న‌భ‌విష్య‌తి. ఇది చ‌రిత్ర‌ను తిర‌గ రాయ‌డ‌మే అవుతుంద‌న‌డంలో సందేహం లేదు. నేటితో ఈయాత్ర‌కు ముగింపు ప‌లుకుతున్నా.. మ‌రో ప్ర‌స్థానానికి జ‌గ‌న్ సిద్ధం కానుండ‌డం గ‌మ‌నార్హం. అందుకే ఇది మ‌రో చ‌రిత్ర‌కు నాంది!!

ఈ చరిత్రకు ముగింపు లేదు ..మరో చరిత్రకు నాంది : జగన్
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share