పాద‌యాత్ర మ‌ళ్లీ వాయిదా.. రీజ‌న్ ఇదే..!

November 2, 2018 at 1:40 pm

వైసీపీ అధినేత జ‌గ‌న్ ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్రారంభించిన పాద‌యాత్రకు విశాఖలో జ‌రిగిన కోడి క‌త్తి ఘ‌ట‌న‌తో బ్రేక్ వ‌చ్చిన సం గ‌తి తెలిసిందే. గ‌త ఏడాది న‌వంబ‌రులో ప్రారంభించిన ఈ యాత్ర‌ను ఎన్ని అవాంత‌రాలు వ‌చ్చినా.. జ‌గ‌న్ కొన‌సాగి స్తూనే ఉన్నారు. ఆయ‌న‌కు ఆరోగ్యం స‌హ‌క‌రించ‌క‌పోయినా.. కూడా ఆయ‌న కొన‌సాగించారు. న‌డ‌ము నొప్పితో తీవ్ర ఇబ్బంది వ చ్చినా… పాదాలు పుళ్లు ప‌డిపోయినా కూడా వెనక్కి త‌గ్గ‌లేదు. అంతేకాదు, ఒకానొక ద‌శ‌లో ఆయ‌న‌కు జ్వ‌రం కూడా వ‌చ్చిం ది. అయినా కూడా జ‌గ‌న్ వెన‌క్కి త‌గ్గ‌కుండా ముందుకు సాగారు. ఇక‌, కోర్టుల కేసుల నేప‌థ్యంలో ఆయ‌న గురువారం మ ధ్యాహ్యానికి విరామం ఇస్తూ.. శుక్ర‌వారం హైద‌రాబాద్‌కు వెళ్లి వ‌చ్చారే త‌ప్ప పాద‌యాత్ర‌ను మాత్రం ఎక్క‌డా బ్రేక్ ఇవ్వ‌లేదు.43098173_1983308195022971_3701680884760444928_n

అయితే, తాజాగా క‌త్తి దాడి ఘ‌ట‌న నేప‌థ్యంలో ఎడ‌మ భుజానికి తీవ్ర గాయ‌మైన విష‌యం తెలిసిందే. విశాఖ విమానాశ్ర యంలో శ్రీనివాస్ అనే యువ‌కుడు కోడి పందేల‌కు వినియోగించే క‌త్తితో జ‌గ‌న్‌పై వ్యూహాత్మ‌కంగా దాడి చేశారు. ఇది హ‌త్యా ప్ర‌య‌త్న‌మేన‌ని పోలీసులు కూడా తేల్చి చెప్పారు. అయితే, తృటిలో జ‌గ‌న్ త‌ప్పించుకున్నారు. కానీ, ఈ క‌త్తి మాత్రం ఆయ‌న భుజంలోకి దూసుకుపోయింది. తొలుత దీనిని జ‌గ‌న్ తీవ్రంగా ప‌రిగ‌ణించ‌లేదు. చిన్న‌దేక‌దా అనుకున్నారు. ఈ క్ర‌మంలోనే విశాఖ‌లో దాడి జరిగిన వెంట‌నే ఫ‌స్ట్ ఎయిడ్ తీసుకుని హైద‌రాబాద్‌కు వెళ్లిపోయారు. అయితే, అక్క‌డికి వెళ్లాక‌.. నొప్పి తీవ్రం కావ‌డంతో ఆయ‌న హైద‌రాబాద్‌లోనే ఆస్ప‌త్రిలో చేరారు. ఈ గాయాన్ని ప‌రిశీలించిన వైద్యులు తొమ్మిది కుట్లు వేశారు.jagan_9824

ఇది మానుతోంద‌ని, అభిమానులు శాంతి యుతంగా ఉండాల‌ని జ‌గ‌న్ పిలుపునిచ్చారు ఎప్ప‌టిక‌ప్పుడు త‌న ఆరోగ్య ప‌రిస్థి తిని ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తూనే ఉన్నారు. ఈ క్ర‌మంలోనే నవంబ‌రు 2 అంటే శ‌నివారం నుంచి పాద‌యాత్ర మ‌ళ్లీ మొద‌ల‌వు తుంద‌ని జ‌గ‌న్ ప్ర‌క‌టించారు. దీనికి సంబంధించి విజ‌య‌న‌గ‌రంలో ఏర్పాట్లు కూడా శ‌ర‌వేగంగా సాగుతున్నాయి. అయితే, ఇంత‌లోనే శుక్ర‌వారం జ‌గ‌న్ ఆరోగ్యాన్ని ప‌రిశీలించిన వైద్యులు.. భుజం లోపల కండరాలకు తగిలిన గాయం మానలేదని, దీంతో జగన్ తన ఎడమ చెయ్యిని పైకి ఎత్తే పరిస్థితి లేద‌ని, ఇప్పుడున్న పరిస్థితుల్లో యాత్ర చేస్తే ఇబ్బందులు వస్తాయ ని చెప్పడంతో మ‌ళ్లీ పాద‌యాత్ర వాయిదా ప‌డింది. మ‌రో వారం రోజులు రెస్ట్ తీసుకోవాల‌ని జ‌గ‌న్‌కు ఆయ‌న వైద్యులు సూచించ‌డంతో పాద‌యాత్ర‌ను ఈ నెల 10 నుంచి తిరిగి ప్రారంభించాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు స‌మాచారం. మ‌రి ఏం జ‌రుగుతందో చూడాలి.

పాద‌యాత్ర మ‌ళ్లీ వాయిదా.. రీజ‌న్ ఇదే..!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share