జ‌గ‌న్ వాయిస్… ప్ర‌జ‌ల మాట‌.. ప్ర‌జ‌ల‌దే బాట‌

November 19, 2018 at 2:47 pm

అవును! ప్ర‌జానాయ‌కుడు ఎలా స్పందించాలో.. అలానే స్పందిస్తున్నాడు వైసీపీ అధినేత జ‌గ‌న్‌! ఆయ‌న వాయిస్‌లో మార్పు క‌నిపించ‌డం లేదు. నిజానికి విశాఖ విమానాశ్ర‌యంలో కోడి పందేల‌కు వినియోగించే క‌త్తితో త‌న‌పై హ‌త్యాయ‌త్నం జ‌రిగిన త‌ర్వాత‌.. దాదాపు మూడు వారాల పాటు ఆయ‌న ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హిస్తున్న ప్ర‌జాసంక‌ల్ప పాద‌యాత్ర‌కు బ్రేక్ వ‌చ్చింది. వాస్త‌వానికి పాద‌యాత్ర ప్రారంభించాక‌.. ఒక‌టి రెండు రోజుల గ్యాప్ మిన‌హా ఎన్న‌డూ ఇంత సుదీర్ఘ విరామం రానేలేదు. పైగా ఇది జ‌గ‌న్‌కు షాకింగ్ ఘ‌ట‌న‌. ఈ ఘ‌ట‌న అనంత‌రం తాజాగా ఆయ‌న మ‌ళ్లీ పాద‌యాత్ర ప్రారంభించారు. ఈ క్ర‌మంలో అంద‌రూ కూడా జ‌గ‌న్ వాయిస్ మారుతుంద‌ని, ఆయ‌న పంథా కూడా మారుతుంద‌ని అనుకున్నారు. ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డ‌తార‌ని, చంద్ర‌బాబుపైనా, టీడీపీ నేత‌ల‌పైనా విమ‌ర్శ‌లు చేస్తార‌ని అనుకున్నారు. నిజానికి ఇలా అనుకోవ‌డంలోనూ అర్ధం ఉంది.46325590_2041873409166449_968563439335112704_n

టీడీపీ అదినేత చంద్ర‌బాబు సాక్షాత్తూ.. కోడిక‌త్తి ఘ‌ట‌న‌ను జ‌గ‌నే చేయించుకున్నార‌ని, ఆయ‌న అభిమానితో ఆయ‌నే పొడిపించుకుని నాట‌కాలు ఆడుతున్నార‌ని చెప్పుకొచ్చారు. నిజానికి రాజ‌కీయంగా న‌ల‌భై ఏళ్ల సీనియార్టీ ఉంద‌ని, దేశంలో త‌న‌ను మించిన నాయ‌కుడు లేనేలేడ‌ని, త‌న‌కు తానే సాటి అని చెప్పుకొచ్చే చంద్ర‌బాబు ఇలా ఓ విప‌క్ష నాయ‌కుడిపై జ‌రిగిన దాడిని చుల‌క‌న‌గా చూడ‌డం, హేళ‌న‌గా మాట్లాడ‌డం అంద‌రినీ విస్మ‌యానికి గురి చేసింది. ఇక‌, ఆవు చేలో మేస్తే.. దూడ గ‌ట్టున మేస్తుందా? అన్న సామెత మాదిరిగా.. చంద్ర‌బాబే ఇలా అర్ధం లేని వ్యాఖ్య‌లు చేసి విష‌యాన్ని త‌ప్పుదారి ప‌ట్టించే ప్ర‌య‌త్నం చేస్తే.. మిగిలిన నాయ‌కులు ఊరుకుంటారా.. విజ‌య‌వాడ‌కు చెందిన ఎమ్మెల్యే వైవీబీ రాజేంద్ర ప్ర‌సాద్ ఏకంగా జ‌గ‌న్‌పై ఆయ‌న త‌ల్లి, చెల్లి కోడిక‌త్తితో దాడి చేయించార‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసి.. టీడీపీ ప‌రువును మరింత భ్ర‌ష్టు ప‌ట్టించారు.46414987_2044541382232985_3177556593881382912_n (1)

నిజానికి ఇలాంటి వ్యాఖ్య‌లు విన్న‌వారికి ఎవ‌రికైనా కోపం క‌ట్ట‌లు తెగుతుంది. ప్ర‌తి విమ‌ర్శ‌లు చేయ‌కుండా ఉండ‌లేరు. ముఖ్యంగా జ‌గ‌న్ వంటి యువ కెర‌టం మ‌రింత రెచ్చిపోతుంద‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ, జ‌గ‌న్ వ్యూహాత్మ‌కంగా త‌న‌లోని ప‌రిణితిని బ‌య‌ట పెట్టుకున్నారు. చంద్ర‌బాబు మాదిరిగానో లేక టీడీపీ నాయ‌కుల మాద‌రిగానో ఆయ‌న ఎక్క‌డా నోరు జార‌లేదు. విశాఖ విమానాశ్రయంలో తనపై సీఎం చంద్రబాబే దాడి చేయించకపోయుంటే స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయించాలని జగన్‌ డిమాండ్‌ చేశారు. అంతేకాదు, డబ్బులంటే తనకు వ్యామోహం లేదని, 30 ఏళ్లు సీఎంగా ఉండేలా పాలిస్తానని జగన్‌ వ్యాఖ్యానించారు. తాను చనిపోయిన తర్వాత కూడా ప్రతి ఇంట్లో తన తండ్రి ఫొటోతో పాటు తన ఫొటో కూడా ఉండాలన్నారు. చెడిపోయిన వ్యవస్థలోకి నిజాయతీ తన వల్లే సాధ్యమని చెప్పారు. కుట్రల గురించి మాట్లాడుతుంటే తన మనసు కలత చెందుతోందన్నారు. తన ఒంట్లో చివరి రక్తపు బొట్టు వరకు ప్రజల కోసం తపిస్తానని జగన్‌ చెప్పారు. దీనిని బ‌ట్టి.. ఇప్పుడు చంద్ర‌బాబు ప‌రిణితికి.. జ‌గ‌న్ ప‌రిణితికి ఎంత తేడా ఉందో!! అంటూ ప్ర‌జ‌లే ఆశ్చ‌ర్య‌పోతున్నారు..!

జ‌గ‌న్ వాయిస్… ప్ర‌జ‌ల మాట‌.. ప్ర‌జ‌ల‌దే బాట‌
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share