జగన్ కోసం పోలీసులు సంచలన నిర్ణయం

November 6, 2018 at 2:54 pm

వైసీపీ అధినేత‌, ఏపీ విప‌క్ష నేత‌కు ఏపీ ప్ర‌భుత్వం భ‌ద్ర‌త‌ను క‌ల్పించ‌డంలో విఫ‌ల‌మైంద‌నే వాద‌న నానాటికీ బ‌ల‌ప‌డు తోంది. ప్రొటోకాల్ ప్ర‌కారం సీఎం త‌ర్వాత సీఎం స్థాయిలో ఉన్న జ‌గ‌న్‌కు ఏపీలో పోలీసులు ఆయ‌న స్థాయికి త‌గిన విధంగ భ‌ద్ర‌త క‌ల్పించ‌లేక‌పోయారు. విశాఖ విమానాశ్ర‌యంలో ఆయ‌న‌పై జ‌రిగిన కోడి క‌త్తి దాడే దీనికి ప్ర‌ధాన ఉదాహ‌ర‌ణ‌. ఈ దాడి నిజానికి పోలీసుల వైఫ‌ల్యం కార‌ణంగానే జ‌రిగింద‌ని సీనియ‌ర్ ఐపీఎస్ అధికారులు సైతం అంత‌ర్గ‌త స‌మావేశాల్లో అంగీక‌రించారు. అయినా కూడా ప్ర‌భుత్వం నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టు వ్య‌వ‌హ‌రించింది. పైగా త‌న అభిమానితోనే జ‌గ‌న్ పొడిపించుకుని సానుభూతి రాజ‌కీయాల‌కు తెర‌దీ శార‌నే కోణంలో పోలీస్ బాస్ ఠాకూర్ వ్యాఖ్య‌లు చేశారు.1540897015-1859

ఇక‌, తాను సీనియ‌ర్‌న‌ని, త‌న‌కు ఎవ‌రూ రాజ‌కీయ పాఠాలు చెప్పాల్సిన అవ‌స‌రం లేద‌ని చెప్పుకొచ్చే చంద్ర‌బాబు సైతం జ‌గ‌న్ విష‌యంలో వివాదాస్ప‌దంగా వ్య‌వ‌హ‌రించారు. దాడి జ‌రిగి ఇన్నాళ్ల‌యినా క‌నీసం జ‌గ‌న్‌ను ప‌రామ‌ర్శించేందుకు ఆయ‌న‌కు తీరిక‌లేక‌పోగా విమ‌ర్శ‌లు చేసేందుకు మాత్రం స‌మ‌యం ఉంద‌నే వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియాలో హోరెత్తు తున్నాయి. ఇక‌, మ‌రో వారంలోగా జ‌గ‌న్ త‌న పాద‌యాత్ర‌ను తిరిగి ప్రారంభించాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఈ క్ర‌మంలో అయినా ఏపీ పోలీసులు ఆయ‌న‌కు నిర్దిష్టంగా క‌ల్పించే భ‌ద్ర‌త ఏంటో తెలియ‌క త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నారు. హోం శాఖ కూడా ఈ విష‌యంలో మౌనంగా ఉంది. ప‌రిశీలిస్తాం. కోరితే.. ర‌క్ష‌ణ పెంచుతాం.. అంటున్నారే త‌ప్ప‌.. త‌మ బాధ్య‌త‌గా ఏపీ పోలీసులు స్పందించ‌డం లేదు.YS Jagan MohanReddy waiks out of jail 43_medium_thumb

అయితే, పొరుగున ఉన్న తెలంగాణా ప్ర‌భుత్వం మాత్రం జ‌గ‌న్ కోర‌క‌ముందే.. ఆయ‌న‌కు ర‌క్ష‌ణ‌ను పెంచింది. వాస్త‌వానికి ఆ రాష్ట్ర రాజ‌కీయాల్లోకానీ, ప్ర‌భుత్వంతోకానీ జ‌గ‌న్‌కు ఎలాంటి సంబంధం లేదు. అయినా కూడా అక్క‌డి సీఎం కేసీఆర్ జ‌గ‌న్‌కు ఫోన్ చేసి ప‌రామ‌ర్శించారు. ఇక‌, ఇప్పుడు ఆయ‌న‌కు భ‌ద్ర‌త‌ను పెంచారు. ఇప్పటికే ఓ బులెట్ ప్రూఫ్ కారును సమకూర్చిన తెలంగాణ ప్రభుత్వం, ఇప్పుడు మరో నిర్ణయం తీసుకుంది. జ‌గ‌న్‌ హైదరాబాద్ లో ప్రయాణిస్తుంటే, ట్రాఫిక్ అవాంతరాలు లేకుండా చూడాలని ఆదేశాలు ఇచ్చింది. జగన్ కాన్వాయ్ వేగంగా గమ్యాన్ని చేరుకునేందుకు ఈ రూట్ క్లియరెన్స్ సహకరించనుంది.

ప్రస్తుతం హైదరాబాద్ లో వీవీఐపీలు పర్యటనలకు వచ్చినప్పుడు, గవర్నర్, కేసీఆర్, చంద్రబాబు, నాయిని తదితర ప్రముఖులకు మాత్రమే ఈ రూట్ క్లియరెన్స్ అమలవుతుండగా, ఈ జాబితాలో జగన్ కూడా చేరారు. అయితే, జగన్ కాన్వాయ్ కోసం ఏ విధమైన కొత్త ఆంక్షలనూ విధించబోమని, ఆయన ప్రయాణించే రూట్ లో ట్రాఫిక్ జామ్ కాకుండా మాత్రమే చూస్తామని పోలీసు అధికారులు వెల్లడించారు. జగన్ కాన్వాయ్ లోని భద్రతను కూడా పెంచాలని పోలీసు అధికారులు నిర్ణయించారు. మ‌రి ఈ మాత్రం కూడా ఏపీ పోలీసులు శ్ర‌ద్ధ చూపించ‌లేక‌పోయారే! అని ప్ర‌జ‌లు చ‌ర్చించుకోవ‌డం బాబు పాల‌న‌లోని క‌క్ష పూరిత వ్య‌వ‌హారాన్ని ఎత్తి చూపిస్తోంద‌ని అంటున్నారు విశ్లేష‌కులు.

జగన్ కోసం పోలీసులు సంచలన నిర్ణయం
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share