రోజుకు మూడు జిల్లాల్లో జ‌గ‌న్ ప్ర‌చారం..

March 16, 2019 at 11:09 am

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కార‌ణంగా వైసీపీ అధినేత జ‌గ‌న్ ఎన్నిక‌ల ప్ర‌చార షెడ్యూల్‌లో స్వ‌ల్ప‌మార్పులు చోటు చేసుకున్నాయి. నిజానికి.. ఈ నెల 16న క‌డ‌ప‌జిల్లా ఇడుపులపాయలో తన తండ్రి దివంగత వైఎస్సార్‌కు నివాళులర్పించి, ఆ తర్వాత పార్టీ అభ్యర్థుల జాబితాను ప్ర‌క‌టించి.. అక్కడి నుంచి గురజాల నియోజకవర్గంలోని పిడుగురాళ్ల నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించేలా షెడ్యూల్ ఖ‌రారు అయింది. ఇంత‌లోనే శుక్ర‌వారం పులివెందుల‌లో వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య‌కు గురికావ‌డంతో జ‌గ‌న్ త‌న కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి అక్క‌డికి వెళ్లారు. ఈ నేప‌థ్యంలో శ‌నివారం నాటి కార్య‌క్ర‌మాన్ని జ‌గ‌న్ ర‌ద్దు చేసుకున్నారు.

పిడుగురాళ్లలో నిర్వహించవలసిన తొలి ఎన్నికల ప్రచార సభను కూడా రద్దు చేసుకున్నారు. అయితే ఆదివారం నుంచి రోజుకు మూడు జిల్లాల్లో మూడు నియోజకవర్గాల్లో ప్రచారం కొనసాగుతుంది. ఈ నెల 17వ తేదీ నుంచి వరుసగా నాలుగు రోజుల జగన్‌ ప్రచార పర్యటన ఖరారైంది. విశాఖ‌లోనే పార్టీ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించే అవ‌కాశాలు ఉన్నాయి. ఈ నెల 17న విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం నుంచి జగన్‌ ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారు. ఆరోజు ఉదయం 9.30 గంటలకు నర్సీపట్నం, 12 గంటలకు విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలోని డెంకాడ, సాయంత్రం 2.30 గంటలకు తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం నియోజకవర్గంలోని అంబాజీపేటలో జరిగే బహిరంగ సభల్లో జగన్‌ ప్రసంగిస్తారు.

అలాగే.. ఈ నెల 18న ఉదయం 9.30 గంటలకు కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్లు, మధ్యాహ్నం 12 గంటలకు అనంతపురం జిల్లాలోని రాయదుర్గం, 2.30 గంటలకు వైఎస్సార్‌ జిల్లా రాయచోటిలో జ‌గ‌న్‌ సభలు నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. ఈ నెల 19న ఉదయం పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం నియోజకవర్గంలోని కొయ్యలగూడెంలో ఉదయం 9.30 గంటలకు, కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గ కేంద్రంలో మధ్యాహ్నం 12 గంటలకు, గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గ కేంద్రంలో 2.30 గంటలకు సభలు ఉంటాయి. ప్రకాశం జిల్లా సంతనూతలపాడులో ఈ నెల 20న ఉదయం 9.30 గంటలకు, నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గ కేంద్రంలో మధ్యాహ్నం 12 గంటలకు, చిత్తూరు జిల్లా పలమనేరులో మధ్యాహ్నం 2.30 గంటలకు జరిగే సభల్లో జ‌గ‌న్ పాల్గొన‌నున్నారు.

రోజుకు మూడు జిల్లాల్లో జ‌గ‌న్ ప్ర‌చారం..
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share