జ‌న‌మంతా జ‌గ‌న్ వెంటే..!

March 12, 2019 at 2:14 pm

స‌మ‌ర శంఖం మ్రోగింది.. ప్ర‌జా క్షేత్రంలోకి పార్టీల‌న్నీ దూక‌బోతున్నాయి.. ఇప్ప‌టికే ప‌లుపార్టీలు త‌మ‌త‌మ ప్ర‌చారాన్ని ముమ్మ‌రం చేశాయి.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అటు అసెంబ్లీ, ఇటు లోక్‌స‌భ స‌మ‌రాలు ఒకే సారి రావ‌డంతో పోరుపై భ‌లే ఆస‌క్తి రేగుతోంది. రాష్ర్ట స‌ర్కార్కు ఓవైపు ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త ఎదుర‌వుతోంది. ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ మాత్రం జ‌నంలో దూసుకుపోతున్నాడు.. జ‌న‌మంతా జ‌గ‌న‌న్న మంత్ర‌మే జ‌పిస్తున్నారు. పాల‌న మార్పును కోరుకుంటున్నామ‌ని ఏ గ్రామానికి వైసీపీ నేత వెళ్లినా ముఖాముఖి చెబుతున్నారు. ఆ పార్టీలో చేరిక‌లు చూస్తేనే తెలుసుకోవ‌చ్చు ఆద‌ర‌ణ ఏస్థాయిలో పెరుగుతుందోన‌ని..

నాలుగున్న‌రేళ్లు ప్ర‌తిప‌క్ష హోదాలో హుందాగా న‌డుచుకుని ప్ర‌భుత్వ ప్ర‌జావ్య‌తిరేక పాల‌సీల‌ను ఎండ‌గ‌ట్టిన జ‌గ‌న్‌ను ప్ర‌జ‌లు త‌మ మ‌నిషిగా చూసుకుంటున్నారు. పిల్లోడి నుంచి పండు ముస‌లి వ‌ర‌కు రాజ‌న్న బిడ్డ‌కు రాజ్యాన్ని అప్ప‌గించాల‌నే బ‌ల‌మైన కోరిక‌తో స్వ‌చ్ఛందంగా ప్ర‌చారం చేస్తూ క‌నిపిస్తున్నారు. సామాన్యుడిని అక్కున చేర్చుకునే స‌ర్కార్ కావాల‌ని అది జ‌గ‌న్ వ‌ల్లే సాధ్య‌మ‌వుతుంద‌ని రాష్ర్ట జ‌నాలు గ‌ట్టిగా ఫిక్స్ అయినట్టు స‌ర్వేలు కూడా చెబుతున్నాయి. హైటెక్ పోక‌డ‌లు త‌మ‌కు అవ‌స‌రం లేద‌ని, పొలంగ‌ట్లు, చెట్లుచేమ‌లు, క‌చ్చా రోడ్ల‌పై కాలిన‌డ‌క‌న న‌డిచే నాయ‌కుడు కావాల‌ని కోరుకుంటున్నట్టు వైసీపీ నేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వెంట క‌దులుతున్న అశేష ప్ర‌జానికాన్ని చూస్తేనే అర్థం చేసుకోవ‌చ్చు.

గెలిచి అసెంబ్లీలో కూర్చోవ‌డమో, ఏసీ కార్ల‌లో తిర‌గ‌డ‌మే చేసే ప్ర‌తినిధులు త‌మ‌కు అక్క‌ర లేద‌ని, గుడిసెల్లో ఉన్న వాడి బ‌తుకుల గురించి కూడా ఆలోచించే నాయ‌కుడే కావాల‌నే త‌లంపుతో రాష్ర్ట మొత్తం *ఫ్యాన్‌** గాలి కోసం ఎదురు చూస్తున్న‌ట్టు ఆయా సంద‌ర్భాల్లో ఓట‌ర్లు మాట్లాడిన తీరును చూస్తే తెలిసిపోతుంది. వైసీపీ నేత జ‌గ‌న్ కూడా ప్ర‌జాద‌ర‌ణ‌, త‌న‌ను ప్ర‌జ‌లు న‌మ్ముతున్న తీరు, త‌న‌నుంచి వారు కోరుకుంటున్న ఫ‌లాల స‌మాహార‌మే ఆలంభ‌న‌గా ముందుకెళ్తున్నారు. ఇప్ప‌టికే పాద‌యాత్ర‌తో ప్ర‌జాపోరాటంలో మొద‌టి విడ‌త విజ‌య‌తీరాల‌ను స్ప్రుషించిన జ‌గ‌న్ క‌ద‌న‌రంగంలోకి మ‌రింత ఉత్సాహంగా దూసుకెళ్తున్నారు. ప్ర‌తి ప‌క్షంగా విజ‌య‌వంతంగా న‌డుచుకుని పాల‌క ప‌క్షం వైపు అడుగులు వేస్తున్నాడు.

జ‌న‌మంతా జ‌గ‌న్ వెంటే..!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share