జ‌గ‌న్‌పై హ‌త్యాయ‌త్నం.. ఇక మిస్ట‌రీనేనా?

November 6, 2018 at 10:58 am

రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌ల‌కు విఘాతం క‌ల‌గ‌నివ్వం. ఎలాంటి ప‌రిస్థితినైనా అదుపు చేస్తాం. ఇక్క‌డి ప్ర‌జ‌ల‌కు పూర్తి భ ద్ర‌త క‌ల్పిస్తాం.- ఇదీ ఏ వేదిక ఎక్కినా సీఎం చంద్ర‌బాబు చెబుతున్న మాట‌. ముఖ్యంగా పెట్టుబ‌డుల‌ను ఆహ్వానిం చేందుకు చంద్ర‌బాబు ఏ ఊరు వెళ్లినా ఆయ‌న అక్క‌డ చెబుతున్న మాట కూడా ఇదే. అయితే, నిజానికి వాస్తవంలోకి వ‌స్తే.. రాష్ట్రం లో శాంతి భ‌ద్ర‌త‌ల ప‌రిస్తితి ఏమంత బాగోలేదు. ప్ర‌తి ప‌క్ష నేత‌, సీఎం చంద్ర‌బాబు త‌ర్వాత సీఎం అం త‌టి(ప్రొటోకాల్ ప్ర‌కారం) నాయ‌కుడికి భ‌ద్ర‌త క‌ల్పించ‌డంలో ప్ర‌భుత్వం విఫ‌ల‌మైంది. విశాఖ‌లోని అంత‌ర్జాతీయ వి మానాశ్ర‌యంలో ఓ కుర్రాడు ఏకంగా కోళ్ల‌కు వాడే క‌త్తిని తీసుకుని వ‌చ్చి దాడికి తెగ‌బ‌డ్డాడు. ఈ ప్ర‌మాదంలో స్వ‌ల్ప తే డాతో జ‌గ‌న్ ప్రాణాపాయం నుంచి త‌ప్పించుకున్నాడు.1540897015-1859

ఇక‌, ఈఘ‌ట‌న జ‌రిగిన త‌ర్వాత నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన‌, జ‌రుగుతున్న రాజ‌కీయాలు అన్నీ ఇన్నీ కావు. మీరే చే యించుకున్నారంటూ.. సీఎం చంద్ర‌బాబు ఇప్ప‌టికీ జ‌గ‌న్‌పై నిప్పులు చెరుగుతున్నారు. అయితే, ఇక‌, ఈ ఘ‌ట‌న ఎవ రు చేశా ర‌నే విష‌యం తెలిసినా.. దీని వెనుక ఎవ‌రున్నార‌నే విష‌యంపై మాత్రం ఇప్ప‌టికీ.. ఎలాంటి ఆధారాలు ల‌భిం చ‌లేదు. మ‌రి రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌లు బాగున్న‌ప్పుడు.. ఈ దాడి ఎలా జ‌రిగింద‌నే విష‌యానికి ప్ర‌భుత్వం వ‌ద్ద నేటికీ ఆధారాలు క‌న్పించ‌డం లేదు. ఘ‌ట‌న జ‌రిగి రెండు వారాలు పూర్త‌వుతున్నా.. నేటికీ కేసు ద‌ర్యాప్తు పురోగ‌తి ఎక్క‌డి గొంగ‌ళి అక్క‌డే అన్న చందంగా మారిపోయింది. ఈ కేసును సిట్‌కు అప్ప‌గించామ‌ని, నిష్పాక్షికంగా ద‌ర్యాప్తు సాగుతోం ద‌ని ప్రభుత్వం చెబుతున్నా.. ఇప్ప‌టి వ‌ర‌కు ఎక్క‌డా చిన్న క్లూ కూడా సంపాయించ‌లేక పోయారు.SRINIVAS-RAO-1

ఇది ఒక్క‌టే కాదు.. జ‌గ‌న్‌పైనా ఆయ‌న పార్టీ నేత‌ల‌పైనా వేసిన అనేక అభాండాల విష‌యంలోనూ చంద్ర‌బాబు ఇప్ప‌టి వ‌ర‌కు పురోగ‌తి సాధించ‌లేక పోయారు. రాజ‌ధానిలో అర‌టి తోట‌ల‌ను త‌గ‌ల‌బెట్టార‌ని పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు గుప్పిం చారు చంద్ర‌బాబు. ఇక‌, దీనిని అందుకుని ఆయ‌న ప‌రివారం.. మ‌రింత‌గా రెచ్చిపోయారు. ఇక‌, కొత్త‌గా క‌ట్టిన స‌చివా ల‌యం విష‌యంలో కాంట్రాక్ట‌ర్ చేసిన త‌ప్పిదాల‌కు.. చిన్న వ‌ర్షానికే నీళ్లు కార‌డం స‌హ‌జమైంది. ఏకంగా మంత్రుల చాంబ‌ర్లు త‌డిసి పోవ‌డం, నీటితో నిండిపోవ‌డం తెలిసిందే. అయితే, ఈ విష‌యంలోనూ జ‌గ‌న్‌దే త‌ప్పు ఉంద‌ని అంటూ బాబు మీడియాకెక్కారు. ఈ రెండు విష‌యాలు స‌హా తునిలో రైలు ద‌హ‌నం కేసు విష‌యంలోనూ సిట్‌ను నియ‌మిం చారు.

మ‌రి ఈ విష‌యాల్లో.. ఇప్ప‌టి వ‌ర‌కు రిజల్ట్ రాలేదు. ఒక వేళ జ‌గ‌న్ అండ్ పార్టీ నేత‌ల త‌ప్పు ఉంటే చంద్ర‌బాబు ఊరుకు నేవారేనా? అనేది ప్ర‌ధాన ప్ర‌శ్న‌. ఇక‌, తాజా ఎపిసోడ్‌లో రెండు వారాలు పూర్త‌యినా.. క‌నీసం అంటే.. క‌నీసం క్లూ కూడా ఎక్క‌డా ల‌భించ‌లేదు. దీనిని బ‌ట్టి జ‌గ‌న్ కేసు వ్య‌వ‌హారం కూడా గ‌తంలో గోదావ‌రి పుష్క‌రాల స‌మ‌యంలో మృతి చెందిన 27 మంది వ్య‌వ‌హారంగా మారిపోయింద‌నే టాక్ వినిపిస్తోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

జ‌గ‌న్‌పై హ‌త్యాయ‌త్నం.. ఇక మిస్ట‌రీనేనా?
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share