జగన్ నయా వ్యూహం పశ్చిమ గోదావరిలో లేడికి టికెట్ ఖరారు!

May 17, 2018 at 11:10 am
ys jagan-ysrcp-eluru

వైసీపీ అధినేత వైఎస్‌.జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ప్ర‌జాసంక‌ల్ప యాత్ర‌కు టీడీపీకి ప‌ట్టున్న ప‌శ్చిమ‌గోదావ‌రిలో మంచి స్పంద‌న వ‌స్తోంది. ఇప్ప‌టికే దెందులూరు, ఏలూరు నియోజ‌క‌వ‌ర్గాల్లో యాత్ర కంప్లీట్ చేసుకున్న జ‌గ‌న్ గురువారం నుంచి గోపాల‌పురం నియోజ‌క‌వ‌ర్గంలోకి ఎంట‌ర్ అవుతున్నాడు. ఇక ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా కేంద్ర‌మైన ఏలూరు నుంచి జ‌గ‌న్ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించ‌డం విశేషం. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో కాంగ్రెస్‌, వైసీపీ నుంచి ప్ర‌స్తుత పార్టీ ఎమ్మెల్సీ, జిల్లా అధ్య‌క్షుడు ఆళ్ల నానియే చ‌క్రం తిప్పుతున్నారు. నానికి నియోజ‌క‌వ‌ర్గంలో మంచి ప‌ట్టు ఉంది. 1994, 1999, 2004, 2009, 2014 ఎన్నిక‌ల్లో వ‌రుస‌గా పోటీ చేస్తూ వ‌స్తోన్న నాని రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. నియోజ‌క‌వ‌ర్గంలో కోట్లాది రూపాయ‌ల‌తో ఆయ‌న  మార్క్ అభివృద్ధి ఉంది.

 

గ‌త ఎన్నిక‌ల్లో జిల్లాలో వైసీపీ పూర్తిగా స్మాష్ అవ్వ‌డంతో పార్టీని బ‌లోపేతం చేసేందుకు నానికి జ‌గ‌న్ ఎమ్మెల్సీ ఇవ్వ‌డంతో పాటు ఆయ‌న‌కు జిల్లా పార్టీ ప‌గ్గాలు అప్ప‌గించారు. ఇక నానికి ఎమ్మెల్సీ ఇవ్వ‌డంతో జ‌గ‌న్ ఇక్క‌డ నుంచి మాజీ మునిసిప‌ల్ చైర్మ‌న్ మ‌ధ్యాహ్న‌పు ఈశ్వ‌రీ బ‌ల‌రాంకు నియోజ‌క‌వ‌ర్గ వైసీపీ స‌మ‌న్వ‌య‌క‌ర్త బాధ్య‌త‌లు ఇచ్చారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో జిల్లా కేంద్రం నుంచి మ‌హిళ అయిన ఆమెను పోటీ చేయించాల‌ని జ‌గ‌న్ వ్యూహం ప‌న్న‌డం విశేషం. ఇది నిజంగా ఓ డేరింగ్ స్టెప్పే అనుకోవాలి. గ‌తంలో టీడీపీ నుంచి మునిసిప‌ల్ చైర్మ‌న్‌గా ప‌నిచేసిన ఈశ్వ‌రీ భ‌ర్త బ‌ల‌రాంకు నియోజ‌క‌వ‌ర్గంలో మంచి అనుచ‌ర‌గ‌ణ‌మే ఉంది.

 

నియోజ‌క‌వ‌ర్గంలో బ‌లంగా ఉన్న కాపు వ‌ర్గానికి  చెందిన ఈశ్వ‌రీ బ‌ల‌రాంకు నానితో పాటు ఆయ‌న వ‌ర్గం ఫుల్లుగా స‌పోర్ట్ చేస్తే ఇక్క‌డ వైసీపీ జెండా ఎగ‌ర‌డం పెద్ద క‌ష్ట‌మేం కాదు. టీడీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న బ‌డేటి బుజ్జిపై తీవ్ర‌మైన విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. నియోజ‌క‌వ‌ర్గంలో సెటిల్‌మెంట్లు, చివ‌ర‌కు హ‌త్యా రాజ‌కీయాల‌కు కూడా జ‌రుగుతున్నాయ‌న్న‌ది ఏలూరులో ఓపెన్ టాక్ అయిపోయింది. ఆయ‌న జ‌న‌సేన వైపు చూస్తున్నార‌న్న‌ది కూడా ఉంది. గతంలో బుజ్జి ప్రజారాజ్యం నుంచి పోటీ చేసి ఓడి తిరిగి టీడీపీలోకి వ‌చ్చారు. 

 

ఈ టైంలో జ‌గ‌న్ జిల్లా కేంద్రం నుంచి ఈశ్వ‌రీ బ‌ల‌రాంకు నియోజ‌క‌వ‌ర్గ వైసీపీ ప‌గ్గాలు అప్ప‌గించ‌డంతో పెద్ద డేరింగ్ స్టెప్‌గానే భావిస్తున్నారు. ఇక ఏలూరులో జ‌గ‌న్ నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ స‌క్సెస్ అవ్వ‌డంతో ఇక్క‌డ వైసీపీ వ‌ర్గాల్లో మాంచి జోష్ నింపుతోంది. ఇక జ‌న‌సేన కూడా బ‌రిలో ఉండడంతో ఇక్క‌డ నుంచి ఆ పార్టీ త‌ర‌పున కూడా కాపు వ‌ర్గానికి చెందిన వ్య‌క్తినే పోటీ చేయించే ఛాన్సులు ఉన్నాయి. మ‌రి ఒకే సామాజిక‌వ‌ర్గం నుంచి ముగ్గురు వ్య‌క్తులు పోటీప‌డితే ఈ ట్ర‌యాంగిల్ ఫైట్‌లో లేడీగా బ‌రిలోకి దిగుతోన్న ఈశ్వ‌రీ బ‌ల‌రాంకు కొంత ప్ల‌స్ అవ్వొచ్చంటున్నారు. మ‌రి ఇక్క‌డ జ‌గ‌న్ వేసిన ఈ న‌యా వ్యూహం ఎంత వ‌ర‌కు స‌క్సెస్ అవుతుందో ?  చూడాలి.

జగన్ నయా వ్యూహం పశ్చిమ గోదావరిలో లేడికి టికెట్ ఖరారు!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share