జ‌గ‌న్ టీడీపీ కోట‌ను కొట్టాలంటే ప్ర‌త్యేక ఆప‌రేష‌న్ చేయాల్సిందే

July 13, 2018 at 8:48 am
jagan-ycp-

టీడీపీ కంచుకోట‌ల‌పై వైసీపీ అధినేత ప్ర‌త్యేక దృష్టి పెట్టారు. ముఖ్యంగా సీమ జిల్లాల్లోని మూడింట్లో వైసీపీకి ప‌ట్టు ఉన్నా.. ఒకే ఒక్క జిల్లా అనంత‌పురంలో ప‌రిస్థితి పూర్తి వ్య‌తిరేకంగా ఉంది. ఎన్నో ఏళ్లుగా ఇక్క‌డ టీడీపీ పాగా వేసి ఉండ‌టంతో.. సైకిల్ జోరు ముందు వైసీపీ త‌డ‌బ‌డ‌తూనే ఉంది. ఇక్క‌డ కూడా కొన్ని సీట్ల‌లో బ‌ల‌పడేందుకు అవ‌కాశాలు ఉన్నా.. పార్టీ నాయ‌కుల మ‌ధ్య స‌మ‌న్య‌య లోపం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఎవ‌రికి వారు త‌మ ప‌ని చేసుకుంటూ వెళుతున్నారే త‌ప్ప స‌మ‌ష్టిగా పార్టీ బ‌లోపేతానికి చ‌ర్య‌లు తీసుకున్న దాఖ‌లాలు లేవ‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఎవ‌రికి వారే య‌మునా తీరే అన్న చందంగా వ్య‌వ‌హ‌రించ‌డంతో పాటు.. ఆధిపత్య‌పోరు, కుమ్ములాట‌లు ఉన్నాయ‌ని గుర్తు చేస్తున్నారు. ఈ స‌మ‌స్య‌ల‌న్నింటినీ అధిగ‌మించేందుకు ప్ర‌త్యేక ఆప‌రేష‌న్ చేప‌ట్టాల్సిందేనని స్ప‌ష్టంచేస్తున్నారు. అప్పుడే కంచుకోట‌ను ఢీకొట్ట‌గ‌ల‌ర‌ని చెబుతున్నారు.   

 

2014 ఎన్నికల అనంతరం వైసీపీని ఏకతాటిపై నడిపించే నాయకత్వం జిల్లాలో కరువైంది. నాయకు లకు పార్టీ పదవులు పందేరం చేయడంతో జిల్లాలో బహునాయకత్వం పెరిగిపోయింది. పార్టీని సమన్వయపరచడంలో జిల్లా నాయకుల పాత్ర నామమాత్రంగా మారింది. అనంతపురం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని దాదాపు అన్ని శాసనసభా నియోజకవర్గాల్లోనూ వైసీపీలో గ్రూపులున్నాయి. అనంతపురం నియోజకవర్గంలో గత ఎన్నికల నుంచి ఇప్పటి వరకు ముగ్గురికి నియోజకవర్గ బాధ్యతలు మార్చారు. తొలుత గుర్నాథరెడ్డికి, ఆయన టీడీపీలో చేరిన తరువాత ముస్లిం నేత నదీం అహ్మద్‌కు బాధ్యతలిచ్చారు. త‌ర్వాత ఆయనకు హిందూపురం ఎంపీ బాధ్యతలు అప్పగించారు. ఆ స్థానంలో అప్పటివరకు అనంతపురం పార్లమెంటు నియోజకవర్గ బాధ్యతలు చూస్తున్న మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డిని నిలబెట్టారు. 

 

అనంతపురం నియోజకవర్గంలో నదీం తరువాత నగరానికి చెందిన వైవీ శివారెడ్డి వైసీపీలో చేరారు. ఆయనకు పార్టీ కార్యదర్శి పదవినిచ్చారు. నగరంలోనే మహలక్ష్మి శ్రీనివాస్‌, మునిరత్నం శ్రీనివాస్ టికెట్ ఆశిస్తుండ‌గా.. పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాగే పరశురాం టికెట్టు ఆశించకపోయినా తానూ ఒక వర్గానికి నాయకత్వం వహిస్తున్నానని భావిస్తున్నారు.  తాడిపత్రిలో గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా వీఆర్‌ రామిరెడ్డి పోటీచేసి ఓటమిపాలయ్యారు. రెండేళ్ల క్రితం నియోజకవర్గ బాధ్య‌త‌లు పెద్దారెడ్డికి అప్పగించారు. దీంతో అక్కడ రెండు గ్రూపులు ఏర్పడ్డాయి. రాయదుర్గంలో మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, పాటిల్‌ వేణుగోపాల్‌రెడ్డి మ‌ధ్య పోరు సాగుతోంది. ఇదే తరుణంలో కాంగ్రెస్‌ నుంచి వైసీపీలోకి వచ్చిన పాటిల్‌ వేణుగోపాల్‌రెడ్డి తన కుమారుడైన అజయ్‌కుమార్‌ రెడ్డిని బరిలోకి దించే యత్నాల్లో ఉన్నారు. 

 

గుంతకల్లు నియోజకవర్గంలో వైసీపీ నేతగా వై.వెంకట్రామిరెడ్డి ఉన్నారు. ఏడాది నుంచి ఆ నియోజకవర్గంలో వైఎస్సార్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ తరపున జీవానందరెడ్డి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వీరి మ‌ధ్య ఆధిపత్య పోరు సాగుతోంది. ఉరవకొండలో వైసీపీ ఎమ్మెల్యేగా విశ్వేశ్వరరెడ్డి ఉన్నారు. గత ఎన్నికల్లో ఆ సీటును మాజీ ఎమ్మెల్యే వై. శివరామిరెడ్డి ఆశించారు. వచ్చే ఎన్నికల్లోనూ ఆయ‌న టికెట్టు ఆశిస్తున్నారు. కళ్యాణదుర్గం వైసీపీ సమన్వయకర్తగా ఉషశ్రీ కొనసాగు తున్నారు. అక్కడున్న వైసీపీ రాష్ట్ర కార్యదర్శి ఎల్‌ఎం మోహన్‌రెడ్డి, మరో నేత తిప్పేస్వామి ఉషశ్రీకి వ్యతిరేకంగా ఉన్నాయ‌ట‌. శింగనమలలో జొన్నలగడ్డ పద్మావతి, కాంగ్రెస్‌ మాజీ మంత్రి శైలజానాథ్‌ కూడా టికెట్‌ ఆశిస్తున్నారు. పార్లమెంటు నియోజకవర్గస్థాయి నాయకుడిగా తలారి రంగయ్యను రంగంలోకి దింపారు.

 

హిందూపురం పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గాల్లోనూ విభేదాలు క‌నిపిస్తున్నాయి. కదిరిలో సమన్వయకర్త సిద్దారెడ్డికి, వజ్ర భాస్కరరెడ్డికీ పొసగడం లేదు. మడకశిరలో సమన్వయకర్తగా తిప్పేస్వామి ఉన్నారు. ఇక్క‌డ కూడా నేత‌ల మ‌ధ్య విభేదాలు పెరుగుతున్నాయి. పెనుకొండ సమన్వయకర్తగా ఉన్న పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకర నారాయణకు ఇంటిపోరు అధికమైంద‌ట‌. రియల్‌ వ్యాపారి పొగాకు రామచంద్ర పార్టీలో టికెట్‌ ఆశిస్తున్నారు. అదే నియోజకవర్గంలో గోరంట్లకు చెందిన సుదర్శనశర్మ కూడా వచ్చే ఎన్నికల్లో తాను బరిలో ఉంటానని చెబుతున్నట్టు సమాచారం. రాప్తాడులో పార్టీ సమన్వయకర్తగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇటీవల ఉద్యోగులపై నోరుజారి విమ‌ర్శ‌ల పాల‌య్యారు. తోపుదుర్తి కవిత, రిటైర్డ్‌ జిల్లా జడ్జి కిష్టప్ప కూడా వచ్చే ఎన్నికల్లో ప్రాధాన్యం ఆశిస్తున్నారు.

 

పుట్టపర్తిలో మాజీ ఎమ్మెల్యే కడపల మోహనరెడ్డికీ, ఎస్వీ సోమశేఖరరెడ్డికీ మధ్య విభేదాలున్నాయి. మరో నేత కడపల శ్రీకాంత్‌రెడ్డి తటస్థంగా వ్యవహరిస్తున్నారు. హిందూపురంలో వైసీపీ నాయకుడిగా నవీన్‌నిశ్చల్ ఉన్నారు. నియోజకవర్గంలోని కొన్ని మండలాల్లో రెడ్డి సామాజికవర్గం ఆయన్ను వ్యతిరేకిస్తోందనే విమర్శలున్నాయి. అక్కడ బీసీలు, రెడ్డి సామాజికవర్గం మధ్య వైసీపీలో గ్రూపులున్నాయి. ధర్మవరం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి సమన్వయకర్తగా ఉంటున్నారు. ధర్మవరంలో తాడిమర్రి చంద్రశేఖరరెడ్డి తటస్థంగా మారడంతో అక్కడ వైసీపీలోని ఒక వర్గం కూడా స్తబ్ధుగా మారింది. 

జ‌గ‌న్ టీడీపీ కోట‌ను కొట్టాలంటే ప్ర‌త్యేక ఆప‌రేష‌న్ చేయాల్సిందే
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share