జ‌గ‌న్‌పై జ‌నాల‌కు బోలెడు భ‌రోసా..!

March 18, 2019 at 3:20 pm

ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు రోజురోజుగా ఆద‌ర‌ణ పెరుగుతోంది. ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్నా కొద్ది ప్ర‌జ‌లంతా జ‌గ‌న్ వెంటే న‌డుస్తున్నారు. ఇప్ప‌టికే వేల కిలోమీట‌ర్ల పాద‌యాత్ర‌తో రాష్ర్టం మొత్తం తిరిగి వ‌చ్చిన జ‌గ‌న్ ప్ర‌జ‌ల క‌ష్టాల‌ను పూర్తిగా తెలుసుకున్నారు. పూరిగుడిసెలో ఎలా ఉంటున్నారు.. ఏం తింటున్నారు.. ఆర్థిక ప‌రిస్థితి ఎలా ఉంది అంటూ.. పేరుపేరునా ప‌ల‌క‌రించిన జ‌గ‌న్ వారికి కొండంత భ‌రోసా ఇచ్చేలా క‌నిపించ‌డంతో జ‌నాల్లో ఎక్క‌డ లేని ధైర్యం క‌నిపిస్తోంది. ఏక ప‌క్షంగా వైసీపీనే గెలిపిస్తేనే త‌మ బ‌తుకులు మారుతాయ‌నే గ‌ట్టి నిర్ణ‌యానికి ప్ర‌జ‌లు రావ‌డంతో రాజ‌కీయాలు చాలా ర‌స‌వ‌త్త‌రంగా మారాయి.

రాజ‌న్న పాల‌న‌ను మ‌ళ్లీ అందించే స‌త్తా కేవ‌లం ఆయ‌న కుమారుడిగా జ‌గ‌న్‌కు మాత్ర‌మే ఉంద‌ని విశ్వ‌సిస్తున్న జ‌నం నీరాజ‌నాలు ప‌లుకుతున్నారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా జ‌గ‌న్ ఎక్క‌డికి వెళ్లినా ప్ర‌జలు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. అధికారంలోకి రాగానే ప్ర‌తి క‌ష్టాన్ని తీర్చ‌డ‌మే ప‌నిగా పెట్టుకున్న‌ట్టు జ‌గ‌న్ ప్ర‌క‌టిస్తుండ‌డంతో రాష్ర్ట ప్ర‌జానీకం మ‌రింత సంతోషంలో మునిగి తేలుతున్నారు. పేరుకుపోయిన భూ రికార్డుల‌ను ప్ర‌క్షాళ‌న చేయ‌డం, ప్ర‌భుత్వం సాయం అవ‌స‌రం అయిన ప్ర‌తీ కుటుంబానికి దాని ఫ‌లాలు అందేలా చూడ‌డం, బ‌తుకుదెరువు కోసం వెళ్లే వ‌ల‌స‌ల‌ను ఆపేసి స్థానికంగానే ఉపాధి క‌ల్పించ‌డానికి క్రుషి చేయ‌డం వంటి ప‌క‌డ్బందీ హామీలు ప్ర‌జ‌ల‌ను మంత్ర ముగ్ధుల‌ను చేస్తున్నాయి.

నాలుగున్న‌రేళ్లుగా అధికార ద‌ర్పం, ప‌క్ష‌పాత ధోర‌ణితో వ్య‌వ‌హ‌రించిన ప్ర‌భుత్వ కుళ్లు కుతంత్రాలు చూసి విసిగిపోయిన జ‌నం జ‌గ‌న‌న్న పాల‌న కోసం ఎదురు చూస్తున్నట్టు ఆయ‌న‌కు నీరాజ‌నం ప‌డుతున్న తీరును చూస్తే తెలిసిపోతుంది. ఉద్యోగాల నోటిఫికేష‌న్‌కు మొహం వాచిన నిరుద్యోగ యువ‌త కూడా జ‌గ‌న్ స‌ర్కార్ రావాల‌నే ఆశ‌తో ఎదురు చూస్తున్నారు. పీక‌ల్లోతు అవినీతి ఆరోప‌ణ‌లు, కోట్ల‌కు కోట్ల‌కు స్కాంలు, సొంత పార్టీ వారికి దోచిపెట్టాల‌నే టీడీపీ పాల‌న‌పై రాష్ర్ట ప్ర‌జ‌లు ఏవ‌గించుకుంటున్నారు. అధికారాన్ని జ‌గ‌న్‌కు క‌ట్టబెట్ట‌డానికి ఐక్యంగా క‌దులుదామ‌ని పలు ప్రాంతాల్లో శ‌ప‌థాలు కూడా చేస్తుండ‌డం కొస‌మెరుపు. ఏది ఏమైనా మ‌రో నెల‌న్న‌ర రోజుల అనంత‌రం రాష్ర్టంలో అధికార మార్పిడి త‌థ్యం అనేది క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు క‌నిపిస్తోంది.

జ‌గ‌న్‌పై జ‌నాల‌కు బోలెడు భ‌రోసా..!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share