జ‌గ‌న్.. ఇలా ముందుకెళ్తేనే ఫ్యూచ‌ర్‌…!

December 18, 2018 at 3:19 pm

అవును! ఇప్పుడు వైసీపీ అభిమానులు, వైఎస్ అభిమానులు, కాంగ్రెస్ పార్టీలోని ఓ వ‌ర్గం నాయ‌కులు కూడా ఇవే మాట‌లు చెబుతున్నారు. జ‌గ‌న్ అడుగులు ఊపందుకోవాలి అని! అంటే.. ఆయ‌న చేస్తున్న ప్ర‌జా సంక‌ల్ప పాద‌యాత్ర ఊపందుకో వాలని కాదు! జ‌గ‌న్ త‌న రాజ‌కీయ వ్యూహాల‌కు ప‌దును పెట్టుకోవాల‌ని వారు సూచిస్తున్నారు. నిజానికి ఏపీలో అధికారంలో కి వైసీపీ వ‌స్తే.. అది దేశ రికార్డుగా మారిపోవ‌డం ఖాయం. ఎందుకంటే.. త‌న‌ను తాను దేశంలోనే సీనియ‌ర్‌న‌ని, మోడీ కూడా త‌న‌కంటే జూనియ‌రేన‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు చెబుతున్నారు. మ‌రి అలాంటి నాయ‌కుడిని ఓడించి సీఎం పీఠాన్ని ద‌క్కించుకునేందుకు జ‌గ‌న్ చేస్తున్న ప్ర‌య‌త్నం ఫ‌లిస్తే.. ఆయ‌న దేశ రికార్డును బ‌ద్ద‌లు కొట్టిన‌ట్టే అవుతుంది.

నిజానికి చంద్ర‌బాబును ఓడించే అవ‌కాశం తండ్రీ కొడుకులుగా వైఎస్‌, ఆయ‌న కుమారుడు జ‌గ‌న్‌ల‌కే ద‌క్కింది. గ‌తంలో వైఎస్ చంద్ర‌బాబు పాల‌న‌కు అడ్డుక‌ట్ట వేశారు. ఇప్పుడు జ‌గ‌న్ కూడా ఇదే బాట‌లో న‌డుస్తున్నారు. అయితే, ప్ర‌స్తుతం జ‌గ‌న్ రాజ‌కీయంగా వేస్తున్న అడుగులు మ‌రింత పుంజుకోవాల‌ని చెబుతున్నారు విశ్లేష‌కులు. చంద్ర‌బాబుపై విమ‌ర్శ‌లు త‌గ్గించి ఆయ‌న చేస్తున్న రాజ‌కీయాల‌పై గురి పెట్టాల‌నేది వారి సూచ‌న‌. జ‌గ‌న్‌ను కాకుండా జ‌గ‌న్ చేస్తున్న ప‌నులు ఇటీవ‌ల కాలంలో చంద్ర‌బాబు బాగా వాడుకుంటున్నారు. మొద‌ట్లో వార‌స‌త్వ రాజ‌కీయాల‌ను ప్ర‌శ్నించిన బాబు .. త‌న కుమారుడు లోకేష్‌కు మంత్రిగా ప‌ట్టం క‌ట్టిన త‌ర్వాత ఆ వ్యాఖ్య‌లు ఉప‌సంహ‌రించుకున్నారు.

అదేవిధంగా అవినీతి విష‌యాన్ని పెద్ద ఎత్తున ప్ర‌చారం చేసిన బాబు.. త‌న పార్టీలోని నేత‌లు, ఓటుకు నోటు కేసులో త‌ను బుక్క‌యిన త‌ర్వాత వాటిని కూడా ప‌క్క‌కు పెట్టారు. ఇప్పుడు జ‌గ‌న్ కూడా స‌మ‌యానికి త‌గిన విధంగా బాబు చేస్తున్న త‌ప్పుల‌ను, వేస్తున్న త‌ప్ప‌ట‌డుగుల‌ను వాడుకోవాల‌న్నది వీరి సూచ‌న. మ‌రీ ముఖ్యంగా పార్టీలోని కీల‌క‌మైన నేత‌ల గొంతు నొక్కుతున్నార‌నేది కూడా విశ్లేష‌కుల భావ‌న‌గా ఉంది. బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు, కొలుసు పార్థ‌సార‌థి, భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి వంటికీల‌క నేత‌ల‌ను చంద్ర‌బాబుపైకి వ‌దిలి పెట్ట‌కుండా కేవ‌లం ఆ పాత్ర‌ను తానుమాత్ర‌మే పోషించాల‌ని అనుకోవ‌డం స‌రికాద‌ని, వారికి ఇప్పుడు గ‌ట్టిగా ఛాన్స్ ఇస్తే.. ప్ర‌యోజ‌నకక‌రంగా ఉంటుంద‌ని అంటున్నారు. వ్యూహాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు మార్చుకోవ‌డం రాజ‌కీయాల్లో త‌క్ష‌ణ అవ‌స‌రం. అందునా బాబు వంటి వారిని ఎదిరించాలంటేనే వ్యూహాలు అవ‌స‌రం. మ‌రి ఆదిశ‌గా జ‌గ‌న్ అడుగులు వేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని చెబుతున్నారు.

జ‌గ‌న్.. ఇలా ముందుకెళ్తేనే ఫ్యూచ‌ర్‌…!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share