తూర్పుపై జ‌గ‌న్ ముద్ర ప‌డేనా..?!

June 15, 2018 at 8:32 am
jagan-east

వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. రాజ‌కీయంగా తీసుకున్న సంచ‌ల‌న నిర్ణ‌యంలో భాగంగా.. గ‌త న‌వంబ‌రు నుంచి కొన‌సాగిస్తున్న అప్ర‌తిహ‌త ప్ర‌జాసంక‌ల్ప యాత్ర‌ ప్ర‌స్థానం 189 రోజులు పూర్తి చేసుకుంది. ప్ర‌స్తుతం ఆయ‌న తూర్పు గోదావ‌రిలో త‌న యాత్ర‌ను సాగిస్తున్నారు. ఇటీవ‌ల ముగిసిన ప‌శ్చిమ గోదావ‌రిలో పార్టీకి కీల‌క‌మైన మ‌లుపులు చోటు చేసుకున్నాయి. టీడీపీలో కీల‌కంగా ఉన్న నాయ‌కులు ఇద్ద‌రు ముగ్గురు నాయ‌కులు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ముఖ్యంగా న‌ర‌సాపు రంలో జ‌రిగిన కీల‌క ప‌రిణామాలు పార్టీకి బలాన్ని పెంచుతున్నాయి. గ‌త ఎన్నిక‌ల్లో ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో.. వైసీపీకి ఆశించిన విధంగా ఫ‌లితం క‌నిపించ‌లేదు. మొత్తంగా ఈ రెండు జిల్లాల్లోనూ వైసీపీకి ఆశించిన విధంగా రిజ‌ల్ట్ రాలేద నేది వాస్తవం. 

 

ఈ నేప‌థ్యంలోనే ఇప్పుడు ఈ జిల్లాల‌లో సాగుతున్న పాద‌యాత్ర సంద‌ర్భంగా ఇక్క‌డి నాయ‌కులు భారీ ఎత్తున ఆశ‌లు పెట్టుకున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డ పార్టీకి ప్ర‌జ‌లు ఆశించిన స్థాయిలోనే సీట్ల‌ను ఇస్తార‌ని అనుకుంటున్నారు. దీనికి మ‌ద్ద‌తిస్తున్న ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. క‌నీవినీ ఎరుగ‌ని రీతిలో జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు వ‌స్తున్న భారీ జ‌నం. అదే స‌మ‌యంలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం త‌మ‌కు అన్యాయం చేసింద‌నే వ్యాఖ్య‌లు ఈ రెండు జిల్లాల్లోనూ మేజ‌ర్‌గా ఉన్న కాపు సామాజిక వ‌ర్గం భావిస్తుండ‌డం, ఇక‌, బీజేపీ-టీడీపీ కూట‌మి బ‌దాబ‌ద‌లు కావ‌డం వంటివి జ‌గ‌న్‌కు అనుకూలంగా ఉన్న ప‌వ‌నాలుగా చెప్పుకొస్తున్నారు విశ్లేష‌కులు. అదేస‌మ‌యంలో జ‌గ‌న్ చెబుతున్న ప‌థ‌కాలు, ప్ర‌క‌టిస్తున్న వాగ్దానాలు కూడా ఈ రెండు జిల్లాల ప్ర‌జ‌ల‌కు అనుకూలంగా ఉండ‌డం మ‌రింత క‌లిసొస్తున్న ప‌రిణామం. 

 

ముఖ్యంగా న‌వ‌ర‌త్నాలు కార్య‌క్ర‌మం ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో భారీ ఎత్తున ప్ర‌చారంలో ఉండ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, వృత్తుల వారీగా కూడా ప్ర‌జ‌ల‌కు జ‌గ‌న్ అందిస్తున్న వ‌రాలు భారీ ఎత్తున స‌క్సెస్ అవుతున్నాయి. ప్ర‌జ‌ల్లో ఆయా హామీలు బాగానే వ‌ర్క‌వుట్ అవుతున్నాయి. ఇక్క‌డి కోన‌సీమ పల్లెల్లోనూ  జగన్‌ పాదయాత్రకు అపూర్వ స్పందన లభిస్తోంది. ప్రజలు ఎదురేగి స్వాగతం పలుకుతున్నారు. వెలిచేరులో 200 మీటర్ల పొడవున రోడ్డుపై ఆ ప్రాంతంలోని రక రకాల పూలతో తివాచీ మాదిరిగా పరిచి తమ అభిమానాన్ని చాటుకున్నారు. జననేతను ఆ పూల బాటపై నడిపిస్తూ వెంట అడుగులేశారు. గోదావరి కాలువపై ఓ గట్టు మీద యాత్ర సాగుతుంటే ఆవలి గట్టుపై నుంచి అక్కడి గ్రామాల ప్రజలు చేతులూపుతూ అభివాదం చేస్తూ సందడి చేశారు. 

 

యాత్ర సాగుతున్నంత సేపూ దిగువ కాలువలో నవరత్నాల కటౌట్లను అమర్చిన పడవలు కనువిందు చేశాయి. యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి జగన్‌తో కరచాలనం చేయడానికి పోటీపడ్డారు. అరటి, కొబ్బరి, వరి రైతులు తమ పనులను పక్కన బెట్టి జగన్‌ను చూడటానికి వచ్చారు. దివ్యాంగులు, రైతులు, కల్లుగీత కార్మికులు, సీపీఎస్‌ ఉద్యోగులు, విశ్వకర్మ సంఘం వారు జగన్‌ను కలుసుకుని తమ సమస్యలను విన్నవించారు. మొత్తంగా ఈ ప‌రిణామం.. వైసీపీకి  గెలుపు ఆశ‌ల‌ను రెట్టింపు చేసింద‌ని చెప్ప‌డంలో సందేహం లేద‌ని అంటున్నారు  విశ్లేష‌కులు. మ‌రి ఈ అభిమానం ఓట్లుగా పోటెత్తితే.. వైసీపీ ఆశించిన ఫ‌లితం రాక‌పోదు!

తూర్పుపై జ‌గ‌న్ ముద్ర ప‌డేనా..?!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share