పవన్ పై జగన్ బంపర్ ఆఫర్

March 21, 2019 at 10:32 am

ఏపీ రాజ‌కీయాల్లో ఇప్పుడు అంద‌రిచూపు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ పోటీ చేస్తున్న గాజువాక‌, భీమ‌వ‌రం స్థానాల‌పైనే ఉంది. ఈరెండు స్థానాల్లోనూ కాపు సామాజిక‌వ‌ర్గం ఓట‌ర్లు ఎక్కువ‌గా ఉండ‌డంతో ఆయ‌న వీటిలో పోటీ చేస్తున్నాడ‌న్న‌ది బ‌హిరంగ ర‌హ‌స్య‌మే. అయితే.. ప్ర‌జారాజ్యం పార్టీ స్థాపించిన త‌ర్వాత చిరంజీవి కూడా సొంత నియోజ‌క‌వ‌ర్గం పాలకొల్లు, తిరుప‌తి నుంచి బ‌రిలోకి దిగ‌డం.. సొంతూరు పాల‌కొల్లులో ఓడిపోవ‌డం.. తిరుప‌తిలో గెల‌వ‌డం తెలిసిందే. అయితే.. అప్పుడు సొంత నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లే చిరంజీవిని చీద‌రించుకోవ‌డం.. అప్ప‌ట్లో తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అయితే.. ఇప్పుడు ప‌వ‌న్ ఎలాగైనా గాజువాక‌తోపాటు భీమ‌వ‌రంలోనూ గెల‌వాల‌న్న‌ప‌ట్టుద‌ల‌తో ఉన్నాడు.

అయితే.. ఇక్క‌డ విష‌యం ఏమిటంటే.. భీమ‌వ‌రంలో టీడీపీ, వైసీపీ, జ‌న‌సేన‌.. ఈ మూడు పార్టీల అభ్య‌ర్థులు కూడా కాపుసామాజిక‌వ‌ర్గానికి చెందిన‌వారే కావ‌డం గ‌మ‌నార్హం. అయితే.. వైసీపీ అభ్య‌ర్థి గ్రంధి శ్రీ‌నివాస్‌కు ఆ పార్టీ అధినేత జ‌గ‌న్ ఓ బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. అదేమిటంటే.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌ను ఓడిస్తే.. గ్రంధి శ్రీ‌నివాస్‌కు ఏకంగా మొద‌టి మంత్రివ‌ర్గంలోనే స్థానం క‌ల్పిస్తాన‌ని జ‌గ‌న్ హామీ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. అధినేత ఇచ్చిన హామీతో గ్రంధి శ్రీ‌నివాస్ త‌న దూకుడును మ‌రింత‌గా పెంచేశాడు. నియోజ‌క‌వ‌ర్గంలో విస్తృతంగా ప‌ర్య‌టిస్తున్నాడు. నియోజ‌వ‌ర్గంలో ఆయ‌న‌కు మంచి ప‌ట్టుంది.

గ్రంధి శ్రీ‌నివాస్ ఎలాగైనా ప‌వ‌న్‌ను ఓడించి మంత్రి కావాల‌న్న ప‌ట్టుద‌ల‌తో వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నార‌ట‌. త‌న సామాజిక‌వ‌ర్గంలోని మెజార్టీ ఓట్ల‌ను ద‌క్కించుకునేందుకు ప‌క్కా ప్లాన్‌తో ముందుకు వెళ్తున్నాడ‌నే టాక్ వినిపిస్తోంది. ఇక్క‌డ మ‌రొక విష‌యం ఏమిటంటే.. గాజువాక‌లో కంటే..భీమ‌వ‌రంలో ప‌వ‌న్‌కు గెలుపు అవ‌కాశాలు త‌క్కువ‌నే టాక్ మొద‌టి నుంచీ వినిపిస్తోంది. ఇక సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యే రామాంజ‌నేయులుపై కూడా ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త ఉంది. అదే స‌మ‌యంలో రాష్ట్ర‌వ్యాప్తంగా వైసీపీ గాలి బ‌లంగా వినిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో ఇంకొంచెం క‌ష్ట‌ప‌డి ప‌నిచేస్తే.. ప‌వ‌న్‌ను ఓడించడం పెద్ద‌క‌ష్ట‌మైన ప‌నేమీ కాద‌నే ఆలోన‌లో గ్రంధి శ్రీ‌నివాస్ ఉన్నారు. ఏం జ‌రుగుతుందో చూడాలి మ‌రి.

పవన్ పై జగన్ బంపర్ ఆఫర్
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share