జ‌గ‌న్ గుంటూరు రాజ‌కీయాలు అద‌ర‌హో..

October 9, 2018 at 11:05 am

ఎన్నిక‌ల తుఫాను త‌రుముకొస్తున్న నేప‌థ్యంలో ఏపీలో రాజ‌కీయాల గాలులు, సుడిగాలులు పెరిగిపోయాయి. నేత‌లు ఎవ రికి వారుగా త‌మ త‌మ గెలుపు కోసం ఎంతో కృషి చేసుకుంటున్నారు. ఇక‌, పార్టీల అధినాయ‌కులు కూడా ప్ర‌త్య‌ర్థి పార్టీల ను దెబ్బ‌కొట్టేందుకు ఉన్న అన్ని మార్గాల‌ను స‌ద్వినియోగం చేసుకుంటున్నాయి. ఏపీలో ప్ర‌ధాన విప‌క్షం వైసీపీ విష‌యా నికివ‌స్తే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపే ధ్యేయంగా ముందుకు సాగుతున్న ఈ పార్టీ.. ఎన్నిక‌ల వ్యూహంలోనూ అధిరిపోయే స్టెప్పు ల‌తో అధికార పార్టీకి ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తోంది. దీంతో రాష్ట్రంలో రాజ‌కీయం ఊపందుకుంద‌నే వ్యాఖ్యలు జోరుగా వినిపి స్తున్నాయి. ముఖ్యంగా రాజ‌ధాని జిల్లా గుంటూరుపై దృష్టి పెట్టిన జ‌గ‌న్‌.. ఈ జిల్లాలో దాదాపు స‌గానికిపైగా స్థానాల్లో విజ‌యం సాధించాల‌ని ల‌క్ష్యంగా నిర్ణ‌యించుకుని ముందుకు సాగుతున్నారు.

ఈ నేప‌థ్యంలోనే జిల్లాలో అనేక కీల‌క మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్ప‌టికే రెండు కీల‌క నియోజ‌క‌వ‌ర్గాల్లో స‌మ న్వ‌య‌క‌ర్త‌ల‌ను మార్పు చేసిన జ‌గ‌న్ మ‌రో నాలుగు చోట్ల మార్చేందుకు రెడీ అవుతున్నారు. చిల‌క‌లూరిపేట‌, గుంటూరు-2 ల‌లో స‌మ‌న్వ‌య‌క‌ర్త‌ల‌ను మార్చిన వైసీపీ అదినేత‌.. మ‌రో రెండు నియోజ‌క‌వ‌ర్గాలపైనా దృష్టి పెట్టారు. ముఖ్యంగా టీడీ పీకి ఏ మాత్రం ప‌ట్టున్న నియోజ‌క‌వ‌ర్గ‌మైనా.. ఆయ‌న త‌క్ష‌ణ త‌న వ్యూహాన్ని సంధిస్తున్నారు. దీంతో ఆయా స‌మ‌న్వ‌యక‌ర్త ల‌కు స్థాన చ‌ల‌నం త‌ప్ప‌డం లేదు. అయితే, ఇక్క‌డ జ‌గ‌న్ వ్యూహం అదిరిపోతోంద‌నే టాక్ వినిపిస్తోంది. టీడీపీకి ప‌ట్టున్న నియోజ‌క‌వ‌ర్గాల్లో ఖ‌చ్చితంగా వైసీపీదే పైచేయి కావాల‌నే ప‌క్కా ప్ర‌ణాళిక‌తో జ‌గ‌న్ వ్యూహ ర‌చ‌న చేస్తున్నారు.

ఇప్పటికే జిల్లాలో పలు నియోజకవర్గాలలో కొత్తవారిని రంగంలోకి దించిన జగన్ తాజాగా తాడికొండ ఎస్సీ రిజర్వ్‌డ్‌ నియోజకవర్గానికి వైసీపీ అభ్యర్ధిగా డాక్టర్‌ శ్రీదేవి పేరు ఖరారుచేసిన‌ట్టు తెలుస్తోంది. ఆ నియోజకవర్గ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న కత్తెర క్రిస్టినా వ‌చ్చే ఎన్నిక్ల‌లో ఇక్క‌డ నుంచి బ‌ల‌మైన పోటీ ఇస్తాడ‌ని భావిస్తున్న టీడీపీ నాయ‌కుడితో స‌రితూగే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. దీంతో మార్పు త‌ప్ప‌డం లేద‌ని స‌మాచారం. క్రిస్టినా గత ఎన్నికల్లో వైసీపీ తరుపున పోటీ చేసి ఓటమి చెందిన విషయం తెలిసిందే. తిరిగి తనకే సీటు అనే భావనలో ఉన్న క్రిస్టినా ఈ నాలుగేళ్ళుగా పార్టీ కోసం పనిచేస్తున్నారు. అయితే… ఆమెకు బదులుగా తెరపైకి వచ్చిన డాక్టర్‌ శ్రీదేవి హైదరాబాద్‌లో స్థిరపడిన డాక్టర్‌. ఆర్థికంగా బ‌ల‌మైన ఫ్యామిలీ కావ‌డంతో పార్టీ దూకుడు ఖాయ‌మ‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

జ‌గ‌న్ గుంటూరు రాజ‌కీయాలు అద‌ర‌హో..
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share