జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో అదే హోరు.. అదే జోరు..!

November 19, 2018 at 4:05 pm

వైసీపీ అధినేత జగ‌న్ చేస్తున్న ప్ర‌జాసంక‌ల్ప యాత్ర మ‌రో అద్భుత‌మైన రికార్డును సొంతం చేసుకుంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించి రాజ‌న్న రాజ్యం స్థాపించాల‌నే ఏకైక ధ్యేయంతో వైసీపీ అధినేత ప్రారంభించిన ఈ పాద‌యాత్ర‌కు అనూహ్య‌మైన స్పంద‌న ల‌భిస్తున్న విష‌యం తెలిసిందే. అన్ని వ‌ర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఆద‌ర‌ణ వ‌స్తోంది. వైఎస్సార్‌ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం ఇడుపుల పాయలో ప్రారంభమైన జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర ఇప్పటికే పలు మైలు రాళ్లను దాటింది. సెప్టెంబర్‌ 24న విజయనగరం జిల్లాలో అడుగిడిన రోజే ఎస్‌కోట నియోజ కవర్గంలోని కొత్తవలసలో 3000 కిలోమీటర్ల మైలు రాయిని దాటింది. గుర్ల మండలం ఆనందపురం క్రాస్‌ వద్ద 3100 కిలో మీటర్లు, సాలూరు మండలం బాగువలస వద్ద 3200 కిలోమీటర్ల యాత్రను పూర్తి చేశారు.46085526_2038217256198731_8378358507224694784_n

తాజాగా పాదయాత్ర ప్రారంభించి 300 రోజులు పూర్తి చేసుకోవటం ద్వారా మరో నూతన రికార్డు సృష్టించారు. ఇప్పటి వరకు 124 నియోజకవర్గాలు, 8 కార్పొరేషన్‌లలో పర్యటించిన జగన్‌ 114 బహిరంగ సభలు, సమావేశాలతో పాటు 42 ఆత్మీయ సమ్మేళనాల్లో పాల్గొన్నారు. ఇక్కడ విశేషం ఏంటంటే.. ఆయ‌నకు ఎక్క‌డా ప్ర‌జాద‌ర‌ణ త‌గ్గ‌క‌పోవ‌డం, ఆయ‌న‌ను చూసేం దుకు తండోప‌తండాలుగా ప్ర‌జ‌లు రావడం తెలిసిందే. ప్ర‌జాసంక‌ల్ప యాత్ర‌ను ఏదో ఒక కార్య‌క్ర‌మం మాదిరిగా కాకుండా .. ఓ బాధ్య‌త‌గా ప్ర‌జ‌ల దీవెన‌లు అందుకునే అవ‌కాశం ఉన్న కార్య‌క్ర‌మంగా జ‌గ‌న్ భావించ‌డం ఇక్క‌డ ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు వ‌స్తున్న విష‌యం. ఎన్నో ఇబ్బందుల‌ను, దాడుల‌ను సైతం ఎదుర్కొని ప్ర‌జ‌ల కోసం.. ప్ర‌జాసంక‌ల్ప యాత్ర‌ను ముందు కుతీసుకు వెళ్తున్నారు జ‌గ‌న్‌.46414987_2044541382232985_3177556593881382912_n

ఇక‌, మ‌రో కొద్ది రోజుల్లోనే ఈ పాద‌యాత్ర ముగియ‌నుంది. ఇక, దీనిని పుర‌స్క‌రించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఘ‌నంగా ఉత్స‌వా లు చేసేందుకు వైసీపీ శ్రేణులు ప‌క్కా వ్యూహంతో ఉన్నాయి. నిజానికి పాద‌యాత్ర ప్రారంభించిన‌ప్పుడు.. టీడీపీ నాయ‌కు లు ఇదో క్యాట్ వాక్‌.. అని ఉద‌యపు న‌డ‌క అని ఇలా అనేక వ్యాఖ్య‌లు చేశారు. కానీ, రానురాను ప్ర‌జ‌ల్లో ఈ పాద‌యాత్ర‌పై పెరుగుతున్న ఆద‌ర‌ణ‌తో విమ‌ర్శించే ప్ర‌తి ఒక్క‌ నోరూ మూత‌ప‌డింద‌నే చెప్పుకోవ‌చ్చు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో రాష్ట్రంలో ప్ర‌త్యామ్నాయమే అక్క‌ర్లేద‌ని, తాము త‌ప్ప మ‌రో పార్టీకి పాలించడం రాద‌ని ప‌దే ప‌దే చెప్పిన చంద్ర‌బాబు అండ్ త‌మ్ముళ్లలోనూ ఇప్పుడు భ‌యం తాలూకు ఆన‌వాళ్లు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. ఈ ప‌రిణామంతో జ‌గ‌న్ పాద‌యాత్ర అదేహోరు.. అదే జోరుతో సాగుతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో అదే హోరు.. అదే జోరు..!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share