అంద‌రినీ అధిగ‌మించిన జ‌గ‌న్‌!

May 18, 2018 at 9:31 am
ys jagan-

రాజ‌కీయాలు వ‌డి వ‌డిగా మారుతున్నాయి. మ‌రో ఏడాదిలో ఎన్నిక‌లు ఉన్న నేప‌థ్యంలో ఏపీలో మ‌రింత వేగం పుంజుకు న్నాయి. ప్ర‌ధానంగా విప‌క్ష నేత, వైసీపీ అధినేత‌ జ‌గ‌న్ వేస్తున్న అడుగులు ప్ర‌త్య‌ర్థి వ‌ర్గాల్లో తీవ్ర అల‌జ‌డి రేపుతుండ‌గా.. వైసీపీలో మాత్రం భ‌రోసా నింపుతున్నాయి. ప్ర‌తి నేత‌లోనూ వైసీపీపై అంచ‌నాలు పెరుగుతున్నాయి. పార్టీని అధికారంలోకి తీసుకు వ‌చ్చే దిశ‌గా జ‌గ‌న్ చేస్తున్న ప్ర‌య‌త్నాల‌కు జ‌నాలు నీరాజ‌నాలు ప‌డుతున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే వారు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు విశేషం క్యూ క‌డుతున్నారు. నిజానికి టీడీపీ అధినేత చంద్ర‌బాబు చెప్పుకొంటున్న‌ట్టు.. ప్ర‌జ‌ల్లో 80% సంతృప్త స్థాయి ఉంటే ప‌రిస్థితి ఇలా ఎందుకు ఉంటుందో ఆయ‌నే చెప్పాలి. 

 

జ‌గ‌న్ ఏ మూల‌కు వెళ్లినా.. ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. ఆయ‌న ఎక్క‌డ స‌భ పెట్టినా.. వేల సంఖ్య‌లో చేరుతున్నా రు. ఏ గ్రామానికి వెళ్లినా.. త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకొంటున్న‌వారే క‌నిపిస్తున్నారు. మ‌రి ఇంత మంది అసంతృప్తులు ఎక్క‌డి నుంచి పుట్టుకొస్తున్నార‌నేది ప్ర‌ధాన స‌మ‌స్య‌.  ప్ర‌జ‌లంతా సంతోషంగా ఉన్నార‌ని, త‌న పాల‌న‌కు నూటికి నూరు మార్కులు వేస్తున్నార‌ని చంద్ర‌బాబు చెబుతున్నారు. మ‌రి అలాంటి స‌మ‌యంలో.. అంద‌రూ నాకే ఓటు వేయాలి. లేక‌పోతే.. రాష్ట్రం చెడిపోతుంది. రాష్ట్రం అభివృద్ధి చెంద‌దు! వంటి డైలాగులు ఎందుకు అంటున్నార‌నేది ప్ర‌ధాన ప్ర‌శ్న‌. 

 

జ‌గ‌న్ నిర్వ‌హిస్తు న్న పాద‌యాత్ర‌లో ప్ర‌జ‌ల నుంచి వెలుగు చూస్తున్న స‌మ‌స్య‌ల‌పై చంద్ర‌బాబు ఇప్ప‌టికే మాస్ట‌ర్ ప్లాన్ ప్రారంభించారు. ఇదిలావుంటే, జ‌గ‌న్ మాత్రం ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌ను ముందుకు తీసుకు వెళ్తున్నారు. తాను ఎంత‌గా ప్ర‌జ‌ల్లోకి దూసుకు పోతే.. అంత మంచి ప‌రిస్థితి వ‌స్తుంద‌ని జ‌గ‌న్ భావిస్తుండ‌డం గ‌మ‌నార్హం. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి రాష్ట్రంలో రాజ‌కీయ ప‌రిస్థితులు మారిపోతాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ప్ర‌ధానంగా ప్ర‌తిప‌క్షానికి అనుకూలంగా తీర్పు చెప్పేందుకు ప్ర‌జ‌లు సిద్ధంగా ఉన్నార‌ని వారు చెబుతున్నారు. 

 

దీనికి ప్ర‌ధాన కార‌ణం.. జ‌గ‌న్ అన్ని వ‌ర్గాల్లోనూ భ‌రోసా నింప‌డ‌మేన‌ని అంటున్నారు. నిన్న మొన్న‌టి వ‌ర‌కు వివిధ సామాజిక వ‌ర్గాల‌కు జ‌గ‌న్ పెద్ద పీట వేశారు. అయితే, ఇప్పుడు మాత్రం బ్రాహ్మ‌ణ వ‌ర్గానికి కూడా ఆయ‌న భ‌రోసా నింప‌డాన్ని ఆ వ‌ర్గం హ‌ర్షిస్తోంది. త‌మ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌స్తే.. అర్చ‌కుల‌కు రిటైర్మెంట్ ఎత్తేస్తామంటూ.. ప్ర‌క‌టించారు. ఈ ప్ర‌క‌ట‌న ఆయా వ‌ర్గాల్లో ఆనందాన్ని నింపుతోంది. అదేవిధంగా ఆటో కార్మికుల నుంచి అన్ని వ‌ర్గాల వారికీ జ‌గ‌న్ అందిస్తున్న భ‌రోసా.. వినూత్నంగా ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. 

 

ఇది పార్టీకి మంచి ప‌రిణామ‌మ‌ని చెబుతున్నా రు. ఇది ఎన్నిక‌ల రాజ‌కీయాల్లో పూర్తిగా ల‌బ్ధి చేకూరుస్తుంద‌ని అంటున్నారు. ఇక‌, రాబోయే రోజుల్లో పార్టీకి మరింత‌గా దిశానిర్దేశం చేసేలా కూడా ఈ భ‌రోసా ఉప‌యుక్తంగా ఉంటుంద‌ని చెబుతున్నారు. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తున్న చంద్ర‌బాబులో తీవ్ర ఆందోళ‌న పెరుగుతోంద‌న్న‌ది ప‌రిశీల‌కుల అంచ‌నా. అందుకే ఆయ‌న ప్ర‌సంగాల్లో ప‌దాలు త‌డ‌బ‌డుతున్నాయ‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. 

అంద‌రినీ అధిగ‌మించిన జ‌గ‌న్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share