పొలిటిక‌ల్ సీన్ మార్చేసిన జ‌గ‌న్‌..

February 7, 2019 at 10:15 am

ఏపీలో రాజ‌కీయాలు వేడెక్కుతున్నాయి. తిరుప‌తి వేదిక‌గా వైసీపీ అధినేత జ‌గ‌న్ స‌మ‌ర‌శంఖారావం పూరించ‌డంతో ఒక్క‌సారిగా పొలిటిక‌ల్ సీన్ మారిపోయింది. అధికార పార్టీ టీడీపీలో క‌ల‌వ‌రం మొద‌లైంది. ప‌చ్చ‌మీడియాకు ఇక ప‌గ‌టి చుక్క‌లు క‌నిపించ‌నున్నాయి. తిరుప‌తి స‌భ‌లో జ‌గ‌న్ ప్ర‌సంగించిన తీరుతో, ఇచ్చిన హామీల‌తో జ‌నం బాగా కెనెక్ట్ అయ్యారు. ఏడాదికి పైగా ప్ర‌జాసంక‌ల్ప‌యాత్ర చేప‌ట్టి ప్ర‌జ‌ల క‌ష్ట‌సుఖాలు తెలుసుకున్న జ‌గ‌న్ ఆ మేర‌కు ప‌క్కా ప్ర‌ణాళిక‌తో ఎన్నిక‌ల‌కు సిద్ధం అవుతున్నారు. అన్నివ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు చేరువ‌య్యేలా, వారి స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం చూపేలా ముందుకు క‌దులుతున్నారు.

వైసీపీ అధికారంలోకి రాగానే.. వ‌`ద్ధాప్య పింఛ‌న్‌ను రూ.3000 దాకా పెంచుతాన‌ని జ‌గ‌న్ ఇచ్చిన హామీతో వ‌`ద్ధులు ఆనంద‌భాష్పాలు రాల్చుతున్నారు. ఎట్ట‌కేల‌కు త‌మ‌ను ఆదుకునే నాయ‌కుడు వ‌చ్చాడంటూ ఆనంద‌ప‌డుతున్నారు. జ‌గ‌న్ త‌మ పెద్ద కొడుకు అంటూ సంబుర‌ప‌డుతున్నారు. ఇక త‌మ‌కు ఎలాంటి రంది ఉండ‌ద‌ని ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. జ‌గ‌న్ ఇచ్చిన ఈ ఒక్క మాట‌తో ఏపీలో రాజ‌కీయ ప‌రిణామాల‌న్నీ కూడా వైసీపీకి అనుకూలంగా మార‌డం ఖాయ‌మ‌ని ప‌లువురు రాజ‌కీయ విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. ఇక చంద్ర‌బాబు ఎన్ని మాట‌లు చెప్పినా జ‌నం న‌మ్మ‌ర‌ని చెబుతున్నారు.

అంతేగాకుండా.. నిత్యం చంద్ర‌బాబు డ‌బ్బాకొట్టే ప‌చ్చ‌మీడియా ప‌ట్ల కూడా అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని పార్టీ శ్రేణుల‌కు పిలుపునివ్వ‌డం గ‌మ‌నార్హం. చంద్ర‌బాబు మోస‌పూరిత వాగ్దానాలు, బాబుగారు చెప్పిందే నిజ‌మంటూ ప‌దేప‌దే చెప్పే ప‌చ్చ‌మీడియాను న‌మ్మ‌వ‌ద్ద‌ని కూడా ఆయ‌న బూత్‌ కమిటీ సభ్యులు, కన్వీనర్లు ప్రజలను అప్రమత్తం చేయాలని ఆయన పిలుపు నిచ్చారు. ఈ పిలుపుతో వైసీపీ శ్రేణుల్లో నూత‌నోత్సాహం క‌నిపిస్తోంది. గ్రామ స్థాయిలో పార్టీని మ‌రింత బ‌లోపేతం చేసే దిశగా ముందుకు వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారు. ఇదే ఊపులో గురువారం నాడు కడపలో సమరశంఖారావం చేపడుతున్నారు.

ఇదిలా ఉండ‌గా.. ప‌లువురు కీల‌క టీడీపీ నేత‌లు వైసీపీలోకి వ‌చ్చేందుకు రెడీ అవుతున్న‌ట్లు తెలుస్తోంది. చంద్ర‌బాబుతో త‌మ‌కు రాజ‌కీయ భ‌విష్య‌త్ లేద‌ని, ఆయ‌న రాజ‌కీయాల‌తో ఏపీ ప్ర‌జ‌ల‌కు తీర‌ని అన్యాయం జ‌రుగుతోంద‌ని అనుకుంటున్న ప‌లువురు నాయ‌కులు వైసీపీ వైపు చూస్తున్నారు. వైసీపీలోనే త‌మ‌కు రాజ‌కీయ భ‌విష్య‌త్ ఉంటుంద‌ని లెక్క‌లు వేసుకుంటున్నారు. ఇప్ప‌టికే షాకుల మీద షాకుల‌తో ఆగ‌మాగం అవుతున్న బాబుకు ఈ ప‌రిణామాలు నిద్ర‌ప‌ట్ట‌కుండా చేస్తాయ‌నే టాక్ వినిపిస్తోంది.

పొలిటిక‌ల్ సీన్ మార్చేసిన జ‌గ‌న్‌..
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share