పుట్టిన రోజు వేళ జ‌గ‌న్‌కు ఓ స్వీట్ న్యూస్‌

December 21, 2017 at 3:16 pm

ఎండ‌న‌క వాన‌న‌క న‌డుస్తున్న యువ‌నేత జ‌గ‌న్‌కు ఓ ఊర‌ట‌! పాదాలు నొప్పి పెడుతున్న వేళ .. ఆయ‌న ప‌డుతున్న అవ‌స్థ‌కు ఇదొక  ఉప‌శ మ‌నం.. ఔను! 2 జీ నిందితులుకు కోర్టు క్లియ‌రెన్స్ ఇచ్చింది. ఇలానే రేప‌టి వేళ అక్ర‌మాస్తుల కేసుల నుంచి జ‌గ‌న్ బ‌య‌ట‌ప‌డితే  ఏం చేస్తార‌ని?? ఇదీ ఇవాళ విన‌వ‌స్తోన్న ప్ర‌శ్న‌. క‌రుణానిధి వారుసుల మాదిరిగానే త‌మ నేత అయిన వైఎస్ వార‌సుడికి కూడా కోర్టు క్లీన్ చిట్ ఇస్తుంద‌న్న ఆశ‌.. ఈ ఆశ‌ల ప‌ల్ల‌కిలోనే ఇప్పుడిక అంతా ఊరేగాలి. ఇదే స‌మ‌యంలో చంద్ర‌బాబు టీంని ఢీకొనాలి. ఎన్నాళ్లుగానో చెబుతున్న మాట సీబీఐ ఓ వేస్టు అన్న‌ది మ‌రో మారు నిరూపించామని ప్రెస్ మీట్ పెట్టి మ‌రీ డ‌ప్పు కొట్టాలి.. రెడీ కండి నేత‌ల‌రా రెండీ కండి 

ఇదీ నేప‌థ్యం  :: కాగ్ ఎప్పుడో అ(క‌)డిగేసింది 

ఈ కుంభకోణాన్నిరాజ్యాంగ బద్ద సంస్థ కాగ్ తన నివేదికలో కడిగేసింది. అప్పటి  ప్రధాని మన్మోహన్ సింగ్ బైపాస్ చేసి మరీ అప్పటి టెలికం శాఖ మంత్రిగా ఉన్న రాజా పలు నిర్ణయాలు తీసుకున్నారనే విమర్శలు వెల్లువెత్తాయి.దీనిపై అప్పట్లో పెద్ద దుమారమే రేగింది.అయితే ఇప్పుడీ కేసులో రాజా..కనిమొళి నిర్దోషులు అంటూ కోర్టు తీర్పు వెలువరించింది.ఇది పెను సంచలనంగా మారింది.దీనిపై ఈ రోజు ప‌టియాలా కోర్టు ఇచ్చిన తీర్పు తో డీఎంకే శ్రేణులు సంబ‌రాలు చేసుకుంటున్నాయి.

కరుణ గోరి రాజ‌కీయం 

కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చిన సమయంలో రెండుసార్లూ మిత్రపక్షమైన డీఎంకేకు కేంద్ర మంత్రివర్గంలో ప్రత్యేక ప్రాధాన్యం లభించింది.అప్ప‌ట్లో డీఎంకే అధినేత క‌రుణానిధి త‌మ పార్టీ నేత‌ల వ్యాపారాల‌కు అనుగుణ‌మైన శాఖ‌ల‌ను ప‌ట్టు బ‌ట్టి మ‌రీ!సాధించుకున్నారు. ఈ క్ర‌మంలోనే డీఎంకే ఎంపీ రాజాకు టెలికం కమ్యూనికేష‌న్ మంత్రి ప‌ద‌వి ద‌క్కింది. అయితే ఆయ‌న మంత్రిగా ఉన్న ప్పుడు తీసుకున్న చ‌ర్య‌ల‌తో 2జీ స్పెక్ట్రం అక్రమ కేటాయింపుల వల్ల  రూ.1.76 లక్షల కోట్లు నష్టం ఏర్పడినట్లు కేంద్ర ప్రభుత్వానికి కాగ్‌ ఒక నివేదిక సమర్పించింది. అంతేకాదు ఈ కుంభకోణం ఎఫెక్ట్ కాంగ్రెస్‌పై గ‌ట్టిగా ప‌డింది. గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ ఓడిపోయేందుకు  ప్ర‌ధాన కార‌ణాల్లో ఒక‌టి. ఇక ఇప్పుడు కోర్టు తీర్పు త‌మ‌కు అనుకూలంగా రావ‌డంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఎక్క‌డా లేని జోష్ క‌నిపిస్తోంది.తమపై విమర్శలు చేసిన వారి కి కోర్టు తీర్పు చెంపపెట్టు అని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. 

వాటమ్మా వాటు.. 

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై కూడా అక్ర‌మాస్తులకు సంబంధించి అనేక కేసులు ఉన్నాయి.ఈ కేసుల్లో తాను నిజాయితీగా భ‌య‌ట‌పెడ‌తాన‌ని వైసీపీ అ ధినేత జ‌గ‌న్‌తో పాటు వైసీపీ నాయ‌కులు ధీమాగా ఉన్నారు.ఈ కేసుల‌కు సంబంధించి జ‌గ‌న్ జైలు శిక్ష కూడా అనుభ‌వించి బ‌య‌ట‌కు వ‌చ్చిన సం గ‌తి తెలిసిందే.ఇక ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా పెద్ద కుదుపు కుదిపేసిన భారీ కుంభ‌కోణంలో నిందితుల‌కే క్లీన్ చిట్ రావ‌డంతో జ‌గ‌న్ కూడా త‌న‌పైన  నమోదు అయిన కేసుల నుంచి సులువుగా గ‌ట్టెక్కుతాన‌న్న ధీమాతో ఉన్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి.మ‌రి! జ‌గ‌న్ విష‌యంలో ఏం జ‌రుగుతుందో ?  చూడాలిక‌.ఏమో గుర్రం ఎగ‌రా వ‌చ్చు.. కోర్టు కేసు కొట్టేయ‌నూవ‌చ్చు.. జ‌గ‌న్ కూడా మీడియాకు స్వీట్లు తినిపించ‌నూవ‌చ్చు.. గెట్ రెడీ టు ఫేస్ ద సిట్యువేష‌న్‌. 

పుట్టిన రోజు వేళ జ‌గ‌న్‌కు ఓ స్వీట్ న్యూస్‌
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share