వైసీపీని ఆకాశానికెత్తేసిన జాతీయ మీడియా

March 12, 2018 at 10:30 am
ys jagan-national media

ఆంధ్రా రాజకీయాల‌పై జాతీయ మీడియా కూడా దృష్టిసారించింది. రాష్ట్రంలో ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను అంచ‌నా వేస్తూనే.. భ‌విష్య‌త్‌లో ఎవ‌రు ఏపీకి కీల‌కంగా మార‌తారో కూడా అంచ‌నా వేస్తోంది. ముఖ్యంగా కేంద్ర మంత్రి ప‌ద‌వుల‌కు టీడీపీ ఎంపీల రాజీనామా, ఎన్డీఏలోనే ఇంకా కొన‌సాగుతుండ‌టంతో తీవ్రంగా విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. అంతేగాక హోదా విష‌యంలో టీడీపీ వైఖ‌రిపైనా అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. వీట‌న్నింటినీ నిశితంగా ప‌రిశీలిస్తున్న జాతీయ మీడియా.. ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేస్తోంది. ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్‌కు ప‌రిస్థితులు పాజిటివ్‌గా ఉన్నాయ‌ని, టీడీపీతో ఢీ అంటే ఢీ అనే రేంజ్‌లో ప‌రిస్థితి ఉంద‌ని అంచ‌నా వేస్తోంది. ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే.. టీడీపీ అధికారంలోకి రావ‌డం క‌ష్ట‌మేన‌ని స్ప‌ష్టంచేస్తోంది. ఇరు పార్టీల‌కు వ్య‌త్యాసం కొద్దిగానే ఉంద‌ని, ఈ స‌మ‌యంలో వైసీపీ పుంజుకునే అవ‌కాశాలు పుష్క‌లంగా ఉన్నాయ‌ని చెబుతోంది. 

 

ఆంధ్రప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో సంచ‌ల‌న మార్పులు జ‌ర‌గ‌బోతున్నాయ‌ని జాతీయ ఛాన‌ళ్లు స్ప‌ష్టంచేస్తున్నాయి. నాలుగు రోజుల నుంచి ఆయా ఛాన‌ళ్ల‌లో వ‌స్తున్న క‌థ‌నాలు.. ఏపీ రాజకీయాలను హీటెక్కిస్తున్నాయి. వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల రేసులో సైకిల్ జోరు తగ్గుతుంద‌ని చెబుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలు అమలు చేయలేదని కేంద్ర మంత్రి వర్గం నుంచి టీడీపీ మంత్రులు వైదొలిగినా.. వాటికి జాతీయ మీడియాలో అంత స్థానం ద‌క్క‌లేదు. కానీ ఇప్పుడు జ‌గ‌న్‌పైనే దృష్టిపెట్టాయి. జాతీయ స్థాయిలో సంచ‌ల‌నంగా మారిన `రిపబ్లిక్‌టివీ`తో పాటు టైమ్స్‌ఆఫ్‌ఇండియా వంటి సంస్థలు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల‌ను నిశితంగా ప‌రిశీలిస్తున్నాయి. 

 

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే… వైసీపీ అధికారంలోకి రాకపోయినా టీడీపీ దగ్గరకు చేరుతుందని  టైమ్స్ ఆఫ్ ఇండియా కథనంలో పేర్కొంది. టీడీపీకి వైసీపీకి రెండు శాతం మాత్రమే ఓట్లు తేడా ఉందని, రాబోయే రోజుల్లో లోటును అధిగమించ‌డం ఖాయ‌మ‌ని వివ‌రించింది. 2019 ఎన్నిక‌ల్లో అధికారం వైపు వైసీపీ దూసుకుపోతుందని స్పష్టం చేసింది. జగన్‌ చేస్తున్న పాదయాత్ర, రాష్ట్రానికి ప్రత్యేకహోదా కోసం చేస్తున్న పోరాటం వంటి అంశాలు ప్రజల్లోకి బాగా వెళ్లాయని, ఇవే వైసీపీని విజ‌య‌ప‌థం వైపు న‌డిపిస్తాయ‌ని చెబుతోంది. ఇక ఇక మరొక ఛానెల్‌ అయిన రిపబ్లిక్ టీవీ గత కొంత కాలం క్రితం ఒక సర్వే ప్రకటించింది. 

 

పార్లమెంట్‌ ఎన్నికలు జరిగితే వైసీపీకి 13 ఎంపీ స్థానాలు వస్తాయని తేల్చింది. ప్రస్తుతం టీడీపీ కంటే.. వైసీపీ వెనుకబడి ఉంద‌ని చెప్పింది. ఇలా ఉన్నా.. మరోవైపు వైసీపీ పుంజుకుంటుందని, రాబోయే రోజుల్లో టీడీపీని బీట్ చేయ‌డం ఖాయ‌మ‌ని చెబుతోంది. దీంతో ఈ ఛాన‌ళ్ల స‌ర్వేలు రాష్ట్ర రాజకీయాల్లో మ‌రిన్ని మార్పుల‌కు శ్రీ‌కారం చుట్టే అవ‌కాశం లేద‌ని రాష్ట్రంలోని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. అయితే ఇవి ఎలా ఉన్నా.. ఈ క‌థ‌నాలు వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపుతున్నాయి. 

వైసీపీని ఆకాశానికెత్తేసిన జాతీయ మీడియా
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share