ఆ టీడీపీ ఎంపీతో జ‌గ‌న్‌కు టెన్ష‌న్‌…టెన్ష‌న్‌

December 18, 2017 at 9:56 am
ys jagan-Tj

మూడు ప‌దులు కూడా లేని ఓ యువ ఎంపీ ఇప్పుడు వైసీపీ అధినేత వైఎస్‌.జ‌గ‌న్‌ను బాగా టెన్ష‌న్ పెడుతున్నాడు. ఆ యువ ఎంపీపై వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ పార్టీ నుంచి ఎవ‌రిని పోటీ చేయించాలో తెలియ‌క వైసీపీ అధినేత స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. శ్రీకాకుళం ఎంపీ కింజ‌రాపు రామ్మోహ‌న్ నాయుడు పార్ల‌మెంటులో ఆంధ్రా స‌మ‌స్య‌ల‌పై ఎప్ప‌టిక‌ప్పుడు గ‌ళ‌మెత్తుతూ కేవ‌లం శ్రీకాకుళం జిల్లా ప్ర‌జ‌ల్లోనే కాకుండా తెలుగు ప్ర‌జ‌ల్లో కూడా సూప‌ర్ పాపుల‌ర్ అయ్యారు. తాజాగా విశాఖ రైల్వేజోన్‌పై పార్ల‌మెంటులో చ‌ర్చ‌కు ఆయ‌న ప్రైవేటు బిల్లు కూడా ప్ర‌వేశ పెడుతోన్న సంగ‌తి తెలిసిందే.

ఏపీకి ప్ర‌త్యేక హోదాతో పాటు రైల్వే జోన్ ఇత‌ర‌త్రా స‌మ‌స్య‌ల‌పై ఆయ‌న పార్ల‌మెంటులో సీరియ‌స్‌గా గ‌ళ‌మెత్తుతూనే ఉన్నారు. పార్ల‌మెంటులో ఏపీ నుంచి ఎంతో మంది సీనియ‌ర్ ఎంపీలు ఉన్నా రామ్మోహ‌న్ నాయుడు వాయిస్ మాత్ర‌మే వినిపిస్తుండ‌డం కూడా రాజ‌కీయ‌వ‌ర్గాల్లో కూడా సంచ‌ల‌నంగా మారింది. రోజురోజుకు క్రేజ్ పెంచుకుంటూ పోతోన్న రామ్మోహ‌న్ నాయుడును వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఓడించేందుకు స‌రైన క్యాండెట్ జ‌గ‌న్ పార్టీకి దొర‌క్క‌పోవ‌డంతో ఇప్పుడు ఆ పార్టీ త‌ర‌పున ఎవ‌రు బ‌రిలో ఉంటారో ?  కూడా అర్థం కాని ప‌రిస్థితి. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన రెడ్డి శాంతిపై రామ్మోహ‌న్ నాయుడు ఏకంగా 1.27 ల‌క్ష‌ల ఓట్ల మెజార్టీతో ఘ‌న‌విజ‌యం సాధించారు. 

వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆమె రామ్మోహ‌న్‌కు గ‌ట్టి ప్ర‌త్య‌ర్థి కాద‌ని భావించిన జ‌గ‌న్ ఆమెను పాత‌ప‌ట్నం అసెంబ్లీ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా నియ‌మించారు. ప్ర‌స్తుతం శ్రీకాకుళం పార్ల‌మెంటు పార్టీ ప‌గ్గాల‌ను జ‌గ‌న్ మాజీ మంత్రి, సీనియ‌ర్ లీడ‌ర్ త‌మ్మినేని సీతారాంకు అప్ప‌గించారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ రామ్మోహ‌న్‌ను ఢీ కొట్టేందుకు తమ్మినేని సీతారాంను పోటీ చేయించాల‌ని అనుకున్నా ఆయ‌న ఆర్థిక కార‌ణాల సాకుతో పోటీ చేయ‌న‌న్న‌ట్టు తెలుస్తోంది. ధ‌ర్మాన సోద‌రుల్లో ఎవ‌రో ఒక‌రిని బ‌రిలోకి దింపాల‌ని జ‌గ‌న్ వారిపై ఒత్తిడి చేస్తున్నా వారు మాత్రం రామ్మోహ‌న్‌ను ఢీ కొట్టే ధైర్యం చేయ‌లేక వారు ఇద్ద‌రూ అసెంబ్లీకే పోటీ చేస్తామంటున్న‌ట్టు స‌మాచారం.

ఇక 2009లో ప్ర‌జారాజ్యం నుంచి పోటీ చేసిన వ‌రుదు క‌ళ్యాణితో పాటు డాక్ట‌ర్ దానేటి శ్రీథ‌ర్ పేరు కూడా కొత్త‌గా వినిపిస్తోంది. ఇక్క‌డ ఎంపీగా వైసీపీకి బ‌ల‌మైన అభ్య‌ర్థి లేక‌పోతే ఆ ఎఫెక్ట్ మొత్తం జిల్లా అంతా ప‌డి వైసీపీ అభ్య‌ర్థుల విజ‌యావ‌కాశాల‌పై ఉంటుద‌ని జిల్లా వైసీపీ నాయ‌కుల‌తో పాటు వైసీపీ అధిష్టానం కూడా తెగ టెన్ష‌న్ ప‌డుతోంది. ఏదేమైనా ఈ యువ ఎంపీ సిక్కోలు జిల్లా అంత‌టా త‌న ప్ర‌భావంతో స‌త్తా చాటుతూ జ‌గ‌న్‌ను బాగా టెన్ష‌న్ పెడుతున్నాడ‌నే చ‌ర్చ‌లు జిల్లాలోను, వైసీపీ వ‌ర్గాల్లోను చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి.

ఆ టీడీపీ ఎంపీతో జ‌గ‌న్‌కు టెన్ష‌న్‌…టెన్ష‌న్‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share