వైఎస్ ఉంటే.. ఇలా జ‌రిగేదా? నెటిజ‌న్ల చ‌ర్చ‌!

November 2, 2018 at 11:09 am

ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియా ట్రెండ్ జోరుగా సాగుతోంది. ఎక్క‌డ ఏమూల ఏం జ‌రిగినా.. వెంట‌నే సోష‌ల్ మీడియాలో లైకు లు, షేర్లు పెరిగిపోతున్నాయి. త‌న, మ‌న అనే తేడాలేకుండా ప్ర‌తి ఒక్క‌రూ స్పందిస్తున్నారు. దీంతో సోష‌ల్ మీడియా వి ష‌యాల‌కు కూడా ప్ర‌జ‌ల్లో ఆస‌క్తి రేగుతోంది. తాజాగా సోష‌ల్ మీడియాలోని రాజకీయ మేధావుల నుంచి నేటి రాజ‌కీయ యు వ‌త వ‌ర‌కు ఓ విష‌యంపై సీరియ‌స్‌గా చ‌ర్చిస్తున్నారు. రాష్ట్రంలో వ‌డివ‌డిగా మారుతున్న రాజ‌కీయ ప‌రిణామాల నేపథ్యం లో టీడీపీ వెళ్లి కాంగ్రెస్‌తో జ‌ట్టుక‌ట్ట‌డంపై పెద్ద ఎత్తున చర్చ జ‌రిగింది. ఈ క్ర‌మంలోనే కొంద‌రు రాష్ట్రంలో వైఎస్ ఉండి ఉంటే ఈ ప‌రిణామాలు ఇలా జ‌రిగేవేనా? అనే ప్ర‌శ్న‌ను తెర‌మీదికి తెచ్చారు. దీనిపై విస్తృతంగా చ‌ర్చ న‌డిచింది.
72016487-612x612

ఏపీలో రాజ‌కీయాల‌ను ప్ర‌భావితం చేసిన ఇద్ద‌రు నాయ‌కులు ఎన్టీఆర్‌. వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి. తెలుగు ప్ర‌జ‌ల హృద‌యాల్లో వీరిద్ద‌రికీ ప్ర‌త్యేక స్థానం ఉంది. ఒక‌రు పార్టీని స్థాపించి.. దేశంలోనే చ‌క్రం తిప్పేందుకుప్ర‌య‌త్నించారు ఆయ‌నే ఎన్టీఆర్‌. ఇక‌, రాష్ట్రంలో ఇక కాంగ్రెస్ ప‌రిస్థితి అయిపోయింది. దానిని ర‌క్షించడం ఎవ‌రి త‌ర‌మూ కాద‌ని అనుకున్న స‌మ‌యంలో నేనున్నానంటూ.. ముందుకు వ‌చ్చి .. కాంగ్రెస్ పార్టీని బ‌తికించి, శాసించిన నాయ‌కుడిగా వైఎస్ చిర‌స్థాయిగా ప్ర‌జ‌ల్లో నిలిచిపోయారు. టీడీపీ ఆవిర్భావం త‌ర్వాత ఏపీలో కాంగ్రెస్ వ‌రుస విజ‌యాలు న‌మోదు చేసిందేలేదు. కానీ, వైఎస్ తీసుకున్న చొరవ‌, న‌మ్మిన సిద్ధాంతం, ప్ర‌త్య‌ర్థి పార్టీపై చూపిన పోరాట ప‌టిమ‌. అన్నింటికీ మించి.. ప్ర‌జ‌ల్లోకి వెళ్లి.. వారి మ‌న‌సు దోచుకున్న నాయ‌కుడిగా వైఎస్ ఎన్నో త‌రాల వ‌ర‌కు నిలిచిపోయారు.45367204_2344480632232181_265614323911491584_n

వైఎస్ జీవించిన ఉన్న స‌మ‌యంలో ఎక్క‌డా ఆయ‌న రాజ‌కీయంగా రాజీ ప‌డ‌లేదు. టీడీపీని తీవ్రంగా వ్య‌తిరేకించారు. టీడీపీ అధినేత‌గా చంద్ర‌బాబును వైఎస్ ఆట‌ప‌ట్టించిన తీరు ఇప్ప‌టికీ ప్ర‌సార మాధ్య‌మాల్లో వినిపిస్తూనే ఉంది. అటు పార్టీని, ఇటు ప్ర‌జ‌ల‌ను కూడా ఏక‌ఛ‌త్రాదిప‌త్యంతో న‌డించి, మ‌న్న‌న‌లు పొందిన వైఎస్‌.. కాంగ్రెస్ అంటే.. వైఎస్‌గా, వైఎస్ అంటే కాంగ్రెస్‌గాను మెలిగారు. క‌ట్ చేస్తే.. ఇప్పుడు ఏపీలో కాంగ్రెస్ ఉందంటే ఉంద‌నేది వాస్త‌వం. ఇక్క‌డ ఏ ఒక్క‌రూ పార్టీని గౌర‌వించేవారు కానీ, పార్టీని గ‌ట్టిగా ప్ర‌జ‌ల్లోకి తీసుకు వెళ్లేవారు కానీ లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ప్రస్తుతం ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్షుడిగా ఉన్న ర‌ఘువీరా.. రోత‌వీరా.. అనే వ్యాఖ్య‌లు అనిపించుకుంటున్నారు.ysr-660_080212064312_0_0

ప‌ట్టు మ‌ని ప‌ది మంది ప్ర‌జ‌ల‌ను కూడ‌గ‌ట్ట‌లేని ర‌ఘువీరా చేతిలో ఉన్న కాంగ్రెస్ ఏకంగా మౌలిక స్వ‌రూపాన్ని కోల్పోయే ప‌రిస్థితి వ‌చ్చింది. నేరుగా టీడీపీ అధినేత చంద్ర‌బాబు కాంగ్రెస్ అధినేత రాహుల్‌తో క‌లిసి చేతులు క‌లప‌డం అంటే అది కూడా రాష్ట్ర నేత‌ల‌తో చ‌ర్చించ‌కుండానే అంటే.. ఖచ్చితంగా దీనిని బ‌ట్టి ఏపీ కాంగ్రెస్ నాయ‌కులు ఎంత ద‌ద్ద‌మ్మ‌లో తేలిపోయింది. ఇక‌, ఇప్పుడు కాంగ్రెస్ నేత‌ల‌కు మిగిలింది.. టీడీప జెండాలు మోయ‌డ‌మే! అని నెటిజ‌న్లు స‌టైర్లు విసురుతున్నారు. ఈ క్ర‌మంలోనే వైఎస్ ఉండి ఉంటే ఇలా జ‌రిగేదేనా? అని చ‌ర్చించుకుంటున్నారు.

వైఎస్ ఉంటే.. ఇలా జ‌రిగేదా? నెటిజ‌న్ల చ‌ర్చ‌!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share