జగన్ కి తోడుగా షర్మిల ప్రచారం…అక్కడనుండే!

March 19, 2019 at 6:29 pm

ష‌ర్మిల ప‌రిచ‌యం అక్క‌ర‌లేని వైసీపీ నాయ‌కురాలు.. దివంగ‌త నేత వైఎస్సార్ ఆశ‌యాల‌ను సాధించేందుకు అహ‌ర్నిశ‌లు కృషి చేస్తున్న అన్న జ‌గ‌న్‌కు తోడుగా క‌దిలిన చెల్లెలు. వైఎస్సార్ మ‌ర‌ణం త‌ర్వాత చేప‌ట్టిన ఓదార్పుయాత్ర‌ను ష‌ర్మిల దిగ్విజ‌యంగా పూర్తి చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఆమె విస్తృతంగా ప‌ర్య‌టించారు. అయితే.. ఈ ఎన్నిక‌ల్లోనూ వైసీపీ త‌రుపున ప్ర‌చారం చేసేందుకు ఆమె రెడీ అవుతున్నారు. ఇప్ప‌టికే ఏపీలో వైసీపీ గాలి బ‌లంగా వీస్తోంది. ఇప్ప‌టికే వైసీపీ అధినేత జ‌గ‌న్ ఎన్నిక‌ల ప్ర‌చారం జోరుగా సాగుతోంది. సుమారు రోజుకు మూడు జిల్లాల్లో మూడు స‌భ‌ల్లో ఆయ‌న పాల్గొంటున్నారు. ఇక ష‌ర్మిల కూడా ప్ర‌చారంలోకి దిగితే.. వైసీపీ దూకుడును ఎవ‌రూ ఆప‌లేర‌నే చెప్పొచ్చు.

అయితే.. ఈ ఎన్నిక‌ల్లో ష‌ర్మిల‌తోపాటు పార్టీ గౌర‌వ అధ్య‌క్షురాలు వైఎస్ విజ‌య‌మ్మ కూడా ప్ర‌చారం చేసే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. వీరిద్ద‌రూ ప్ర‌చారం చేస్తే.. ఇక పార్టీకి మ‌రింత బ‌లం చేకూరుతుంద‌ని పార్టీ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. ఈ నెల 27నుండి ఎన్నికల వీరి ప్రచారం ప్రారంభం అవుతుంద‌ని పార్టీ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. అయితే.. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. టీడీపీ అధినేత‌, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు త‌న‌యుడు మంత్రి లోకేశ్ పోటీచేస్తున్న మంగళగిరి నియోజకవర్గం నుంచే ష‌ర్మిల బస్సుయాత్రను ప్రారంభిచబోతున్నారు. వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణ తరపున ఆమె ప్రచారం చేయనున్న‌ట్లు తెలుస్తోంది.

ఈ మేర‌కు పార్టీ కూడా రూట్‌మ్యాప్ రెడీ చేసిన‌ట్లు తెలుస్తోంది. రాజ‌ధాని అమ‌రావ‌తి ప్రాంత‌మైన‌ మంగళగిరి నుంచి ఇచ్చాపురం వరకు షర్మిల రోడ్‌షోలు నిర్వహించనున్నారు. ఏపీలోని మొత్తం 10 జిల్లాల్లో 50 నియోజకవర్గాల్లో ష‌ర్మిల బ‌స్సుయాత్ర కొన‌సాగుతుంద‌ని ఆ పార్టీ నాయ‌కులు చెబుతున్నారు. ప్ర‌జ‌ల‌ను ఎంతో ఆప్యాయంగా ప‌ల‌క‌రిస్తూ.. ప్ర‌త్య‌ర్థుల‌పై విరుచుకుప‌డే ష‌ర్మిల మంగ‌ళ‌గిరిలో ప్ర‌చారం చేస్తే… త‌త్త‌ర‌పాటు లోకేశ్‌బాబు బిత్త‌ర‌పోవ‌డం ఖాయ‌మ‌ని వైసీపీ నాయ‌కులు అంటున్నారు. అయితే.. మంత్రి లోకేశ్‌పై ష‌ర్మిల ఎలాంటి కామెంట్లు చేస్తుంద‌న్న దానిపై నియోజ‌క‌వ‌ర్గంలో అప్పుడు ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది.

జగన్ కి తోడుగా షర్మిల ప్రచారం…అక్కడనుండే!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share