స‌భ‌ల్లో జ‌గ‌న్ స‌రికొత్త పంథా..

February 8, 2019 at 10:55 am

తాను చెప్పిందే వేదం.. తాను చెప్పిందే వినాలి.. తాను చేసిందే రైట్‌.. ఎలాంటి ప్ర‌శ్న‌ల‌కు తావులేదు.. అభిప్రాయాల వెల్ల‌డికి ఏమాత్ర‌మూ అవ‌కాశం ఉండ‌దు. ఏన్నో ఏళ్లుగా పార్టీల అధినేత‌ల‌కు, పార్టీ శ్రేణుల‌కు మ‌ధ్య‌, పార్టీ అధినేత‌ల‌కు ప్ర‌జ‌ల‌కు మ‌ధ్య కొన‌సాగుతూ వ‌స్తున్న‌ గ్యాప్ ఇది. ఇక ఈ ప‌రిస్థితి గ‌తంగా మిగిలిపోనుంది. ఈ అంత‌రాల‌ను వైసీపీ అధినేత జ‌గ‌న్ చెరిపేస్తున్నారు. స‌మావేశాలు, స‌భ‌ల్లో వైసీపీ అధినేత జ‌గ‌న్ స‌రికొత్త పంథాను స‌`ష్టిస్తున్నారు. రాజ‌కీయాల్లో నూత‌న అధ్య‌యానికి శ్రీ‌కారం చుడుతున్నారు. నాయ‌కుడంటే క‌ల‌గాల్సింది భ‌యం కాదు.. భ‌రోసా.. అని నిరూపిస్తున్నారు. ఇంత‌కీ అది ఎలా చేస్తున్నారనే క‌దా మీ డౌటు. అయితే.. ఈ చిన్నపాటి క‌థ‌నం మీరు చ‌ద‌వాల్సిందే మ‌రి.51258600_2160922983928157_455560163110158336_n

పార్టీల అంత‌ర్గ‌త స‌మావేశాలు, శ్రేణుల‌తో స‌మావేశాలు, ప్ర‌జ‌ల‌తో స‌భ‌లు నిర్వ‌హించేట‌ప్పుడు కేవ‌లం అధినేత‌లు మాత్ర‌మే మాట్లాడుతారు. వారు చెప్పిందే విని పార్టీశ్రేణులు, ప్ర‌జ‌లు వెళ్తారు. కానీ ఇక్క‌డ శ్రేణుల అభిప్రాయానికిగానీ.. ప్ర‌జ‌ల వాయిస్‌కు గానీ ఎక్క‌డ కూడా అవ‌కాశం ఉండ‌దు. ఇక ప్ర‌శ్న‌ల గురించి ఆలోచించ‌నే కూడ‌దు. ఈ ప‌రిస్థితుల‌ను రూపుమాపేందుకు స‌రికొత్త పంథాను క్రియేట్ చేస్తున్నారు వైసీపీ అధినేత జ‌గ‌న్‌. ఏడాదికాలానికిపైగా ప్ర‌జాసంక‌ల్ప‌యాత్ర చేప‌ట్టి ప్ర‌జ‌ల క‌ష్ట‌సుఖాలు తెలుసుకున్నారు. వారితో మ‌మేకమై ముందుకు వెళ్లారు. భార‌త రాజ‌కీయ చ‌రిత్ర‌లోనే జ‌గ‌న్ చేప‌ట్టిన అవిశ్రాంత పాద‌యాత్ర కొత్త చ‌రిత్ర‌కు నాంది ప‌లికింది.51308574_2160923167261472_8135647324052389888_n

ఇక ఫిబ్ర‌వ‌రి 4వ తేదీ నుంచి చేప‌డుతున్న సమ‌ర‌శంఖారావం స‌భ‌ల్లో జ‌గ‌న్ మ‌రో కొత్త పంథాను అమ‌లు చేస్తున్నారు. ఈ స‌భ‌ల్లో అధ్య‌క్షుడి హోదాలో ప్ర‌సంగించిన త‌ర్వాత ప్ర‌త్య‌క్షంగా పార్టీ శ్రేణుల అభిప్రాయాల‌ను తీసుకుంటూ.. వారి ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు చెబుతున్నారు. స‌భా ప్రాంగ‌ణంలోనే మ‌ధ్య నుంచి ఏర్పాటు చేసిన ప్ర‌త్య‌క దారిపై న‌డుస్తూ.. పార్టీ శ్రేణుల‌తో మాట్లాడుతున్నారు. వారి ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు చెబుతూ దిశానిర్దేశం చేస్తున్నారు. ఇందుకోసం చాలా స‌మ‌య‌మే కేటాయిస్తున్నారు. జ‌గ‌న్ న‌డుస్తున్న ఈ పంథా అన్నివ‌ర్గాల‌ను ఆక‌ట్టుకుంటోంది. ఇదీ నాయ‌కుడి ల‌క్ష‌ణం అంటూ ఇత‌ర పార్టీల నేత‌లు కూడా లోలోప‌ల మెచ్చుకుంటున్నారు.

స‌భ‌ల్లో జ‌గ‌న్ స‌రికొత్త పంథా..
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share