జ‌గ‌న్‌కు వ‌రంగా మార‌నున్న ఆ సెంటిమెంట్‌!

June 5, 2018 at 2:43 pm
ycp-

రాజ‌కీయాల్లో సెంటిమెంటుకు ఎక్క‌డా లేని ప్రాధాన్యం ఇస్తారు నాయ‌కులు. పార్టీ ప్రారంభం నుంచి నాయ‌కుల కూర్పు చేర్పుల‌వ‌ర‌కు అన్నీ సెంటిమెంటు ఆధారంగానే సాగుతుంటాయి. ముఖ్యంగా ప్ర‌జ‌ల‌ను సెంటిమెంట్ వైపు మ‌ళ్లించి.. ఓట్ల‌ను వేయించుకోవ‌డంలో ఏ పార్టీకి ఆ పార్టీ ఆరితేరిపోయాయి. ఇప్పుడు ఇలాంటి సెంటిమెంట్ ఒక‌టి వైసీపీని అధికారంలోకి తెస్తుంద‌ని అంటున్నారు ఆ పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు. విష‌యంలోకి వెళ్తే.. మ‌రో ఏడాదిలోనే ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ ఎన్నిక‌ల‌కు సంబంధించి బ‌ల‌మైన ప‌క్షాలుగా టీడీపీ, వైసీపీ, జన‌సేన‌లు రంగంలోకి దిగుతున్నాయి. దీంతో ఈ పార్టీల ముగ్గురు నేత‌లు.. కీల‌కంగా మార‌నున్నారు. ప‌లితంగా ఏపీలో త్రిముఖ పోటీ సాగ‌నుంది. 

 

ఈ పోటీలో ఎవ‌రు గెలుస్తారు?  ఎవ‌రు సీఎం సీటును అధిరోహిస్తారు? అనేది ప్ర‌స్తుతం హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఈ నేప‌థ్యంలో ఆయా రాజ‌కీయ నాయ‌కుల ప‌రిస్థితిని ప‌క్కన పెడితే, రాష్ట్రంలో రాజ‌కీయాల్లో నెల‌కొన్న సెంటిమెంట్ ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. సీఎం అయ్యే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ప్రజలతో మమేకమవుతూ.. వారి కష్టాలు తెలుసుకుంటూ జగన్ ప్ర‌జాసంక‌ల్ప పాద‌యాత్ర చేస్తున్న విష‌యం తెలిసిందే. రాష్ట్రంలో గ‌త చ‌రిత్ర‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటే.. పాదయాత్ర చేసే ప్రతిపక్ష నేత సీఎం అయ్యే సెంటిమెంటు క‌నిపిస్తోంది. 

 

గ‌తంలో తొలిసారి వైఎస్ రాజశేఖరెడ్డి, త‌ర్వాత టీడీపీ అధినేత‌ చంద్రబాబునాయుడు అలా పాదయాత్రల తరువాత సీఎం అయ్యారు. ఇప్పుడు జగన్ కూడా సీఎం కానున్నారనేది వైసీపీ నాయ‌కుల మాట‌. ప్ర‌స్తుతం రాష్ట్రంలో చంద్ర‌బాబు పాల‌న‌కు నాలుగేళ్లు ముగిశాయి. అయితే, ఆయ‌న రాజ‌కీయాల్లో జిమ్మిక్కులు చేయడం తోనే కాలం వెళ్ల‌బుచ్చుతున్నారు త‌ప్ప నిజ‌మైన పాల‌న సాగిస్తున్న ప‌రిస్థితి ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. కులానికో కార్పొరేష‌న్ ఏర్పాటు చేసినా.. చంద్ర‌బాబుపై వ్య‌తిరేక‌త పోవ‌డంలేదు. ఇక‌, జ‌న‌సేన త‌ర‌ఫున బ‌రిలో దిగిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై కూడా ప్ర‌జ‌ల‌కు విశ్వాసం స‌న్న‌గిల్లుతోంది. 

 

గ‌తంలో ఈయ‌న టీడీపీ, బీజేపీల‌తో అంట‌కాగిన విష‌యాన్ని ప్ర‌జ‌లు ప్ర‌స్తావిస్తున్నారు. ఇప్పుడు ఆయ‌న పార్టీకి ఓట్లు వేసినా.. ప్ర‌భుత్వం ఏర్పాటు చేసే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేద‌ని ప్ర‌జ‌లు చెప్పుకొంటున్నారు. అదేస‌మ‌యంలో వైసీపీ ప‌రిస్థితిని గ‌మ‌నిస్తే.. 2014 నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఒకే విధ‌మైన రాజ‌కీయాలు చేస్తున్నాడ‌ని జ‌గ‌న్‌కు మంచి మార్కులు ప‌డుతున్నాయి. ఈ నేప‌థ్యంలో నిక‌రంగా ఏపీకి పాల‌న అందించే నాయ‌కుడిగా జ‌గ‌న్‌కు ప్ర‌జ‌లు ఎక్కువ మార్కులు వేస్తుండ‌డం గ‌మ‌నార్హం. 

జ‌గ‌న్‌కు వ‌రంగా మార‌నున్న ఆ సెంటిమెంట్‌!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share