వైసీపీకి 150 సీట్లు ఖాయమట?

February 6, 2019 at 4:42 pm

ఏపీలో పొలిటిక‌ల్ హీట్ రోజురోజుకు పెరుగుతోంది. ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో నేతల వ్యూహాలు, ప్ర‌తి వ్యూహాల‌తో రాజ‌కీయం మ‌రింత వేడెక్కుతోంది. ఆయా పార్టీల నాయ‌కులు ఎవ‌రికి వారే లెక్క‌ల్లో మునిగితేలుతున్నారు. విజ‌యం మాదంటే మాదే అంటూ ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. మా పార్టీ ఇన్ని స్థానాల్లో గెలుస్తుందంటే… మా పార్టీ అన్ని స్థానాల్లో గెలుస్తుంద‌ని పోటీ ప‌డి ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నారు. అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీలు వచ్చే ఎన్నికల్లో గెలుపుపై పూర్తి విశ్వాసం వ్య‌క్తం చేస్తున్నాయి. Sajjala-s-Controversial-Comments-On-PK-Team-1545722045-1666

రానున్న ఎన్నికల్లో ఏపీలో 150 సీట్లు గెలుస్తామని ఇటు టీడీపీ, అటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల నేత‌లు ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. తాజాగా వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా అలాంటి వ్యాఖ్యలే చేశారు. విజయవాడలో మీడియాతో ఆయైన మీడియాతో మాట్లాడుతూ… రాబోయే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. ఎన్నికల్లో వైసీపీ 150 సీట్లలో విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తమది అతి విశ్వాసం కాదని ఆత్మ విశ్వాసమని చెప్పుకొచ్చారు. పార్టీని వ్యవస్థాగతంగా బలోపేతం చేసుకునేందుకు గ్రామస్థాయి నుంచి ప్రతి ఒక్కరినీ సమాయత్తం చేస్తున్నట్లు తెలిపారు. వారందరికీ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ దిశానిర్దేశం చేస్తారని స‌జ్జ‌ల తెలిపారు.YS_Jagan_7009

ఇటీవ‌ల తెలంగాణలో జరిగిన ముంద‌స్తు ఎన్నిక‌ల్లో అధికార టీఆర్ ఎస్ పార్టీ 100 సీట్లలో గెలుస్తామ‌ని చెప్పింది. అయి తే 100 సీట్లు గెలవనప్పటికీ, దాదాపు 90 సీట్లలో విజయం సాధించి తిరిగి అధికారం చేప్పట్టింది. తెలంగాణ‌లో లాగా ఏపీలో కూడా నేత‌లు 150 సీట్ల సెంటిమెంట్ ఫాలో అవుతున్నారా అని ప్ర‌జ‌లు అనుకుంటున్నారు. మొత్తానికి 150 సీట్లు కాక‌పోయినా కనీసం 100 కి పైగా గెలుచుకొని ప‌వ‌ర్‌లోకి వ‌స్తామ‌ని ఆయా పార్టీల నేత‌లు ధీమాతో ఉన్న‌ట్లు తెలుస్తోంది. అయితే తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ఒక్క‌టే 100 స్థానాల్లో విజ‌యం సాధిస్తామ‌ని అన్నది. కానీ ఏపీలో మాత్రం టీడీపీ, వైసీపీ రెండూ 150 సీట్లు మావే అంటూ ఎవ‌రికివారు చెప్పుకుంటున్నారు. అయితే ఎవ‌రి లేక్క‌లు నిజ‌మ‌వుతాయో తేలాలంటే ఎన్నిక‌ల వ‌ర‌కు ఆగాల్సిందే.

వైసీపీకి 150 సీట్లు ఖాయమట?
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share