వైసీపీలో బీజేపీ నాయకుడు చేరిక !

October 22, 2018 at 4:17 pm

ఏపీ విప‌క్షం వైసీపీలో చేరిక‌లు పెరుగున్నాయి. కింది స్థాయి నేత‌ల నుంచి పైస్థాయి వ‌ర‌కు కూడా పార్టీలోకి చేరేందుకు క్యూ క‌డుతున్నారు. ప్ర‌ధానంగా ఎన్నిక‌లకు స‌మ‌యం స‌మీపిస్తున్న నేప‌థ్యంలో నాయ‌కుల ఆస‌క్తికూడా పెరుగుతోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీని గెలిపించాల‌నే ఉత్సాహం మ‌రింత రెట్టింపు అవుతోంది. ఈ నేప‌థ్యంలోనే ఎక్క‌డిక‌క్క‌డ నాయ‌కు లు పార్టీలోకి చేరుతున్నారు. వాస్త‌వానికి ఇప్పుడున్న ప‌రిస్థితిలో అధికార టీడీపీ చెబుతున్న దానిని బ‌ట్టి ఏపీలో టీడీపీకి సానుకూల ప‌వ‌నాలు వీస్తున్నాయి. అయితే, ఆ పార్టీలో చేరేవారి సంఖ్య మాత్రం ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. పైగా.. వైసీపీ కి చేరేవారి సంఖ్య పెరుగుతుండ‌డం గ‌మ‌నార్హం.

తాజాగా బీజేపీ రాష్ట్ర మజ్దూర్‌ మోర్చా కార్యవర్గ సభ్యుడు కోరాడ సత్యనారాయణ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకర రెడ్డి సత్యనారాయణ సమక్షంలో వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా కోరాడ మాట్లాడుతూ రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే జగన్‌ అధికారంలోకి రావాలన్నారు. అదేవిధంగా.. దాదాపు ఏడాది కాలంగా రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తూ ప్రజల కష్టాలను తెలుసుకుంటున్న ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి బొబ్బిలికి చెందిన న్యాయవాదులు సంఘీభావం తెలిపారు. ప్రజా సంకల్పయాత్ర చేపడుతున్న జగన్‌మోహన్‌రెడ్డిని బొబ్బిలి మండలంలోని పారాది వద్ద ఆదివారం కలిసి మద్దతు ప్రకటించారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రంలో సంక్షేమ పాలన అందుతుందని అభిప్రాయపడ్డారు. ఇక‌, మిగిలిన‌వ‌ర్గాల‌కు చెందిన వారు సైతం పార్టీకి సంఘీభావం ప్ర‌క‌టిస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యానికి ఇది త‌మ‌కు నాందీ ప్ర‌స్తావ‌న‌గా వైసీపీ నాయ‌కులు చెబుతుండ‌డం గ‌మ‌నార్హం. జ‌గ‌న్ యాత్ర‌కే కాకుండా ఆయ‌న ఎక్క‌డ పాద‌యాత్ర నిర్వ‌హించినా.. ప్ర‌జ‌లు తండోప తండాలుగా క్యూక‌డుతున్నారు. కానీ, అధికార పార్టీనాయ‌కులు ఈ విష‌యాన్ని జీర్ణించుకోలేకపోతుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఇది రాబోయే రోజుల్లో జ‌గ‌న్ మ‌రింత ప్ర‌భంజ‌నం సృష్టించినా ఆశ్చ‌ర్య ప‌డాల్సిన అవ‌స‌రం లేదేమో!?

వైసీపీలో బీజేపీ నాయకుడు చేరిక !
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share