వైవీ సుబ్బారెడ్డి ఇక తప్పుకున్నట్టే!

October 18, 2018 at 10:33 am

ప్ర‌కాశం జిల్లాలో కీల‌క‌మైన ఒంగోలు ఎంపీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌ఫున ఎవ‌రుబ‌రిలోకి దిగ‌బోతు న్నారు? అక్క‌డెవ‌రు దిగుతారంట? ఈ ప్ర‌శ్న‌లే ఏ ఇద్ద‌రు వైసీపీ నాయ‌కులు క‌లిసినా చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి. త‌న దూకు డుతో.. నియంతృత్వ ధోర‌ణితో అటు పార్టీని, ఇటు త‌న కేరీర్‌ను ప్ర‌శ్నార్థకం చేసుకున్నారు ప్ర‌స్తుత ఒంగోలు తాజా మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి. 2014 ఎన్నిక‌ల్లో మాగుంట శ్రీనివాసుల రెడ్డిపై భారీ విజ‌యాన్ని న‌మోదు చేసిన వైవీ.. అంతే రేంజ్ లో భారీ దూకుడు ప్ర‌ద‌ర్శించారు. త‌న‌కు ఎదురు లేద‌ని, త‌న‌కు తిరుగులేద‌ని భావించారు. కిందిస్థాయి నాయ‌కుల‌నే కాదు జిల్లా స్థాయి నేత‌ల‌ను కూడా ఆయన ప‌ట్టించుకోలేదు. పైగా.. వ‌సూళ్ల రాజాగా పేరు తెచ్చుకున్నారు. దీనిపై అనేక ఆరోప‌ణ‌లు వెల్లువెత్తిన త‌ర్వాత వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. త‌న‌వంతుగా చెప్పిచూశారు.24-1445671260-yv-subba-reddy-ysrcp-645-17-1489743663

అయినా.. వైవీలో దూకుడు ఎక్క‌డా చ‌ల్లార‌లేదు. ఒక‌ప‌క్క బాబాయి. మ‌రోప‌క్క పార్టీ.. ఈ రెండు విష‌యాల్లోనూ ఓ క్లారిటీకి వ‌చ్చిన వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. పార్టీ క‌న్నా త‌న‌కు బాబాయి ఎక్కువ కాద‌నే నిర్ణ‌యానికి వ‌చ్చారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయన ను త‌ప్పించాల‌ని నిర్ణ‌యించుకున్నారు. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఒంగోలు ఎంపీ టికెట్ ఖాళీ కావ‌డం ఖాయం. ఇక‌, దీనికి వైవీ కూడా మాన‌సికంగా సిద్ధ‌మైపోయారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగూ టికెట్ రాద‌నినిర్ణ‌యించుకున్న ఆయ‌న నియోజ‌క వ‌ర్గాల స‌మ‌న్వ‌య‌క‌ర్త‌ల విష‌యాల‌ను చూస్తున్నారు. ఇటీవ‌ల వెలిగొండ ప్రాజెక్టు కోసం పాద‌యాత్ర చేసినా. ఆశించిన మేర‌కు పెద్ద‌గా స్పంద‌న రాలేదు. దీంతో ఆయ‌న రాజ‌కీయాలు ఇక ఔట్ డేటెడ్ అయిపోయాయ‌ని అంటున్నారు._magunta srinivas reddy

పోనీ.. ఆయ‌న ఫ్యామిలీ నుంచి ఎవ‌రినైనా రంగంలోకి దింపుదామ‌న్నా.. ఎవ‌రూ ముందుకు వ‌చ్చే ప‌రిస్థితి లేదు. దీంతో వైసీపీ ఇప్పుడు ఒంగోలులో నిఖార్స‌యిన నేత కోసం ఎదురు చూస్తోంది. ఈ క్రమంలోనే టీడీపీ అసంతృప్తితో ర‌గిలిపోతున్న మాగుంట శ్రీనివాసుల‌రెడ్డికి అవ‌కాశం ఇవ్వాల‌ని భావిస్తున్న‌ట్టు స‌మాచారం. దీంతో ఎప్ప‌టి నుంచి ఉన్న పరిచయాలతో వైసీపీ రాష్ట్ర నాయకుడు, జిల్లా పరిశీలకుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఆ బాధ్యతను తీసుకున్నట్లు తెలుస్తోంది. పలుదఫాలు మాగుంటతో మాట్లాడటమే కాక ఆయనకు సన్నిహితంగా కుటుంబసభ్యులుగా మెలిగే సహిచరులతో నిత్యం టచ్‌లో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ వ్యవహారాలను చూస్తున్న ఎంపీ విజయసాయిరెడ్డి కూడా మాట్లాడారని స‌మాచారం. అలాగే జిల్లాలో కీలక నేత అయిన బాలినేని పార్టీశ్రేణులతో బహిరంగంగానే ఆయనకు స్వాగతం పలుకుతున్నట్లు చెప్పడం విశేషం. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో ఏం జ‌రుగుతుంద‌నేది వేచి చూడాలి.

వైవీ సుబ్బారెడ్డి ఇక తప్పుకున్నట్టే!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share