రోజాకు బొండా ఉమా బోడి గుండు స‌వాల్‌… రోజా దిమ్మ‌తిరిగే కౌంట‌ర్‌

నంద్యాల ఉప ఎన్నిక వైసీపీ, టీడీపీ నేత‌ల మ‌ధ్య మాట‌ల యుద్ధానికి ప‌రాకాష్ట‌గా మారింది. ముఖ్యంగా అటు టీడీపీ ఫైర్ బ్రాండ్‌గా త‌న‌నుతాను చిత్రీక‌రించుకున్న విజ‌య‌వాడ సెంట్ర‌ల్ ఎమ్మెల్యే బొండా ఉమాకి, వైసీపీ లేడీ టైగ‌ర్ రోజాకి మ‌ధ్య స‌వాళ్లు ప్ర‌తి స‌వాళ్లు పొలిటిక‌ల్ హీటును పెంచేశాయి. ముఖ్యంగా నంద్యాల ఉప పోరులో చివ‌రి ప్ర‌చార‌దినం సోమ‌వారం నాడు.. ఈ నేత‌లు మ‌రింత‌గా రెచ్చిపోయారు. నంద్యాల‌లో టీడీపీ గెలుపు ఖాయ‌మ‌ని బొండా ఉద్ఘాటించారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. అయితే, ఆయ‌న ఇదే స‌మ‌యంలో టీడీపీ ఓడిపోతే.. ఎన్నిక‌ల కౌంటింగ్ రోజునే తాను నంద్యాలకు వ‌చ్చి.. గుండు కొట్టించుకుంటాన‌ని, అయితే, అదే రోజు.. వైసీపీ ఓడిపోతే.. రోజా గుండు కొట్టించుకుంటుందా? అని బొండా స‌వాలు రువ్వారు.

మ‌రి జ‌బ‌ర్ద‌స్త్ రోజా.. ఊరుకుంటుందా? ఆమె కూడా బొండాకు దీటుగా స్పందించింది. ఆయ‌న రువ్విన స‌వాల్‌ను స్వీక‌రిస్తానంది. వైసీపీ ఓడిపోతే.. తాను నంద్యాల‌కు వ‌చ్చి గుండు కొట్టించుకుంటాన‌ని ప్ర‌తి స‌వాల్ రువ్వింది. అయితే, అదేస‌మ‌యంలో వైసీపీ నుంచి జంపింగ్‌ల‌ను ప్రోత్స‌హించి 21 మంది ఎమ్మెల్యేల‌ను టీడీపీ సైకిలెక్కించుకున్నారు క‌దా? వారిని రాజీనామా చేయించి తిరిగి ఎన్నిక‌ల‌కు మీరు సిద్ధ‌మ‌వుతారా? అని ప్ర‌తిస‌వాల్ రువ్వింది. దీనికి టీడీపీ సిద్ధ‌మైతే.. దానికి తాను సిద్ధ‌మ‌ని ప్ర‌క‌టించింది.

ఇంకే ముంది.. ఇక‌, ఈ విష‌యం లేవ‌నెత్త‌గానే బొండా ఉమా సందిగ్ధంలో ప‌డిపోయాడు. మొత్తానికి నంద్యాల ఉప పోరులో.. చివ‌రి రోజు.. బొండా, రోజాల గుండు స‌వాల్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో భారీ ఎత్తున హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. నిజానికి రోజా ఆడ‌దైనా.. బొండా ఉమా స‌వాల్ స్వీక‌రించినప్పుడు.. మ‌గాడైన బొండా ఉమా.. రోజా స‌వాల్ స్వీక‌రిస్తాడా అంటూ.. సోష‌ల్ మీడియాలో కామెంట్లు కుమ్మెస్తున్నారు నెటిజ‌న్లు!!

ఇక‌, నంద్యాల అభ్య‌ర్థి శిల్పా చ‌క్ర‌పాణి రెడ్డి.. సీఎం చంద్ర‌బాబు నిన్న చేసిన కామెంట్ల‌కు ప్ర‌తికామెంట్లు చేశారు. శిల్పా మంత్రిగా ఉన్నప్పుడు ప్ర‌జాధ‌నాన్ని దోచేశార‌ని, దీంతో శిల్పా సహకార సేవా సమితి ఏర్పాటు చేసి మహిళలను మోసం చేశారని చంద్ర‌బాబు ఆరోపించారు. అంతేకాదు, ఈ సమితి నుంచి రుణాలు తీసుకున్న మహిళలు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని కూడా అన్నారు.

ఇక‌, మ‌రో అడుగు ముందుకేసిన బొండా ఉమా.. శిల్పా స‌హ‌కార స‌మితి తెర‌వెనుక మ‌హిళ‌ల‌ను లైంగికంగా వేధించార‌ని, వారిపై క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని అన్నారు. దీనికి స్పందించి శిల్పా మోహ‌న్‌రెడ్డి.. ద‌మ్ముంటే వెంట‌నే విచార‌ణ‌కు ఆదేశించాల‌ని స‌వాల్ విసిరారు. ప్ర‌జ‌ల ఆశీర్వాదంతో తాను రాజ‌కీయాలు చేస్తున్నాన‌ని విరుచుకుప‌డ్డారు. మ‌రి బోండా దీనినైనా స్వీక‌రిస్తాడో లేదో చూడాలి.