వైసీపీలోకి ప్రముఖ సినీన‌టుడు!

March 21, 2019 at 12:31 pm

ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్ది వైసీపీలోకి వ‌ల‌స‌లు పెరుగుతున్నాయి.. జ‌గ‌న్‌కు ప్ర‌జ‌ల్లో ల‌బ్ధిస్తున్న ఆద‌ర‌ణ చూసి అధికార పార్టీకి వ‌ణుకుపుడుతా ఉంటే ఇత‌ర పార్టీల‌కు ఏం చేయాలో అర్థం కాని ప‌రిస్థితి నెల‌కొంది.. నాలుగున్న‌రేళ్ల పాల‌న‌లో టీడీపీ చేసిన ఘ‌న‌కార్యాల‌ను జ‌నాలు అస‌హ్యించుకుంటుండ‌గా, తాను అధికారంలోకి రాగానే ఏమేం చేయ‌బోతునున్నాడో స్ప‌ష్ట‌మైన విధానాల‌తో ఉన్న జ‌గ‌న్ వైపు అన్ని వ‌ర్గాల వారు చూస్తున్నారు. త‌మ ప్రియ‌తమ నాయ‌కుడికి ఎలాగైన త‌మ వంతు సాయం చేయాల‌ని, జ‌గ‌న్‌ను పీఠం ఎక్కించ‌డానికి ఎంత క‌ష్ట‌మైన ప‌డ‌డానికి సిద్ధ‌మ‌ని ప‌లువురు పార్టీలో చేరుతున్నారు.

ఈ వ‌ర‌స‌లో సినీ ప్ర‌ముఖులు మ‌రీ పోటీ ప‌డుతున్న‌ట్టు అనిపిస్తోంది.. గ‌తంలోనే చాలా మంది ప్ర‌ముఖులు జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీ కండువా క‌ప్పుకున్నారు. త‌మ‌కు అధినేత ఏ ప‌ని అప్ప‌గించినా పార్టీ కోసం చేస్తామ‌ని స్వ‌చ్ఛందంగా ప్ర‌క‌టించారు. ఇప్పుడు అదే కోవ‌లో సినీ న‌టుడు శివాజీ రాజా కూడా చేర‌బోతున్నాడు. తాను వైఎస్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో పార్టీలో చేర‌బోతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. జ‌గ‌న్‌కు ప్ర‌జ‌ల్లో ఉన్న ఆద‌ర‌ణ‌, పేద ప్ర‌జ‌ల‌పై జ‌గ‌న్‌కు ఉన్న ప్రేమ‌, వారి క‌ష్టాలు తీర్చ‌డానికి జ‌గ‌న్ ప‌డుతున్న తాప‌త్రాయాన్ని గ‌మ‌నించే తాను వైసీపీలో చేర‌డానికి సిద్ధ‌ప‌డుతున్న‌ట్టు శివాజీరాజా చెప్పారు.

కాగా, ఓ వైపు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ ఎన్నిక‌ల్లో నెల‌కొన్న గంద‌ర‌గోళం. మెగా బ్ర‌ద‌ర్స్‌కు తానంటే మింగుడు ప‌డ‌ని వైనంతో శివాజీరాజా తీవ్ర అసంత్రుప్తిగా ఉన్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే నిన్న‌నే కొణిద‌ల నాగ‌బాబు ప‌వ‌ణ్‌క‌ళ్యాన్ స‌మ‌క్షంలో జ‌న‌సేన పార్టీలో చేరిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే శివాజీరాజా వైసీపీలో చేర‌డం అత్యంత కీల‌క ప‌రిణామంగా మారింది. **మా** అధ్య‌క్షుడిగా శివాజీరాజా చేసిన అభివ్రుద్ధి కార్య‌క‌లాపాలు అంద‌రికీ తెలిసిందే. అసోసియేష‌న్ అభివ్రుద్ధికి తాను చేసిన ప‌నులు నచ్చ‌క‌నే త‌న‌ను కొంద‌రు కావాల‌ని తొక్కేసార‌ని శివాజీరాజీ గ‌తంలోనే ప్ర‌క‌టించ‌డం తెలిసిందే. ఏదిఏమైనా శివాజీరాజా జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీ కండువా క‌ప్పుకోవ‌డానికి నిర్ణ‌యించుకోవ‌డంతో స‌ర్వ‌త్రా ఒక ర‌క‌మైన వాతావ‌రణం నెల‌కొంది.

వైసీపీలోకి ప్రముఖ సినీన‌టుడు!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share