విప‌క్షంలో దొంగ‌లు.. మ‌రి అధికార పార్టీ ఏం చేస్తోంది..!

December 15, 2018 at 4:43 pm

అవును! ఏపీ అధికార పార్టీ టీడీపీకి చెందిన కొంద‌రు నాయ‌కులు చేస్తున్న ప్ర‌క‌ట‌న‌లకు.. సోష‌ల్ మీడియాలో ఇదే త‌ర‌హా స‌టైర్ వ్యాఖ్య‌లు ప‌డుతున్నాయి. అధికారం మీది… పోలీసులు మీ చేతుల్లో ఉన్నారు.. మ‌రి విప‌క్షంలో ఉన్న దొంగ‌ల‌ను కూడా ప‌ట్టుకోలేక పోతున్నారంటే.. మీకు ఎందుకు అధికారం ఇవ్వాలి? అనేది నెటిజ‌న్ల సూటి ప్ర‌శ్న‌. తాజాగా ప్ర‌భుత్వ విప్ కూన ర‌వికుమార్ వైసీపీపై విరుచుకుప‌డ్డారు. దొంగ‌లంద‌రూ వైసీపీలోనే ఉన్నార‌ని అన్నారు. ఇసుక మాఫియాకు సూత్ర ధారుడు వైసీపీ నేత త‌మ్మినేని సీతారాం అని విమ‌ర్శించారు. నిజ‌మే! కావొచ్చు.. కూన చెప్పిన‌వ‌న్నీ వాస్త‌వాలు అనుకుందాం.. మ‌రి అలాంటి దొంగ‌ల్ని ఏరేయ‌మ‌నే క‌దా ప్ర‌జ‌లు మీకు అధికారం ఇచ్చారు!

మ‌రి ఆ అధికారాన్ని వినియోగించి ఏరేయ‌కుండా ఇన్నాళ్లు ఎందుకు మౌనం పాటించారు? ఎందుకు మౌనంగా ఉన్నారు? అంటే మీరు కూడా వారితో కుమ్మ‌క్క‌య్యారా? లేక .. మీకు కూడా వాళ్లు వాటాలు ఇస్తున్నారా? అనే సందేహాలు స‌హ‌జం గానే తెర‌మీదికి వ‌స్తున్నాయి. అయినా.. మ‌న‌లో మ‌న మాట‌.. విప‌క్షం రెండు తింటే.. మ‌నోళ్లు.. అదే తెలుగు త‌మ్ముళ్లు ప‌ద‌హారు తిన్నార‌ట క‌దా?! ఇది నిజం కాదా. ప్ర‌జ‌ల‌పై దౌర్జ‌న్యాలు చేస్తోంది కూడా విప‌క్ష నాయకులేనా? కూనా? ఎక్క‌డ బ‌డితే అక్క భూక‌బ్జాల‌కు పాల్ప‌డుతోంది కూడా విప‌క్ష నాయ‌కులేనా.. మ‌నోళ్లా? చంద్ర‌బాబు వారానికోసారి త‌లంటుతోంది కూడా మ‌నోళ్ల‌కే క‌దా?!

మ‌రి మ‌న‌ద‌గ్గ‌రే అన్ని త‌ప్పులూ పెట్టుకుని విప‌క్షంలో ఉన్న వాళ్లు త‌ప్పు చేశారంటే.. మ‌న మాట‌లు ఎవ‌రైనా న‌మ్ముతారా చెప్పు! పైగా అధికారం మ‌న చేతుల్లోనే ఉంది. నిజంగానే విప‌క్ష నాయ‌కులు త‌ప్పు చేస్తే.. సింహం లాంటి పెద్దాయన చంద్ర‌బాబు ఊరుకుంటారా చెప్పు! ఏదైనా మ‌నం మాట్లాడే మాట‌లు నిజాయితీగా ఉండాలి. ఎన్నిక‌లు వ‌స్తున్నాయి. లేనిపోనివి త‌వ్వి.. విప‌క్షాల‌పై వేద్దామంటే.. మ‌న వైపు నాలుగు వేళ్లు చూపిస్తున్నాయి. మ‌రి ఈ విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి. పెద్దాయ‌న కూడా ఇదే చెబుతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు చేసింది చేశారు. ఈ నాలుగు నెల‌లు జాగ్ర‌త్త‌గా ఉండ‌మ‌ని ఆయ‌న చెబుతున్నారు. మ‌రి నువ్వు ఇలా బ‌రితెగించి రోడ్డుపైకి వ‌చ్చి బీరాలు ప‌లుకుతున్నాయి. మొద‌టికే మోసం వ‌స్తుందేమో గ‌మ‌నించరాదే!!

విప‌క్షంలో దొంగ‌లు.. మ‌రి అధికార పార్టీ ఏం చేస్తోంది..!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share