టీడీపీకి ఝలక్ ..వైసీపీలోకి మ‌రో కీల‌క నేత‌..!

December 16, 2018 at 10:27 am

ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ చంద్ర‌బాబుకు ఊహించ‌ని షాకులు త‌గులుతున్నాయి. ఏపీలో బాబు తీరుతో సొంత పార్టీ నేత‌లే లోలోప‌ల తీవ్ర అసంత‌`ప్తితో ర‌గిలిపోతున్నారు. ఇప్ప‌టికే ప‌లువురు నేత‌లు ఎవ‌రిదారి వారు చూసుకున్నారు. మ‌రికొంద‌రు త‌మ రాజ‌కీయ భ‌విష్య‌త్ కోసం ప‌క్క‌చూపులు చూస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ గెల‌వ‌డం క‌ష్ట‌మేన‌న్న సంకేతాలు అందుతున్న నేప‌థ్యంలో ఇత‌ర పార్టీల్లోకి జంప్ అయ్యేందుకు రెడీ అవుతున్నారు. తాజాగా.. గ‌తంలోనే టీడీపీ రాజీనామా చేసిన ఓ కీల‌క నేత ఇప్పుడు వైసీపీలో చేరేందుకు రెడీ అవుతున్నారు. ఈ నెలాఖ‌రులోగా జ‌గ‌న్ స‌మ‌క్షంలో చేరనున్న‌ట్లు ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు.

ముఖ్యంగా ఒంగోలు జిల్లాలో టీడీపీ గ‌డ్డు ప‌రిస్థితిని ఎదుర్కొంటోంది. వైసీపీ ఒంగోలు పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డితో గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు శనివారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాంబాబు విలేఖరులతో మాట్లాడుతూ ఈ నెలాఖరు లోపు తాను వైసీపీలో చేరనున్నట్లు ప్రకటించారు. నిజానికి.. 2014 ఎన్నిక‌ల త‌ర్వాత నెల‌కొన్న ప‌రిణామాల నేప‌థ్యంలో ఆయ‌న టీడీపీకి రాజీనామా చేసి సైలెంట్‌గా ఉంటున్నారు. వైసీపీలో చేరేందుకు కొంత‌కాలంగా ప్ర‌య‌త్నం చేస్తుండ‌గా.. ఇటీవ‌లే పార్టీ అధిష్ఠానం నుంచి గ్రీన్ సిగ్న‌ల్ అందిన‌ట్లు తెలిసింది. ఈ నేప‌థ్యంలో ఈనెల 26 లేదా 27న జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు.

రాంబాబు రాక‌తో జిల్లాలో వైసీపీ మ‌రింత బ‌లంగా ముందుకు వెళ్లే అవ‌కాశాలు ఉన్నాయ‌ని ప‌లువురు నాయ‌కులు అంటున్నారు. ఇదే స‌మ‌యంలో టీడీపీకి క‌ష్టాలు త‌ప్ప‌వ‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యం మూట‌గ‌ట్టుకోక త‌ప్ప‌ద‌ని వైసీపీ శ్రేణులు అంటున్నాయి. రాంబాబుతో పాటు, ఆయన మద్దతుదారులు పలువురు పెద్ద‌సంఖ్య‌లో వైసీపీలో చేర‌నున్నారు. బాలినేని శ్రీ‌నివాస్‌రెడ్డి, మాజీ ఎంపీ వైవీ సహకారంతో గిద్దలూరు నియోజకవర్గంలో వైసీపీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తానని రాంబాబు అన్నారు. ఏదేమైనా.. ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న స‌మ‌యంలో టీడీపీ నేత‌లు ఒక్కొక్క‌రుగా పార్టీని వీడుతుండ‌డంతో శ్రేణుల్లో ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది.

టీడీపీకి ఝలక్ ..వైసీపీలోకి మ‌రో కీల‌క నేత‌..!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share