జగన్ సిగ్నల్ ఇస్తే …ఎన్టీఆర్ మనవళ్లు మధ్య ఫైట్!

February 7, 2019 at 6:21 pm

ఏపీ రాజ‌కీయాల్లో ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ హాట్‌టాపిక్‌గా మారింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎన్టీఆర్ మ‌న‌వ‌ళ్లు బ‌రిలోకి దిగుతున్నార‌న్న ప్ర‌చారం జోరందుకుంది. ఇందులో ఒక‌రు వైసీపీ నుంచి మ‌రొక‌రు టీడీపీ నుంచి విశాఖ పార్ల‌మెంటు స్థానంలో పోరుకేక పెట్టేందుకు సిద్ధ‌మ‌వుతున్న వార్త‌లు గుప్పుమంటున్నాయి. ఇందులో ఎంత‌వ‌ర‌కు నిజం ఉందో తెలియ‌దుగానీ.. రాజ‌కీయ వ‌ర్గాల్లో మాత్రం ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది. ఎన్టీఆర్ ఇద్ద‌రు మ‌న‌వ‌ళ్లు రంగంలోకి దిగితే.. ఎన్టీఆర్ ఫ్యామిలీలో ఎవ‌రెటువైపు ఉంటార‌న్న‌ది కూడా అంద‌రిలో ఉత్కంఠ‌ను రేపుతోంది.HY28DAGGU

ఇంత‌కీ ఎవ‌రా మ‌న‌వ‌ళ్లు అని అనుకుంటున్నారా..? వారు మ‌రెవ‌రో కాదు.. ద‌గ్గ‌పాటి పురందేశ్వ‌రి కుమారుడు హితేష్‌, మ‌రొక‌రు బాల‌య్య చిన్న‌ల్లుడు, ఎంవీవీఎస్ మూర్తి, కావూరి సాంబ‌శివ‌రావుల మ‌న‌వ‌డు భ‌ర‌త్‌. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వీరిద్ద‌రూ విశాఖ పార్ల‌మెంటు స్థానం నుంచి పోటీ చేస్తార‌నే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇటీవ‌లే ద‌గ్గుపాటి వెంక‌టేశ్వ‌ర్‌రావు వైసీపీ అధినేత జ‌గ‌న్‌ను క‌లిసిన విష‌యం తెలిసిందే. అయితే.. ఎంవీవీఎస్ మూర్తి, బాల‌య్య‌బాబు ఇమేజ్‌ను ద‌`ష్టిలో పెట్టుకుని భ‌ర‌త్‌ను విశాఖ నుంచి పోటీ చేయిస్తే బాగుంటుంద‌న్న ఆలోచ‌న‌లో చంద్ర‌బాబు ఉన్న‌ట్లు పార్టీవ‌ర్గాల్లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.Sir-bharat

ఒక‌వేళ టీడీపీ నుంచి భ‌ర‌త్ బ‌రిలోకి దిగితే.. వైసీపీ నుంచి హితేష్‌ను రంగంలోకి దింపాల‌న్న ఆలోచ‌న‌లో వైసీపీ అధినేత జ‌గ‌న్ ఉన్న‌ట్లు వైసీపీ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌ర‌గుతోంది. ఇలా ఎన్టీఆర్ ఇద్ద‌రు మ‌న‌వ‌ళ్లు ప్ర‌త్య‌ర్థులుగా బ‌రిలో ఉంటే.. ఇక అక్క‌డ రాజ‌కీయ వాతావ‌ర‌ణం ఎలా ఉంటుందో ఊహించుకోవ‌చ్చు. ప్ర‌ధానంగా ఎన్టీఆర్ ఫ్యామిలీలో అందులోనూ హీరోలుగా ఉన్న జూనియ‌ర్ ఎన్టీఆర్‌, క‌ళ్యాణ్ రాం త‌దిత‌రులు ఎవ‌రికి జై కొడుతార‌న్న అంశంపై కూడా ఆస‌క్తిక‌ర‌మైన టాక్ వినిపిస్తోంది. ఇక ఈ విష‌యంలో క్లారిటీ రావాలంటే మ‌రికొన్ని రోజులు ఆగాల్సిందే మ‌రి.

జగన్ సిగ్నల్ ఇస్తే …ఎన్టీఆర్ మనవళ్లు మధ్య ఫైట్!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share