బెజ‌వాడ వైసీపీలో దూసుకుపోతున్న ఆ ఇద్దరు !

October 22, 2018 at 11:26 am
44444444443333

రాష్ట్ర రాజ‌కీయ రాజ‌ధాని విజ‌య‌వాడ‌లో వైసీపీ రాజ‌కీయాలు పుంజుకున్నాయా? అధికార పార్టీకి చెక్ పెట్టేలా ఇక్క‌డి నాయ‌కులు దూసుకుపోతున్నారా? నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఉప్పు-నిప్పు మాదిరిగా మారిన ఓ యువ‌నాయ‌కుడు ఇప్పుడు సైలెంట్ మార‌డంతో ప‌రిస్థితులు పార్టీకి అనుకూలంగా మారుతున్నాయా? అంటే.. ఔన‌నే అంటున్నారు విశ్లేష‌కులు. రాష్ట్రంలో అత్యంత కీల‌క‌మైన ప్రాంతాల్లో విజ‌య‌వాడ కూడా ఒక‌టి. నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఇక్కడ వైసీపీ రాజ‌కీయాలు చిట‌ప‌ట లాడాయి. కానీ, ఇప్పుడు వ్యూహాత్మ‌కంగా ఇద్ద‌రు నాయ‌కులు సంయుక్తంగా ముందుకు సాగుతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీని ఇక్క‌డ విజ‌య‌తీరం దిశ‌గా న‌డిపించాల‌ని నిర్ణ‌యించుకున్నారు.Vellampalli_Malladi

ఈ క్ర‌మంలోనే విజ‌య‌వాడ‌లో వైసీపీ రాజ‌కీయాలు ఊపందుకున్నాయి. గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డ వైసీపీ ఘోరంగా ఓడిపో యింది. విజ‌య‌వాడ ఎంపీ స‌హా మూడు అసెంబ్లీ స్థానాల్లో కేవ‌లం ప‌శ్చిమ విజ‌య‌వాడ మిన‌హా మిగిలిన చోట్ల ఓడిపోయిం ది. అయితే, ఇలా గెలిచిన నాయ‌కుడు కూడా టీడీపీలోకి చేరిపోయారు. దీంతో విజ‌య‌వాడ‌లో వైసీపీకి దిక్కుమొక్కు లేకుండా పోయింద‌నే వ్యాఖ్య‌లు వినిపించాయి. ఈ స‌మ‌యంలోనే ప‌లువురు నాయ‌కుల పేర్లు తెర‌మీదికి వ‌చ్చాయి అయితే, వీరిలో ఎవ‌రికి టికెట్ ల‌భిస్తుంది? ఎవ‌రికి ల‌భించ‌దు? అనే విష‌యంలో పెద్ద ఎత్తున నెల‌కొన్న‌సందేహాలు.. పార్టీని బ‌లోపేతం చేయ‌డంలో ఆశించిన విధంగా ఫలితాన్ని ఇవ్వ‌లేక‌పోయాయి.

అయితే, ఇప్పుడు మాత్రం వైసీపీకి బంగారు భవిష్యత్తు ఆశ‌లు క‌నిపిస్తున్నాయి. ఇద్ద‌రు నాయ‌కులు ప్ర‌ముఖంగా ప్ర‌జ‌ల్లోకి వెళ్తున్నారు. పార్టీని బ‌లోపేతం చేసేందుకు రోజుకో కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్నారు. వారే ఒక‌రు ప‌శ్చిమ నియోజ‌వ‌ర్గం నుంచి టికెట్ ఆశిస్తున్న వెల్లంప‌ల్లి శ్రీనివాస్‌, మ‌రొక‌రు సెంట్ర‌ల్ నుంచి టికెట్ క‌న్ఫ‌ర్మ్ చేసుకున్న మ‌ల్లాది విష్ణు. వీరిద్ద‌రూ కూడా నిత్యం ప్ర‌జ‌ల్లోనే ఉంటున్నారు. సంయుక్తంగా మీడియా స‌మావేశాలు కూడా నిర్వ‌హిస్తున్నారు. అటు ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించ‌డంతో పాటు పార్టీ త‌ర‌ఫున ప్ర‌జ‌ల‌కు జ‌రగ‌నున్న మేలు గురించి కూడా వివ‌రిస్తున్నారు. దీంతో వైసీపీ ఇప్పుడు విజ‌య‌వాడ‌లో కొత్త రెక్క‌లు క‌ట్టుకుని ముందుకు సాగుతోంది. ఆశావ‌హ దృక్ఫ‌థంతో ముదుకు సాగుతున్న నాయ‌కులు పార్టీని బ‌లోపేతం చేయ‌డంతోపాటు వ‌చ్చే ఎన్నిక‌ల్లో వీరి వ్యూహాలు బెజ‌వాడ‌లో వైసీపీకి కొత్త ఆశ‌లు రేకెత్తిస్తున్నాయి.

బెజ‌వాడ వైసీపీలో దూసుకుపోతున్న ఆ ఇద్దరు !
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share