అక్కడ వైసీపీలో `ముప్పు` త‌ప్పించేదెలా?

July 10, 2018 at 9:22 am
ycp-nellore

నెల్లూరు రాజ‌కీయాలు ఆస‌క్తిగా మారుతున్నాయి. నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఇక్క‌డ టీడీపీ ఇబ్బందులు ప‌డితే.. ఇప్పుడు అవే ఇబ్బందులు వైసీపీ కార్యాల‌యానికి చేరాయి. ముఖ్యంగా ఇక్క‌డ కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి ఆనం రామ‌నారా యణ‌రెడ్డి వైసీపీలో చేరుతున్నార‌న్న విష‌యం తెలిసిందే. అయితే, ఆయ‌న ఇంకా పార్టీ తీర్థం పుచ్చుకోక ముందే.. ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా ఓ వ‌ర్గం.. ఆయ‌న‌పై క‌ర‌ప‌త్రాలు ముద్రించి పంపిణీ ప్రారంభించింది. ఇది చినుకుచినుకు కాస్తా గాలివాన‌లా మారిన‌ట్టు.. రాజ‌కీయాలు ఉద్రిక్త‌త‌ల‌కు దారితీస్తున్నాయి. 

 

విష‌యంలోకి వెళ్తే.. సుదీర్ఘ కాలం కాంగ్రెస్‌లో చ‌క్రం తిప్పిన ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి ఆయ‌న సోద‌రుడు దివంగ‌త వివేకానంద రెడ్డిలు.. టీడీపీలో చేరారు. అయితే, ఇక్క‌డ ఆశించిన గుర్తింపు ల‌భించ‌లేదు. దీంతో పార్టీ మార్పు అనివార్య‌మైంది. ఎప్ప‌టి నుంచో వైసీపీ నుంచి  అందుతున్న ఆహ్వానాల నేప‌థ్యంలో ఆనం రామ నారాయ‌ణ రెడ్డి త్వ‌ర‌లోనే జ‌గ‌న్ గూటికి చేరేందుకు రెడీ అయ్యారు. ఈ క్ర‌మంలోనే అన్ని కార్య‌క‌లాపాల‌ను తెర‌వెనుక నిర్వ‌హించు కుంటున్నారు. ఇదిలావుంటే, ఆనం రాక‌తో.. ఇక్క‌డ వైసీపీలో పెను సంచ‌ల‌నం రేగుతోంది. ఆయ‌న రాక‌తో.. త‌న సీటును త్యాగం చేయాల్సి వ‌స్తుంద‌ని భావిస్తున్న మేక‌పాటి గౌతం రెడ్డి.. ఆనంకు వ్య‌తిరేకంగా అప్పుడే చ‌క్రం తిప్ప‌డం ప్రారంభించాడు.  

 

మీడియాలోనూ ఆనంపై విసుర్లు, ఆనం రాజకీయ జీవితంపై కరపత్రాలు పంచుతున్నారు. రామ నారాయణరెడ్డి వైసీపీలో చేరే క్రమంలో ఆ పార్టీ అధినేత జగన్‌ను కలిసిన నేపథ్యంలో ఒక్కసారిగా మేకపాటి కుటుంబీకులు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాల్లో వైసీపీ రాజకీయాలు వేడెక్కాయి. మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ ఉదయగిరి టిక్కెట్టు తనకేనని, గెలుపొందడం కూడా ఖాయమని పేర్కొన్నారు. నెల్లూరు ఎంపీగా మేక‌పాటి రాజమోహన్‌రెడ్డి, ఆత్మకూరు నుంచి గౌతమ్‌రెడ్డి పోటీ చేయడం తథ్యమని ఆయన వివరించారు. అంతేకాదు, ఆనం రామ నారాయణరెడ్డి చేరికను పరోక్షంగా వ్యతిరేకించారు. జగన్‌ మోహన్‌రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులపై ఆనం సోదరులు గతంలో చేసిన వ్యాఖ్యలను పరోక్షంగా ప్రస్తావిస్తూ ప్రజలు అంతా గమనిస్తున్నారన్నారు. 

 

ఈ ప‌రిణామాలు ఇప్పుడు నెల్లూరు వైసీపీ రాజ‌కీయాల్లో వేడి పుట్టిస్తున్నాయి. మ‌రో ప‌దిమాసాల్లోనే ఎన్నిక‌లు ఉండ‌డం, ఇప్పుడు ఇలాంటి ప‌రిణామాలు ఎదురు కావ‌డం నేప‌థ్యంలో జ‌గ‌న్ వ్యూహా త్మ‌కంగా వ్య‌వ‌హ‌రించే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇక్క‌డ ఆనంను నేరుగా ఎన్నిక‌ల్లోకి దింప‌కుండా నామినేటెడ్ ప‌ద‌వి ఇచ్చి మంత్రివ‌ర్గంలోకి తీసుకునే అవ‌కాశం ఉంటుంద‌ని స‌మాచారం. లేనిప‌క్షంలో ఇక్క‌డ వైసీపీ రెండు గా చీలినా ఆశ్చ‌ర్య ప‌డాల్సిన ప‌నిలేద‌ని అంటున్నారు విశ్లేష‌కులు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. 

అక్కడ వైసీపీలో `ముప్పు` త‌ప్పించేదెలా?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share