వైసీపీకి ప్ర‌త్యామ్నాయం లేన‌ట్టే…!!

November 19, 2018 at 11:29 am

ఏపీలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న జ‌గ‌న్ పార్టీ వైసీపీపై జోరుగా చ‌ర్చ సాగుతోంది. ప్ర‌స్తుతం తాను అభివృద్ధిలో దూసుకు పోతున్నాన‌ని చెబుతున్న టీడీపీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబుకు జ‌గ‌న్ మాత్రమే పోటీ అవుతాడ‌నే విష‌యంపై ఎక్క‌డా సందేహ‌మే లేద‌ని ప్ర‌తి ఒక్క‌రూ భావిస్తున్నారు. నిజానికి రాష్ట్రంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు ఉన్న అనుభ‌వాన్ని బ‌ట్టి.. ఆయ‌న‌కు తిరుగేలేద‌ని, ప్ర‌జ‌లు ఆయ‌న‌కు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డ‌తార‌ని ఎవ‌రైనా అనుకుంటారు. కానీ, పైకి మాట‌ల‌తో ప‌బ్బం గ‌డుపుతున్న చంద్ర‌బాబుకు ఇప్పుడు అన్ని వైపుల నుంచి కూడా తీవ్ర‌మైన ఒత్తిళ్లు ఎదుర‌వుతున్నాయి. న‌ల‌భై ఏళ్ల సీనియార్టీని రంగ‌రించి.. చంద్ర‌బాబు.. రాష్ట్రానికి మేలు చేస్తుంటే.. ఆయ‌న‌నేతిరిగి ఎన్నుకునేందుకు ప్ర‌జ‌ల‌కు ఎలాంటి అభ్యంత‌రం లేదు.46418520_2047391308614659_4685140297175269376_n

కానీ, త‌మ్ముళ్లు మేసేస్తున్నా.. త‌ప్పు త‌న‌ది కాద‌ని నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టు వ్య‌వ‌హ‌రించ‌డమే ఇప్పుడు అస‌లు సిస‌లు స‌మ‌స్య గా మారింది. ఈ క్ర‌మంలోనే రాష్ట్రంలో మ‌రో ప్ర‌త్యామ్నాయం ఏంటి? అనే ప్ర‌శ్న తెర‌మీదికి వ‌స్తోంది. ప్ర‌శ్నిస్తానంటూ.. రాజకీయ అరంగేట్రం చేసిన ప‌వ‌న్ వైపు కొన్ని వేళ్లు చూపిస్తున్నా.. ఆయ‌న వ్య‌వ‌హార శైలి.. నిల‌క‌డ లేని మాట‌లు, వ్యాఖ్య ల పోరాటాలు త‌ప్ప నిజ‌మైన పోరాటాల‌కు ఎక్క‌డా ముందుకు రాక‌పోవ‌డం వంటివి.. ప‌వ‌న్ ను చాలా వ‌ర‌కు మైన‌స్ చేశాయి. దాదాపు రాష్ట్రంలోని నాలుగు జిల్లాలు నెల్లూరు, క‌డ‌ప, క‌ర్నూలు, ప్ర‌కాశంల‌లో ప‌వ‌న్ జాడ ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. దీంతో ఆయ‌న కేవ‌లం మిగిలిన వాటికే ప‌రిమిత‌మ‌వుతాడ‌నే విష‌యం దాదాపు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో రాష్ట్రంలో టీడీపీకి బ‌ల‌మైన ప్ర‌త్యామ్నాయం ఏంట‌ని చూస్తే ఒక్క‌వైసీపీనే క‌నిపిస్తోంది.46414987_2044541382232985_3177556593881382912_n

తాజాగా ఇదే విష‌యాన్ని ఉత్త‌రాంధ్ర‌కు చెందిన ఓ సీనియ‌ర్ నాయ‌కుడు, కాంగ్రెస్‌కు చెందిన మాజీ నేత కూడా స్ప‌ష్టం చేశారు. రాష్ట్రంలో ఎన్ని పార్టీలు ఉన్నా.. కూడా.. టీడీపీకి ప్ర‌త్యామ్నాయం.. వైసీపీనేన‌ని అంద‌రూ ముక్తకంఠంతో చెబుతున్న మాట‌. మ‌రో నాలుగు నెల‌లోనే ఎన్నిక‌ల‌కు రాష్ట్రం సిద్ధ‌మ‌వుతున్న నేప‌థ్యంలో జ‌గ‌న్ ముందు మ‌రింత బాధ్య‌తా యుత‌మైన ప‌రిస్థితి ఉన్న‌ట్టు తెలుస్తోంది. నిజానికి అధికార‌పార్టీ నేత‌ల మాదిరిగా వైసీపీ నాయ‌కులు ఎక్క‌డా గాడి త‌ప్పి ప్ర‌వ‌ర్తించ‌డం అనేది లేదు. జ‌గ‌న్ ఎక్క‌డా క్ర‌మ‌శిక్ష‌ణ‌.. అంటూ బ‌హిరంగంగా చెప్ప‌క పోయినా. నాయ‌కులు మాత్రం క్ర‌మ‌శిక్ష‌ణ‌కు, క‌ట్టుబాటుకు ఎన్న‌డూ దాట‌లేదు. దీనిని బ‌ట్టి ఇటు.. ప్ర‌జ‌ల ఆశ‌, నాయ‌కులు క్ర‌మ‌శిక్ష‌ణ, అధినేత ముందు చూపు వంటివి కూడా వైసీపీని ముందు ప్లేస్‌లోనిల‌బెడుతుండ‌డం గ‌మ‌నార్హం. దీంతో వైసీపీదే తిరుగులేని ప్ర‌భావం అంటున్నారు ప‌రిశీల‌కులు.

వైసీపీకి ప్ర‌త్యామ్నాయం లేన‌ట్టే…!!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share