రంగంలోకి షర్మిల …పోటీ అక్కడనుండే

September 10, 2018 at 10:17 am

ఒంగోలు జిల్లా రాజ‌కీయాల్లో కీల‌క మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అధికార టీడీపీ, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీలు ప‌ట్టుకోసం వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నాయి. వైసీపీని ప‌డ‌గొట్టాల‌ని టీడీపీ.. టీడీపీకి ప‌ట్టునివ్వొద్ద‌ని వైసీపీ.. ఇలా ఎత్తుకుపైఎత్తులు వేస్తున్నాయి. ప్ర‌ధానంగా ఇటీవ‌ల చంద్ర‌బాబు చేసిన ఓ కీల‌క ప్ర‌క‌న‌ట‌తో రాజ‌కీయ వాతావ‌ర‌ణం మ‌రింత‌గా వేడెక్కింది. ఈ క్ర‌మంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌లువురు అభ్య‌ర్థుల మారుతార‌నే టాక్ వినిపిస్తోంది. ఇందులో ప్ర‌ధానంగా వైసీపీలో భారీ మార్చులు జ‌రిగే అవ‌కాశాలు ఉన్న‌ట్లు పార్టీవ‌ర్గాలు అంటున్నాయి. నిజానికి ఒంగోలులో వైసీపీకి మంచి ప‌ట్టుంది. అందులోనూ ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గంలో ఆ పార్టీకి తిరుగులేదు. అందుకే.. 2014 ఎన్నికల్లో ఎలాంటి రాజకీయ అనుభవం లేకపోయినా, వైఎస్‌ తోడల్లుడు వైవీ సుబ్బారెడ్డి ఒంగోలు ఎంపీగా సుల‌భంగా గెలిచారు.SHARMILA-JAGAN-RAKHI

ఎర్రగొండపాలెం, మార్కాపురం, గిద్దలూరుతోపాటు త‌దిత‌ర‌ ప్రాంతాలు వైసీపీకి కంచుకోట‌లే. ఇక్కడ రెడ్డి సామాజిక వర్గం బ‌లంగా ఉంది. అంతేగాకుండా. ఎస్సీ, ముస్లిం జనాభా కూడా ఆ పార్టీవైపే మొగ్గుచూపింది. అయితే ఇటీవల ఒంగోలులో జరిగిన ధర్మపోరాట దీక్షలో సీఎం చంద్రబాబు వెలుగొండ ప్రాజెక్టుపై కీల‌క‌ ప్రకటన చేశారు. మొదటి టన్నెల్‌ పనులు వేగంగా పూర్తి చేసి వచ్చే సంక్రాంతికల్లా నీటిని అందించి స‌స్య‌శ్యామ‌లం చేస్తామ‌ని ఆయ‌న‌ హామీ ఇచ్చారు. ఈ ప్ర‌క‌ట‌న వైసీపీ బ‌లంగా ఉన్న ప్రాంతాల‌ను ప్ర‌బావితం చేసే అవ‌కాశం ఉంది. ఇప్ప‌టికే ప‌లువురు వైసీపీ నాయ‌కులు టీడీపీలో చేరారు. ఇక చంద్ర‌బాబు చేసిన ప్ర‌క‌ట‌న‌తో టీడీపీ మ‌రింత పుంజుకునే అవ‌కాశం ఉంది. దీంతో రాజ‌కీయంగా త‌మ‌కు ఇబ్బంది త‌ప్ప‌ద‌ని భావించిన వైసీపీ నేత‌లు వెంట‌నే అప్ర‌మ‌త్తం అయ్యారు. 21VJPG4-YVSUBBAREDDYINTERVIEWFRONTLINEDELHI

వెంట‌నే ప్రాజెక్టు పనులు త్వరగా చేపట్టాలని డిమాండ్ చేస్తూ.. వైవీ సుబ్బారెడ్డి కనిగిరి నుంచి వెలుగొండ వరకూ యాత్ర చేపట్టడం గ‌మ‌నార్హం. తమ పోరాటంతో ప్రభుత్వం దిగొచ్చిందని ప్ర‌జ‌ల‌కు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే క్ర‌మంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఒంగోలు పార్ల‌మెంటు స్థానంలో అభ్య‌ర్థిని మార్చే ఆలోచ‌న‌లో కూడా పార్టీ అధిష్టానం ఉన్న‌ట్లు తెలుస్తోంది. అయితే ఇక్క‌డి నుంచి వైఎస్ షర్మిలను బ‌రిలోకి దింపితే అన్నినియోజ‌క‌వ‌ర్గాల‌పై ప్ర‌భావం ప‌డుతుంద‌ని.. ఇది పార్టీకి బాగా క‌లిసివ‌స్తుంద‌ని క్యాడ‌ర్ అంటున్న‌ట్లు తెలుస్తోంది. అంతేగాకుండా.. పార్టీలో నెల‌కొన్న గ్రూపు విభేదాలు కూడా పోయి.. ష‌ర్మిల‌కు అంద‌రూ స‌హ‌క‌రిస్తార‌ని చెబుతున్న‌ట్లు స‌మాచారం. వైసీపీకి మంచి పట్టున్న అసెంబ్లీ నియోజకవర్గాలు ఎర్రగొండపాలెం, మార్కాపురం, గిద్దలూరులతో పాటు కనిగిరి, ఒంగోలు, కొండెపి, దర్శి నియోజకవర్గాల్లో కూడా గెల‌వ‌చ్చున‌ని పార్టీ నేత‌లు ధీమా వ్య‌క్తం చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. అయితే.. ఈ విష‌యంలో జ‌గ‌న్ ఏ నిర్ణ‌యం తీసుకుంటారో చూడాలి మ‌రి.

రంగంలోకి షర్మిల …పోటీ అక్కడనుండే
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share