షాకింగ్‌గా మారిన నిఖిల్ పెళ్లి…. అమ్మాయి ఎవ‌రో తెలుసా

August 8, 2017 at 5:35 am
Nikhil

టాలీవుడ్‌లోని ఎలిజ‌బుల్ బ్యాచిల‌ర్స్‌లో నిఖిల్ ఒక‌రు. యంగ్ హీరో, హుషారైన కుర్రాడు అయిన నిఖిల్ స్వామిరారా, కార్తీకేయ‌, సూర్య వ‌ర్సెస్ సూర్య, ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా ఇలా వ‌రుస హిట్ల‌తో దూసుకుపోతున్నాడు. నితిన్‌కు మంచి మార్కెట్ రావ‌డంతో వ‌రుస ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి. దీంతో ఇప్పుడు సెల‌క్టివ్‌గా క‌థ‌లు ఎంపిక చేసుకుంటున్నాడు.

ఇదిలా ఉంటే నిఖిల్ పెళ్లికొడుకు కాబోతున్నాడు. త‌న బ్యాచిల‌ర్ లైఫ్‌కు గుడ్ బై చెప్పేయ‌బోతున్నాడు. నిఖిల్‌కు పెళ్లి వ‌య‌స్సు క‌రెక్టుగా రావ‌డంతో పాటు ఇటు కెరీర్ ప‌రంగా ఫామ్‌లో ఉండ‌డంతో ఇంట్లో వాళ్లు గ‌త యేడాదిగా పెళ్లి సంబంధాలు చూస్తున్నారు.

చివ‌ర‌కు వారికి ద‌గ్గ‌ర బంధువుల్లోనే ఓ అమ్మాయితో మ్యాచ్ సెట్ అయ్యింది. హైద‌రాబాద్‌కే చెందిన ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త ఆంజ‌నేయులు కుమార్తె తేజ‌స్వినితో నితిన్ పెళ్లి జ‌ర‌గ‌నుంది. వీరి ఎంగేజ్‌మెంట్ ఈ నెల 24న జ‌రుగుతుండ‌గా, పెళ్లి డేట్ ఇంకా ఫిక్స్ కాలేదు. మొత్తానికి నిఖిల్ బ్యాచిల‌ర్ లైఫ్‌కు శుభం కార్డు ప‌డిపోతోంది.

 

షాకింగ్‌గా మారిన నిఖిల్ పెళ్లి…. అమ్మాయి ఎవ‌రో తెలుసా
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts