ఎన్టీఆర్ స‌మ‌స‌మాజ్ పార్టీ… పోటీ ఎక్క‌డో తెలుసా…!

ప్ర‌స్తుతం తెలుగులో ఎక్క‌డ చూసినా, ఎవ‌రి నోట విన్నా బిగ్ బాస్ షోలో ఎన్టీఆర్ గురించే చ‌ర్చ జ‌రుగుతోంది. మామూలుగా బిగ్ బాస్ షోకు అనుకున్న రేంజ్‌లో రెస్పాన్స్ రావ‌డం లేదు. కానీ ఎన్టీఆర్ ఎంట్రీ ఇచ్చిన వీకెండ్స్‌లో మాత్రం టీఆర్పీలు పేలిపోయాయి. ఇక ఇటు బిగ్ బాస్ షో హోస్టింగ్‌తో పాటు అటు త‌న తాజా సినిమా జై ల‌వ‌కుశ షూటింగ్‌లో కూడా ఎన్టీఆర్ ఫుల్ బిజీగా ఉన్నాడు.

జై ల‌వ‌కుశ టైటిల్‌తో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో ఎన్టీఆర్ జై ల‌వ కుశ అనే మూడు విభిన్న‌మైన పాత్ర‌ల్లో న‌టించ‌నున్నాడు. తాజాగా ఈ సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌ బయటకు వచ్చింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ ఓ ప‌వ‌ర్ ఫుల్ పొలిటిషీయిన్‌గా క‌నిపించ‌నున్నాడు.

‘సమసమాజ్‌’ పార్టీ నేతగా ఎన్టీఆర్‌ కనిపించనున్నాడు. ఈ పాత్ర‌కు సంబంధించిన ఫొటోలు ప్ర‌స్తుతం ఇంట‌ర్నెట్‌లో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ‘సమసమాజ్‌’ పార్టీ జెండాలు, వాటి మీద ఎన్టీఆర్‌ బొమ్మలు ఉన్న ఫోటలు బయటకు వచ్చాయి.

ఆ జెండాలపై పేరు ఇంగ్లీష్‌, హిందీ బాషల్లో ఉండడంతో ఎన్టీఆర్ నార్త్‌కు చెందిన పొలిటిషీయన్‌గా క‌నిపించ‌నున్నాడ‌ని తెలుస్తోంది. మ‌రి ఈ సినిమాలో ఎన్టీఆర్ ఎలా విజృంభించాడో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. జై ల‌వ‌కుశ సినిమాను సెప్టెంబ‌ర్ 21న రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు.