లోకేశ్‌కు అంత సులువు కాదు బాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబు త‌న‌యుడు లోకేశ్ ఎమ్మెల్సీ అయిన మూడు రోజుల‌కే తండ్రి కేబినెట్‌లో కీల‌క‌మైన శాఖ‌ల‌కు మంత్రి అయిపోయాడు. లోకేశ్‌ను ఎలా మంత్రిని చేయాలా ? అని గ‌త రెండేళ్లుగా ఉక్కిరి బిక్కిరి అయిన చంద్ర‌బాబుకు ఓ టెన్ష‌న్ తీరిపోయింది. ఇక ఇప్పుడు చంద్ర‌బాబుకు ముందు ఉన్న‌ద‌ల్లా లోకేశ్‌ను జ‌గ‌న్‌కు ధీటైన పొలిటిక‌ల్ లీడ‌ర్‌గా లోకేశ్‌ను తీర్చిదిద్దాల్సి ఉంది. లోకేశ్‌ను ఎమ్మెల్సీ, మంత్రిని చేసినంత ఈజీగా మాత్రం చంద్ర‌బాబు స్ట్రాంగ్ పొలిటిక‌ల్ లీడ‌ర్‌గా తీర్చిదిద్ద‌లేడు.

లోకేశ్‌ను జ‌గ‌న్‌కు గ‌ట్టి పోటీ ఇచ్చే లీడ‌ర్‌గా తీర్చిదిద్ద‌డం ఈ రెండేళ్ల‌లో చంద్ర‌బాబుకు క‌త్తిమీద సాములాంటిదే. మ‌రోవైపు ఆయ‌న‌కు ఉన్న టెన్ష‌న్స్ ఆయ‌న‌కు ఉన్నాయి. ఓ వైపు న‌వ్యాంధ్ర‌ను అభివృద్ధి చేయాలి, రాజ‌ధాని నిర్మాణం, పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణం..వీట‌న్నింటికి మించి 2019 ఎన్నిక‌ల్లో పార్టీని మ‌రోసారి అధికారంలోకి తీసుకురావాలి. ఇన్ని స‌మ‌స్య‌ల మ‌ధ్య బాబుకు లోకేశ్ మీద కాన్‌సంట్రేష‌న్ చేసేంత టైం ఎక్క‌డ ? ఉంటుంది.

ఇక లోకేశ్ త‌న శాఖ‌ల్లో ఎలాంటి నిర్ణ‌యం తీసుకోవాల‌న్నా కంగారు లేకుండా ఉండేందుకు చంద్ర‌బాబు ఆయ‌న్ను జ‌ల‌వ‌న‌రుశాఖా మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావుకు ఎటాచ్ చేసిన‌ట్టు టాక్‌. ఇక‌పై లోకేశ్ త‌న శాఖ‌లో తీసుకునే ఏ డెసిష‌న్ అయినా ఉమాతో ముందుగా చ‌ర్చించాల‌ని బాబు రూల్ పెట్టార‌ట‌.

ఇక లోకేశ్‌ను క‌ర్నూలు జిల్లాకు ఇన్‌చార్జ్ మంత్రిగా నియ‌మించ‌డంతో పాటు అక్క‌డ కూడా లోకేశ్‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు త‌న‌కు న‌మ్మిన‌బంటు అయిన ఐఏఎస్ అధికారి ప్ర‌ద్యుమ్న‌ను క‌లెక్ట‌ర్‌గా నియ‌మిస్తున్నార‌ట‌. అలా లోకేశ్‌ను జ‌గ‌న్‌కు ధీటుగా రెడీ చేసేందుకు చంద్ర‌బాబు ర‌క‌ర‌కాలుగా ప్లాన్లు వేస్తున్నట్టు స్ప‌ష్ట‌మ‌వుతోంది.

లోకేశ్ కోసం చంద్ర‌బాబు ఎన్ని చేసినా మ‌నోడికి ఇప్ప‌ట‌కీ స‌రిగ్గా మాట్లాడ‌డం కూడా రావ‌ట్లేదు. ఆయ‌న ఎమ్మెల్సీగా ప్ర‌మాణ స్వీకారం చేసిన రోజునే త‌ప్పుల త‌డ‌క‌ల‌తో ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. మంత్రిగా తొలి సంత‌కం పెట్టే రోజున కూడా పెన్ మ‌ర్చిపోయారు. మ‌రి ఈ స్థాయిలో ఉన్న లోకేశ్‌ను జ‌గ‌న్‌కు ధీటుగా రెడీ చేయ‌డం బాబుకు అంత వీజీ కాదేమో..!