బిగ్ బాస్ షోలో డ్ర‌గ్స్ మాఫియా బ్యాచ్‌

July 16, 2017 at 5:03 pm
add_text00002

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తోన్న బిగ్ బాస్ షో ఆదివారం నుంచి మా టీవీలో ప్ర‌సారం కానున్న సంగ‌తి తెలిసిందే. ఎన్టీఆరే స్వ‌యంగా హోస్ట్ చేసేందుకు ఒప్పుకోవ‌డంతో ఈ షోపై ఎక్క‌డా లేని క్రేజ్ ఇప్ప‌టికే తెలుగు నాట నెల‌కొంది. ఇక ఈ షోలో మొత్తం 12 మంది సెల‌బ్రిటీలు పాల్గొంటోన్న సంగ‌తి తెలిసిందే. 

ఇదిలా ఉంటే ప్ర‌స్తుతం టాలీవుడ్‌ను డ్ర‌గ్స్ మాఫియా కుదిపేస్తోంది. ఈ డ్ర‌గ్స్ ఉదంతంలో ప‌లువురు ప్ర‌ముఖుల పేర్లు బ‌య‌టకు వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇక ఎన్టీఆర్ బిగ్ బాస్ షోలో పాల్గొన్న వారిలో కొంద‌రికి డ్ర‌గ్స్ మాఫియాకు లింకులు ఉన్న‌ట్టు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు ఈ రాకెట్‌లో ఇరుక్కున్న వారిని ఇప్పుడు షోలో ఉంచాలా ?  లేదా ?  షోకు ముందే ఎలిమినేట్ చేయాలా ?  అన్న‌ది పెద్ద స‌స్పెన్స్‌గా మారింది.

ఇక ఈ షోలో బ‌ర్నింగ్‌స్టార్ సంపూర్ణేష్‌బాబుతో పాటు ఫిల్మ్ క్రిటిక్ క‌త్తి మ‌హేశ్ కూడా పాల్గొంటున్న‌ట్టు తెలుస్తోంది. ఏదేమైనా షో టెలికాస్ట్ అయ్యేందుకు ముందే కాంట్ర‌వ‌ర్సీల్లో చిక్కుకున్న బిగ్ బాస్ షో ఇంకెన్ని సంచ‌ల‌నాలు క్రియేట్ చేస్తుందో ?  చూడాలి. 

బిగ్ బాస్ షోలో డ్ర‌గ్స్ మాఫియా బ్యాచ్‌
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts