ఎన్టీఆర్ ఇమేజ్‌ను డ్యామేజ్ చేస్తోన్న బిగ్ బాస్‌

తెలుగు బుల్లితెర మీద అత్యంత ఖ‌రీదైన షో అయిన బిగ్‌బాస్‌ రియాల్టీ షోకి ఎన్టీఆర్‌ హోస్ట్‌ చేస్తున్నాడనగానే క్రియేట్ అయిన హైప్ అలాంటిది ఇలాంటిది కాదు. ఈ షో ఎన్నో సంచ‌ల‌నాల‌కు కేంద్ర బిందువు అవుతుంద‌ని, టీఆర్పీ రేటింగ్స్ రికార్డులు బ‌ద్ద‌లు కావ‌డం ఖాయ‌మ‌న్న ప్ర‌చారం జ‌రిగింది. ఇక రెమ్యున‌రేన్ ప‌రంగా కూడా ఎన్టీఆర్ ఎన్నో స‌రికొత్త రికార్డులు క్రియేట్ చేయ‌డంతో బిగ్ బాస్ షోపై ప్ర‌సారానికి ముందు ఉన్న అంచ‌నాలు అన్నీ ఇన్నీ కావు.

క‌ట్ చేస్తే బిగ్ బాస్ షో ప్రారంభ‌మైంది. మ‌రి ఇప్పుడు ఈ షో నిజంగా అల‌రిస్తుందా ? అని ప్ర‌శ్నించుకుంటే తెల్ల‌మొఖం వేయాల్సిందే. వెరీ ఫూర్ స్క్రిఫ్ట్‌తో ఈ షో న‌డుస్తుంద‌న్న విమ‌ర్శ‌లు తీవ్రంగా వ‌స్తున్నాయి. ఇక్క‌డ కంటెస్టెంట్లు చాలా సిల్లీగా యాక్ట్ చేస్తున్నారు. ఇది రియాలిటీ షో. ఇక్క‌డ న‌టించ‌డం కంటే జీవించాలి.

హిందీలో ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన సీజ‌న్ల‌లో షోలో కంటెస్టెంట్లు ఎంతో ర‌క్తి క‌ట్టించారు. 71 రోజుల పాటు 14మంది సెలబ్రిటీలు ఓ హౌస్‌లో వుండాలి. హౌస్‌మేట్స్‌ అంతా ఒకరితో ఒకరు కలిసిపోవాలి. కొట్లాడుకోవాలి, కామెడీ చేయాలి…ఇలా చేస్తే షో ఓ రేంజ్‌లో ర‌క్తి క‌డుతుంది. కానీ ఇక్క‌డ మ‌న తెలుగు బిగ్ బాస్ హౌస్‌లో కంటెస్టెంట్లు నీర‌సానికి అక్క‌లు, అన్న‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

ఇక్క‌డ కాంట్ర‌వ‌ర్సీలు చూస్తే చిన్న‌పిల్లాడికి కూడా చికాకు వ‌చ్చేలా ఉన్నాయి. సిగ‌రెట్ల కోసం కొట్టుకుంటున్నారు. శివ‌బాలాజీ సిగ‌రెట్ల కోసం ఏకంగా తార‌క్‌తోనే మాట్లాడేసి ఏదో ఒకటి తేల్చేస్తాన‌ని రెచ్చిపోవ‌డం, మిగిలిన వాళ్లు నానా హ‌డావిడి చేసేయ‌డం చూస్తుంటే షోపై క్యూరియాసిటీ అస్స‌లు ఉండ‌డం లేదు.

ఇక తెలుగులో మాట్లాడాల‌న్నా నిబంధ‌న భేఖాతార్ చేస్తున్నారు. సో ఈ ఎఫెక్ట్ అంతా ఇప్పుడు ఎన్టీఆర్ మీదే ప‌డ‌నుంది. ఈ షోకు సంబంధించి ఎన్టీఆర్ చేసేదేమి లేక‌పోయినా…షో ప్రారంభానికి భారీ హైప్ రావ‌డానికి కార‌ణం మాత్రం ఎన్టీఆరే. ఇప్పుడు ఫ‌స్ట్ వీక్ కాకుండానే నీర‌సంగా న‌డుస్తుండ‌డంతో బుల్లితెర మీద ఎన్టీఆర్ ఇమేజ్‌కు చిన్న‌పాటి డ్యామేజ్ అయ్యే ప‌రిస్థితి వ‌చ్చింది.